ఇప్పటివరకు వినియోగదారులకు ఫ్రీ సేవలు అందిస్తూ వచ్చిన స్టార్ మూవీస్ ఇకపై “పే ఛానల్” కానుందా..? అదే జరిగితే మన దేశంలో ఈ తరహా ఛానల్స్‍లో ‘పే ఛానల్’ అయ్యేది ఇదే మొదటిది అవుతుంది. ఈ విషయంలో ‘స్టార్‌మూవీస్’ వర్గాలకు, కేబుల్ ఆపరేటర్ల సంఘానికి మధ్య ఇటీవలే సంప్రదింపులు జరిగాయి. మా ఛానల్ సేవలు మీకు అందాలంటే మీరు పే చేయక తప్పదు అని స్టార్‌మూవీస్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కేబుల్ ఆపరేటర్లకు చెప్పారు. ఈ ఛానల్‍ను చూసే కొందరు వినియోగదారుల్లో నెలకు 150 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు. అయితే తమ బడ్జెట్ లక్ష్యాన్ని సాధించాలంటే పే చేయక తప్పదని స్టార్‌మూవీస్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో 154 పే ఛానల్స్ రిజిస్టరై ఉన్నాయి. తమ ప్రసారాలు కేబుల్ ఆపరేటర్లకు అందాలంటే వారు 20 శాతం చెల్లించాల్సిందేనని స్టార్‌మూవీస్ వర్గాలు అన్నాయి. అయితే ఇప్పటికే పెరిగిన ఛార్జీలతో, రేట్లతో సతమతమవుతున్న సామాన్య మానవుడు ఈ ‘పే ఛానల్’ కోసం అదనంగా చెల్లిస్తాడా… అన్నది సందేహమే ..! ఇంటిల్లిపాదికీ వినోదం అందించే టివి కార్యక్రమాలు ఇలా సొమ్ముతో ముడి పడుతున్నాయి. ‘స్టార్‌మూవీస్’లో ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు ఇక దీనిని పే ఛానల్‍గానే చూడాల్సిఉంటుందేమో..!
Source: medianx.tv
No comments:
Post a Comment