రియాల్టీ షోల మీద తెలుగు ఛానళ్ల దృష్టి పడింది. ‘కొండవీటి రాజా, కోటలో రాణి’ అన్న టైటిల్‍తో జీ తెలుగు ఛానెల్ ఓ రియాల్టీ షోను ప్రారంభించింది. రాత్రి 9 గంటల స్లాట్‍లో ఇది ఒకటిన్నర గంటల పటు టెలికాస్ట్ అవుతుంది. వారంలో మూడురోజులు సోమ, మంగళ, బుధవారాల్లో ఈ సరికొత్త రియాల్టీ షో ఉంటుంది. సిటీలు అంటే నగరాల్లో ఉండే అమ్మాయిలు – అతి మారుమూల ప్రాంతాల్లోని గిరిజన యువకులను స్టైలిష్ కుర్రాళ్లుగా తీర్చిదిద్దడమే ఈ షో ఉద్దేశం. రెండు వేర్వేరు జీవనవిధానాలను ఒకే వేదికపైకి తేవడంమే దీని లక్ష్యం. ఈ షో ప్రకారం 10 మంది గిరిజన యువకులు, మరో 10 మంది సిటీగర్ల్స్ ఈ షోలో పాల్గొంటారు. ఏ అమ్మాయి ఏ యువకుడిని ఆధునిక కుర్రాడిగా మారుస్తుందో ఆమె విజేత అవుతుంది. ప్రతి ఆరో ఎపిసోడ్‍లో ‘ఎలిమినేషన్’ ఉంటుంది. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, సీలేరు, చింతపల్లి, ఆదిలాబాద్‍లోని ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, ఖమ్మంలోని చింతూరు, కూనవరంతో బాటు శ్రీశైలం అడవులకు చెందిన గిరిజన లేదా సాధారణ యువకులు ఇందులో పాల్గొంటారు.
ఈ షోకు సినీ నటి సదా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారని జీ తెలుగు వర్గాలు తెలిపాయి. దీన్నిబట్టి చూస్తే టివి 9 ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “బీ ఎ స్టార్” కార్యక్రమం గుర్తుకు రావడం లేదూ? ట్రెండ్ సెట్టర్ అంటే ఇదే మరి…
Source: medianx.tv
No comments:
Post a Comment