క్రూరమృగాలు, వన్యప్రాణులకు సంబంధించిన అంశాలనే కాక, అతి దుర్గమ ప్రాంతాలు, అడవులు, జలపాతాలు, పర్వత ప్రాంతాలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలను తెలియజేసే ఫాక్స్ ఇంటర్నేషనల్ ఛానెల్ ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‍ను నిర్వహిస్తున్న ఈ సంస్థ భారత ప్రాంతీయ భాషల్లో “నేషనల్ జియోవైల్డ్” పేరిట కొత్త ఛానెల్‍ను ప్రారంభించాలని నిర్ణయించింది. గత ఏడాదే దీనిని అమెరికాలో ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షించాలన్నదే తమ ఛానెల్ ఉద్దేశమని ‘ఫాక్స్ ఛానెల్’ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 17 భాషల్లో “నేషనల్ జియోవైల్డ్” వస్తోంది. ఇండియాలోని అన్ని విశేషాలు, జంతుజాలానికి సంబంధించిన అంశాలన్నీ ఈ కొత్త ఛానెల్‍లో టెలికాస్ట్ అవుతాయి.
Source: medianx.tv
No comments:
Post a Comment