న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్‌ను కేబుల్ ఆపరేటర్లు తమ కేబుల్ నెట్‌వర్క్‌ల ద్వారా అనధికారికంగా ప్రసారం చేయకుండా శాశ్వత నిరోధం కోరుతూ ఈఎస్‌పీఎన్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రై.లి (ఈఎస్‌ఐపీఎల్) దాఖలు చేసిన కేసుకు సంబంధించి సంస్థకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుమారు 144 మంది కేబుల్ ఆపరేటర్లు ఎలాంటి లైసెన్సు పొందకుండా అనధికార కనెక్షన్లు తీసుకొని అనధికారికంగా సిగ్నల్స్ ఇస్తున్నట్లు ఈఎస్‌ఐపీఎల్ ఈ కేసులో వాదించింది.తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఎవరైనా, మరే ఇతర ఛానల్ అయినా అనధికారికంగా ఈ క్రీడలను ప్రసారం చేసినా ప్రాసిక్యూషన్‌కు బాధ్యులవుతారని ఈఎస్‌ఐపీఎల్ హెచ్చరించింది. లైసెన్సు లేకుండా ఈఎస్‌పీఎన్, స్టార్‌స్పోర్ట్స్, స్టార్ క్రికెట్ ఫీడ్‌ను అనధికారికంగా ప్రసారం చేసే ఇతర కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది.ఈ సందర్భంగా ఈఎస్‌ఐపీఎల్ అఫిలియేట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ టి.పానేసర్ మాట్లాడుతూ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. పైరసీని తాము సహించబోమని న్యాయస్థానం స్పష్టం చేసినట్లయిందన్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Source: www.suryaa.com
No comments:
Post a Comment