- తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్
తెలంగాణ ఎంఎస్‌ఓలు కొన్ని టివి ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు టి.నరేంద్ర చౌదరీ, ఆర్ శైలేష్‌రెడ్డి ఆదివారం తెలంగాణ జేఏసి ఛైర్మన్ కోదండరామ్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ ఎంఎస్‌ఓ సమాఖ్య ఈనెల 22 నుంచి 48 గంటల పాటు కొన్ని న్యూస్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మీడియా స్వేచ్ఛ గురించి తెలిసిన మీరు ఇలాంటి నిర్ణయాన్ని సమర్ధించకూడదని కోదండరామ్‌కు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ బంద్‌కు సంబంధించిన వార్తలను ప్రసారం చేస్తున్న చానెళ్లను చూసే హక్కు ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. బంద్ నుంచి న్యూస్ ఛానెళ్లను మినహాయించి మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరారు. తెలంగాణ ఎంఎస్‌ఓలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా మీ వంతు సహకారం అందించాలని కోదండరామ్‌కు విజ్ఞప్తి చేశారు.
www.prajasakti.com
No comments:
Post a Comment