ఇరవై ఒకటో శతాబ్దంలో టీవీ నిత్యావసర వస్తువైంది. ఐక్యరాజ్యసమితిలోని జనరల్ అసెంబ్లీ 1996 మార్చి నెలలో నవంబరు 21వ తేదీని ‘వరల్డ్ టెలివిజన్‌డే’ గా నిర్ధారించింది. ఈ సందర్భంగా టీవీ కొనడంలో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను గుర్తు చేసుకుందాం.
1.టీవీ కొనడానికి వెళ్లే ముందు ఇంట్లో టీవీ పెట్టే చోటు, రాక్‌లో టీవీ బ్లాక్ కొలతను కచ్చితంగా తీసుకుంటారు.
ఎ. అవును
బి. కాదు
2.టీవీని షెల్ఫ్‌లో అమర్చినట్లయితే చుట్టూ కనీసం రెండు- మూడు అంగుళాల ఖాళీని వదలాలని తెలుసు.
ఎ. అవును
బి. కాదు
3.టీవీ స్క్రీన్ సైజును బట్టి గదిలో టీవీ చూసే సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉండేటట్లు జాగ్రత్త పడతారు.
ఎ. అవును
బి. కాదు
4.26 అంగుళాల ఎల్‌సిడి టీవీని కనీసం నాలుగు అడుగులు, 32 అంగుళాల టీవీని ఐదారు అడుగుల దూరంలో కూర్చుని చూడాలని తెలుసు.
ఎ. అవును
బి. కాదు
5.టీవీని హడావిడిగా నిమిషాలు లెక్కపెట్టుకుంటూ ఎంపిక చేయడం కష్టం, ప్రశాంతంగా షోరూమ్‌లో ఉన్న టెలివిజన్ సెట్లన్నింటినీ గమనించి పిక్చర్ క్లారిటీని పరీక్షించుకోవాలి.
ఎ. అవును
బి. కాదు
6.ఆడియో స్పష్టతను నిశితంగా పరిశీలించాలి. హోమ్ థియేటర్‌కైతే మరీ ఎక్కువగా స్పీకర్‌లన్నింటినీ చెక్ చేసుకోవాలి. విజువల్ చూడకుండా కళ్లుమూసుకుని విని నిర్ధారించుకోవాలి.
ఎ. అవును
బి. కాదు
7.చిన్న పిల్లలున్న వాళ్లు చానెల్ బ్లాక్ సౌకర్యం ఉన్న టీవీ కొనడం మంచిది.
ఎ. అవును
బి. కాదు
8.సెలెక్ట్ చేసుకున్న మోడల్‌కి ఇన్‌బిల్ట్ స్టెబిలైజర్ ఉందో లేదో చూసుకోవాలి.
ఎ. అవును
బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే టెలివిజన్ గురించి మీకు అవగాహన ఉంది. ‘బి’లు ఎక్కువైతే... ఎప్పటికప్పుడు అదనపు సౌకర్యాలతో వస్తున్న మోడళ్లు వస్తుంటే మనదగ్గర ఉన్నది ఏ పండగ ఆఫర్‌లోనో మార్చేసి కొత్తది కొందామనిపిస్తుంటుంది, కాబట్టి అప్పుడు పై అంశాలు ఉపయోగపడతాయేమో చూడండి.
Source: www.sakshi.com
No comments:
Post a Comment