Wednesday, February 9, 2011

టివి5ను టార్గెట్ చేసిన ఏబిఎన్

నిన్నటి వరకు ఎన్టీవిపై వ్యతిరేక కథనాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి ఛానల్ తాజాగా టివి5 ఛానల్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది. టివి5 అధినేత బిఆర్ నాయుడుకు చెందిన హెర్బల్ ఆయిల్ న్యూజెన్‌ ఆయిల్ జుట్టు మొలిపిస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. న్యూజెన్‌లో ఆయిల్ కోసం బిఆర్ నాయుడుగానీ, మరెవరూ కానీ ఎలాంటి పరిశోధనలు, పరీక్షలు చేయలేదని ఆరోపించింది. ఈ ఆయిల్‌కు డ్రగ్స్ కంట్రోల్ సర్టిఫికెట్ కూడా రాలేదని చెప్పింది. వచ్చిన అనుమతుల్లో కూడా స్పష్టత లేదని చెప్పింది. న్యూజెన్ ఓ ఫార్సు ఆయిల్ అని కథనం ప్రసారం చేసింది. నిబంధనలో ఉన్న లొసుగులు అడ్డు పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. న్యూజెన్‌లో ఎలాంటి జుట్టు రాల్చని విషయం లేనప్పటికీ మీడియా చేతిలో ఉందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. న్యూజెన్ ఆయిల్ కార్యాలయం అడ్రస్ కూడా బిఆర్ నాయుడు ఇంటి అడ్రస్‌తో ఉందని చెప్పింది. ఆయిల్ టెస్టులు జరిపామని చెప్పడానికి మనదేశంలో పరీక్షలు చేసే సౌకర్యాలే లేవని చెప్పింది.

అయితే ప్రజల వీక్‌నెస్‌ను వ్యాపారంగా మల్చుకుందని చెప్పింది. వాడేటప్పుడు నిబంధనలు ఉంటాయని చెప్పడం మరో విడ్డూరమన్నారు. న్యూజెన్ వాడుతున్న సమయంలో మరో ఆయిల్ ఉపయోగించవద్దు, హెర్బల్ షాంపూ మాత్రమే వాడాలి, రెగ్యూలర్‌గా వాడాలి తదితర నిబంధనలు పెట్టింది. అయితే ఇలాంటి నిబంధనల ద్వారా న్యూజెన్ మాత్రమే కాదు ఎలాంటి ఆయిల్ వాడినా వెంట్రుకలు రాలవని చెప్పారు. మరో విషయమేమంటే ఒక్క బాటిల్ కాకుండా ఐదు బాటిళ్లు వాడాలని కండిషన్ ఉందని చెప్పారు. ఒక్కోదాని ధర 396 రూపాయలు పెట్టి పూర్తి వ్యాపారాత్మకం చేశారని ఆరోపించింది.

కాగా న్యూజెన్‌తో జుట్టు రాలిపోదనే మాటల్లో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారని చెప్పింది. ఈ ఆయిల్ వల్ల జుట్టు ఊడటం అటుంచి ముందు ముందు జుట్టు మరింత ఎక్కువగా ఊడిపోయే ప్రమాదముందని చెప్పింది. ప్రజలకు నిజాలు చెప్పవలసిన మీడియా సంస్థనే ప్రజలను మోసం చేస్తుందని టివి5 అధినేత బిఆర్ నాయుడిని విమర్శించింది.

Source: thatstelugu.oneindia.in

1 comment: