టాలీవుడ్‌లో
మెగాస్టార్ చిరంజీవికి డూప్‌గా నటించాలి అంటే టక్కున గుర్తొచ్చే పేరు
రాజ్‌కుమార్. కేవలం డూప్‌గానే కాక తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన
అచ్చు చిరంజీవిలా కనిపిస్తాడు. ఆయన అనేక చిత్రాల్లో హీరో పాత్రలతోపాటుగా,
అనేక క్యారెక్టర్లలో కూడా జీవించి, మెప్పించాడు. మొదట్లో ఆయన ఫొటోలు చూసి
అచ్చు చిరంజీవిలా ఉన్నాడని, అనేక మంది అనుకునేవారు. మొదట్లో ఈ పోలిక ఆయన
కెరీర్‌కు ఎంతో ఉపయోగపడినా ఆ తరువాత తనకంటూ ఓ బాణీని ఏర్పరుచుకుని నటుడిగా
ఎదిగారు. చిరంజీవి అభిమానులు కూడా రాజ్‌కుమార్‌ను అభిమానించేంత స్థాయికి
చేరుకున్నారు. ఎక్కడ తనకవకాశాలు వచ్చినా అవి వినియోగించుకుంటూ సాగిన
రాజ్‌కుమార్ టీవి మీడియాలో మెగాస్టార్‌గా కూడా ఎదిగారు. కొన్నాళ్లు కెరీర్
పరంగా ఒడుదుడుకులు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు
సరికొత్త ఉత్సాహంతో వస్తున్నారు. తాజా చిత్రం ‘బారిష్టర్ శంకర్‌నారాయణ’తో
రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తన వాక్ చాతుర్యంతో ఎంత పెద్ద న్యాయవాదినైనా
ఓడించగల లాయర్‌గా ఈ చిత్రంలో రాజ్‌కుమార్ నటిస్తున్నారు. శంకర్‌నారాయణ
కేసును వాదించడానికి ఒప్పుకున్నారు అంటే ఇక ప్రత్యర్థులు ఓడిపోవాల్సిందే
అనేట్లుగా ఈ చిత్ర కథ సాగుతుంది. బారిష్టర్ జీవితంలో ఓ కేసు తాలూకు
అనుభవాలతో శంకర్‌నారాయణ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదుర్కొన్న పరిస్థితుల
నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన చెబుతున్నారు. ప్రముఖ
డాన్స్ మాస్టర్ తార తొలిసారిగా ఈ చిత్రంతో దర్శకురాలిగా వెండితెరకు
పరిచయమవుతున్నారు. ఈ చిత్రం తనకు మళ్లీ కెరీర్‌ను ప్రారంభించడానికి అనువుగా
వుంటుందని, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మళ్లీ పొందుతానని, నటుడిగా
తనలోని పలు కోణాలను ఆవిష్కరించడానికి మంచి మంచి కథలు ఎంచుకుంటున్నానని
రాజ్‌కుమార్ తెలిపారు. హీరో పాత్రలతోపాటుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా,
గతంలో అనేక మంది పెద్ద హీరోలు చేసిన పలు పాత్రల్లో ఒదిగిపోవటానికి కూడా
తాను సిద్ధమయ్యానని, ఏ పాత్ర చేసినా ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చేలా
నటించడమే తన వంతని ఆయన తెలిపారు. త్వరలో రానున్న ‘బారిష్టర్ శంకర్‌నారాయణ’
చిత్రం తనకు బెస్ట్ చిత్రం అవుతుందని ఈ చిత్రం తర్వాత తాను బిజీగా
మారతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజ్‌కుమార్.
Source: www.andhrabhoomi.net