Thursday, August 29, 2013

మహిళా ప్రేక్షకుల ఆదరణలో జెమినీని దాటిన మా టీవీ

రెండువారాలపాటు ఈటీవీ కంటే వెనుకబడిన మా టీవీ జులై 13 తో ముగిసినవారంలో బాగా పుంజుకుంది. అదే సమయంలో జెమినీ కాస్త వెనుకడుగు వేయటంతో మా టీవీ మొదటి స్థానానికి దూసుకురాగలిగింది. న్యూస్ చానల్స్ ఆదరణలో పురుష ప్రేక్షకులను, ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో మహిళల ఆదరణను ప్రధానంగా పరిగణనలోనికి తీసుకుంటారు. ఆ విధంగా చూసినప్పుడు 15 ఏళు పైబడిన మహిళా ప్రేక్షకుల ఆదరణలో మా టీవీ నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది.
అయితే, పురుషుల ఆదరణలో జెమినీ, ఈటీవీ కంటే వెనుకబడిన మాటీవీ మొత్తంగా చూసినప్పుడు జెమినీ కంటే వెనుకనే ఉంది. కానీ, రెండువారాలుగా సాగుతున్న ఈ టీవీ ఆధిపత్యాన్ని పక్కకుబెట్టి తన స్థానాన్ని పదిలపరచుకుంది. నెలవారీ రేటింగ్ డేటా కోరుకున్న జీ తెలుగు చానల్ సమాచారాన్ని టామ్ వరుసగా రెండో వారం కూడా అందించలేదు.
మూవీస్ చానల్స్ రెండింటిలో జెమినీ మూవీస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంతోబాటు మార్కెట్ వాటాను బాగా పెంచుకుంది. అయితే, మ్యూజిక్ చానల్స్ లో జెమినీకి దీటుగా మా మ్యూజిక్ కూడా కొనసాగుతోంది.
జులై 13 తో ముగిసినవారానికి తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ మార్కెట్ వాటా ( ఆధారం : టామ్ డేటా )
చానల్
15+ మహిళలు
15+ పురుషులు
15+ అందరూ
ఈటీవీ
11.31
10.13
10.79
జెమిని
12.51
11.73
12.16
మా
13.38
9.52
11.66
జీ తెలుగు
-
-
-
జెమిని మూవీస్
7.04
6.88
6.97
మా మూవీస్
3.98
3.78
3.89
మా గోల్డ్
0.55
0.31
0.44
వనిత
0.19
0.27
0.23
జెమిని మ్యూజిక్
1.17
0.95
1.07
మా మ్యూజిక్
0.93
0.90
0.92
ఆర్వీ ఎస్ టీవీ
0.04
0.04
0.04
ఎక్స్ ట్రా
0.03
0.04
0.03

Source: telugutv.info

No comments:

Post a Comment