Thursday, August 29, 2013

హైదరాబాద్ లో ఎన్టీవీకి రెండో స్థానం, పుంజుకున్న సాక్షి, అన్ని చోట్లా టీవీ 9

జులై 13 తో ముగిసిన వారంలో 15 ఏళ్ళు పైబడిన పురుష ప్రేక్షకుల శాంపిల్ లో టీవీ9 అన్ని మార్కెట్లలోనూ తన ఆధిక్యం ప్రదర్శించింది. టీవీ 5 రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఎన్టీవీ దగ్గరవుతూ ఉంది. సాక్షి టీవీ గత వారాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ లో గణనీయంగా పుంజుకుంది. ఆ కారణం వల్లనే ఈటీవీ 2 ను ఈ వారం దాటగలిగింది. ఎన్టీవీ హైదరాబాద్ మార్కెట్లో రెండో స్థానం పొందగలిగింది. విశాఖ, విజయవాడ నగరాల్లోనూ, చిన్నపట్టణాలలోనూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మొత్తమీద ఎన్టీవీ పరిస్థితి మెరుగ్గా ఉండటానికి హైదరాబాద్ మార్కెట్ ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ఈటీవీ 2 కు విశాఖ, విజయవాడ నగరాలలో ఆదరణ మరీ తక్కువగా ఉండటం వలన మొత్తం రేటింగ్స్ మీద ప్రతికూల ప్రభావం పడింది. ఈ నగరాలలో ఈటీవీ 2 కంటే స్టుడియో ఎన్, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, 10 టీవీ చానల్స్ ను ఎక్కువమంది చూస్తున్నట్టు టామ్ లెక్కలు చెబుతున్నాయి.

జులై 13 తో ముగిసిన వారానికి వివిధ మార్కెట్లలో తెలుగు న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా

15 ఏళ్ళు పైబడిన పురుషుల ఆదరణ ఆధారంగా టామ్  సమాచారం )

  చానల్
హైదరాబాద్
విశాఖ, విజయవాడ
చిన్నపట్టణాలు
మొత్తం రాష్ట్రం
టీవీ 9
4.76
4.21
2.74
3.92
టీవీ 5 న్యూస్
3.83
3.25
1.23
2.77
ఎన్టీవీ
3.89
1.14
0.73
2.33
సాక్షి టీవీ
1.88
1.99
2.27
2.04
ఈటీవీ 2
3.13
0.68
1.08
2.03
స్టుడియో ఎన్
0.61
0.87
1.01
0.80
జీ 24 గంటలు
-
-
-
-
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
0.51
0.72
0.67
0.60
న్యూస్
0.90
0.32
0.18
0.55
10 టీవీ
0.49
0.88
0.51
0.55
హెచ్ ఎమ్ టీవీ
0.36
0.45
0.63
0.48
వి 6 న్యూస్
0.57
0.32
0.42
0.48
టి న్యూస్
0.48
0.00
0.33
0.36
సివిఆర్ న్యూస్
0.19
0.61
0.27
0.28
మహా న్యూస్
0.11
0.41
0.18
0.17
జెమిని న్యూస్
0.11
0.10
0.09
0.10

Source: telugutv.info

No comments:

Post a Comment