ఆమె ఒక మాటల పిట్ట,మాటలాడటంలో దిట్ట, మహిళల టీవీ కార్యక్రమాలైనా, రియాల్టీ షోలైన, అవార్డ్ ఫంక్షన్ లోనైనా , ఆడియో ఫంక్షన్‌లలోనై ఆమె ఉంటే తెలియని జోష్ వస్తుంది ప్రేక్షకులకు. ఆమె ఎవరో కాదు యాంకర్ సుమ. నటుడు రాజీవ్ కనకాల భార్య . ఇప్పుడు ఆమె చాలా టీవీ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కాని డాక్టర్లు మాత్రం సుమను యాంకరింగ్ ఆపేయాలని సూచించారట.
ప్రస్తుతం సుమ గొంతు సమస్యతో భాదపడుతోందట. ఈ నేపథ్యంలో సుమ ఇంకా గంటల తరబడి మాట్లాడితే గొంతు సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముందని సూచించారట. సుమ ప్రతీరోజూ గ్యాప్ లేకుండా 62 టీవీ షోల్లో పాల్గొంటుందట. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తే ఆమె డేంజర్‌లో పడే అవకాశం ఉందని అందువల్ల యాంకరింగ్‌ను కొంత కాలం ఆపేయాల్సిందని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. కొన్నాళ్ళు మన బుల్లి తెర మాటల పిట్ట ప్రేక్షకులుకు దూరం కావలిసిందే.
Source: www.apstarnews.com
No comments:
Post a Comment