Thursday, August 29, 2013

ఈటీవీ ‘జబర్దస్త్‘ దూకుడుకు సినిమాలతో అడ్డుకట్ట వేస్తున్న జెమినీ

ప్రైమ్ టైమ్ సీరియల్స్  సాయంతో నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చిన జెమినీకి ఇప్పుడు ఆ ఆసరా పోయింది. ఇన్నాళ్ళూ ఆదుకుంటూ వచ్చిన మొగలిరేకులు స్థానంలో మొదలైన కొత్త సీరియల్ శ్రావణ సమీరాలు ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో జెమినీ చానల్ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టింది. ఒక దశలో అది తన పదిహేనేళ్ళ రికార్డును కోల్పోతూ నెంబర్ టూ స్థానానికి దిగజారింది. అయితే, మళ్ళీ ఆ ప్రాభవం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా తాత్కాలిక పరిష్కారంగా కొత్త సినిమాలు ప్రసారం చేస్తోంది. ఒకవైపు  జెమినీ మూవీస్ చానల్ ఉన్నప్పటికీ గత వారంలో జెమినీ టీవీలో డమరుకం, స్నేహితుడు, స్టైల్, దరువు, దాడి, కత్తి కాంతారావు, ఒక్కడు, చింతకాయలరవి తదితర చిత్రాలు ప్రసారం చేయాల్సి వచ్చింది.

సొంత సినిమాలు తప్ప కొత్తవి కొనటం దాదాపుగా ఆపేసిన ఈ టీవీ సంస్థ ఎక్కువగా గేమ్ షోస్ మీద ఆధారపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కొద్దినెలల కిందట మొదలెట్టిన కామెడీ షో జబర్దస్త్ బాగా ప్రేక్షకాదరణ పొందటంతో బాటు ఒక వారం చానల్ ను నెంబర్ వన్ స్థానానికి సైతం తీసుకెళ్ళగలిగింది.  అయితే, ఆ కార్యక్రమం మీదనే మరీ ఎక్కువగా ఆధారపడటం తాత్కాలికంగా మేలు చేసినా, భవిష్యత్తులో అది మంచిదికాదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జబర్దస్త్ తరువాత కార్యక్రమాలకు వస్తున్న రేటింగ్స్ పోల్చి చూస్తే జబర్దస్త్ మీద ఈటీవీ ఎంతగా ఆధారపడుతున్నదో అర్థమవుతుంది. అందుకే ఆ కార్యక్రమంలో అనేక ద్వంద్వార్థ పదాల ప్రయోగం జరుగుతున్నదన్న విమర్శలు ఉన్నప్పటికీ రేటింగ్స్ కోసం ఈటీవీ దాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది.

ఆగస్టు 10 తో ముగిసినవారానికి జెమినీ, ఈటీవీ చానల్స్ లో మొదటి 30 స్థానాలు సాధించిన కార్యక్రమాలు

వారం
జెమినీ కార్యక్రమాలు
రేటింగ్
వారం
ఈటీవీ కార్యక్రమాలు
రేటింగ్
ఆది
డమరుకం
6.65
గురు
జబర్దస్త్
12.89
శని
బోల్ బేబీ బోల్-2
5.42
శని
క్యాష్
5.14
శుక్ర
శ్రావణ సమీరాలు
5.36
గురు
సరదా సరదాగా
5.02
శని
స్నేహితుడు ( చిత్రం )
5.30
శని
మనసు మమత
4.24
గురు
శ్రావణ సమీరాలు
4.89
శని
భార్యామణి
4.02
సోమ
శ్రావణ సమీరాలు
4.72
శుక్ర
ఈటీవీ న్యూస్
3.96
శని
స్టైల్ ( చిత్రం )
4.71
సోమ
ఈటీవీ న్యూస్
3.84
మంగళ
శ్రావణ సమీరాలు
4.29
మంగళ
మనసు మమత
3.56
శని
దరువు ( చిత్రం )
4.12
గురు
ఈటీవీ న్యూస్
3.55
బుధ
శ్రావణ సమీరాలు
4.12
శని
చంద్రముఖి
3.54
శుక్ర
చాంగురే బంగారు రాణి
3.97
ఆది
జబర్దస్త్
3.53
శుక్ర
అగ్నిపూలు
3.67
మంగళ
భార్యామణి
3.50
సోమ
అగ్నిపూలు
3.66
గురు
భార్యామణి
3.48
శుక్ర
దాడి ( చిత్రం )
3.64
శుక్ర
భార్యామణి
3.39
Mon
మమతల కోవెల
3.39
శుక్ర
గెట్ రెడీ
3.27
Mon
కత్తి కాంతారావు ( చిత్రం )
3.32
సోమ
భార్యామణి
3.14
Fri
ఒక్కడు ( చిత్రం )
3.22
మంగళ
ఈటీవీ న్యూస్
3.13
Thu
అగ్నిపూలు
3.18
సోమ
మనసు మమత
3.13
Tue
మమతలకోవెల
3.16
బుధ
ఢీ 6
3.05
Tue
అనుబంధాలు
3.05
శని
ఈటీవీ న్యూస్
3.04
Fri
అనుబంధాలు
2.95
శుక్ర
చంద్ర ముఖి
2.96
బుధ
అగ్నిపూలు
2.89
మంగళ
మనసు మమత
2.93
ఆది
చింతకాయల రవి ( చిత్రం )
2.78
బుధ
భార్యామణి
2.86
గురు
అనుబంధాలు
2.78
బుధ
మనసు మమత
2.86
శుక్ర
మూడు ముళ్ళ బంధం
2.78
గురు
మనసు మమత
2.86
సోమ
అనుబంధాలు
2.77
బుధ
ఈటీవీ న్యూస్
2.82
బుధ
అనుబంధాలు
2.75
మంగళ
చంద్రముఖి
2.8
బుధ
మమతలకోవెల
2.73
సోమ
పాడుతా తీయగా ( అమెరికా )
2.75
మంగళ
మరో చరిత్ర
2.66
గురు
చంద్రముఖి
2.74
సోమ
ఆటో భారతి
2.65
శని
ముత్యమంత పసుపు
2.68
Source: telugutv.info

No comments:

Post a Comment