న్యూస్ చానల్స్ ప్రధానంగా హైదరాబాద్ లో
సంపాదించుకునే ప్రేక్షకాదరణ మీదనే ఆధారపడుతున్నట్టు టామ్ సమాచారాన్ని బట్టి
స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్టీవీ, ఈటీవీ 2 చానల్స్
ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి. ఎన్టీవీకి విశాఖ, విజయవాడ,
చిన్నపట్టణాలలో ఒక మోస్తరుగానైనా ఆదరణ నమోదుకాగా ఈటీవీ 2 కు ఆ రెండు మార్కెట్లలో ఆదరణ నామమాత్రంగానే ఉంది.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, జెమినీ న్యూస్ మాత్రమే
అన్ని మార్కెట్లలో దాదాపుగా ఒకే విధమైన ఆదరణ పొందుతుండగా హైదరాబాద్ మీద
ఎక్కువగా ఆధారపడిన ఇతర చానల్స్ లో ఐ న్యూస్, ఎ టీవీ బాగా ముందున్నాయి. అదే
విధంగా టి న్యూస్, వి.6 చానల్స్
కూడా హైదరాబాద్ లో ప్రధానంగా ఎక్కువ మంది ప్రేక్షకులను
ఆకట్టుకోగలుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ప్రభావం వల్లనే ఐ న్యూస్, ఎ
టీవీ, టి న్యూస్, వి 6 న్యూస్ చానల్స్ లో ఈ స్పష్టమైన మార్పు కనిపించి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా ఉంది.
మార్కెట్ల వారీగా తెలుగు న్యూస్ చానల్స్ సాధించిన స్థూల రేటింగ్ పాయింట్లు ( 31వ వారం టామ్ డేటా )
సంఖ్య
|
చానల్
|
రాష్టం మొత్తం
|
హైదరాబాద్
|
విశాఖ, విజయవాడ
|
చిన్న పట్టణాలు
|
1
|
ఎన్ టీవీ
|
175
|
305
|
114
|
71
|
2
|
ఈటీవీ 2
|
161
|
314
|
48
|
57
|
3
|
స్టుడియో ఎన్
|
66
|
36
|
78
|
92
|
4
|
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
|
48
|
47
|
47
|
50
|
5
|
ఐ న్యూస్
|
41
|
71
|
27
|
16
|
6
|
జీ 24 గంటలు
|
36
|
40
|
47
|
28
|
7
|
వి 6 న్యూస్
|
36
|
58
|
23
|
20
|
8
|
10 టీవీ
|
35
|
34
|
46
|
31
|
9
|
హెచ్ ఎమ్ టీవీ
|
33
|
30
|
28
|
38
|
10
|
టి న్యూస్
|
29
|
55
|
0
|
16
|
11
|
సివిఆర్ న్యూస్
|
23
|
20
|
42
|
18
|
12
|
ఎ టీవీ
|
22
|
51
|
4
|
0
|
13
|
జెమినీ న్యూస్
|
10
|
11
|
11
|
9
|
14
|
మహా న్యూస్
|
8
|
4
|
12
|
11
|
15
|
ఆర్కే న్యూస్
|
3
|
0
|
0
|
6
|
16
|
టీవీ 9
|
0
|
0
|
0
|
0
|
17
|
టీవీ 5 న్యూస్
|
0
|
0
|
0
|
0
|
18
|
సాక్షి టీవీ
|
0
|
0
|
0
|
0
|
Source: telugutv.info
No comments:
Post a Comment