Thursday, August 29, 2013

జెమినీ కి షాక్ : పదిహేనేళ్ళ తరువాత మళ్ళీ నెంబర్ 1 స్థానంలో ఈటీవీ

ఎంటర్టైన్మెంట్ లో తెలుగు టీవీ రంగాన్ని శాసిస్తున్న జెమిని టీవీ పదిహేనేళ్ళ తరువాత నెంబర్ టూ స్థానానికి దిగజారింది. ఈటీవీ నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. జులై 27 తో ముగిసిన వారానికి టామ్ విడుదల చేసిన సమాచారం ప్రకారం జెమిని మార్కెట్ వాటా తగ్గిపోయింది. నిజానికి రెండు వారాలుగా తగ్గుతూ వస్తుండగా తాజావారంలో రెండో స్థానానికి పడిపోయింది. 
జెమినీ తొలి తెలుగు శాటిలైట్ చానల్ అయినప్పటికీ ఈటీవీ వచ్చాక కొంతకాలం రెండో స్థానానికే పరిమితమైంది. అయితే సన్ నెట్ వర్క్ అజమాయిషీలోనికి వచ్చిన తరువాత క్రమంగా పెరుగుతూ నెంబర్ వన్ స్థానం సంపాదించటమే కాక ఈటీవీకి దాదాపు 200 శాతం ఎక్కువగా మార్కెట్ వాటా సంపాదించిన సందర్భాలున్నాయి. తెలుగు టీవీ చానల్స్ లో దాదాపు 40 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్న ఘనత జెమినీ టీవీకే దక్కింది. 
తెలుగులో నెంబర్ టూ స్థానం కూడా ఖాళీగా ఉందని అప్పట్లో జెమినీ చెప్పుకోవటం అతిశయోక్తిగా అనిపించినా తేజా టీవీని ప్రారంభించి అది కూడా ఈటీవీని మించిపోయిన రోజు ఆ మాట నిజమని నిరూపించింది. తరువాత కాలంలో తేజా టీవీని జెమినీ మూవీస్ చానల్ గా మార్చిన తరువాత అది కూడా తగ్గటం మొదలైంది. మొత్తానికి ఒకటిన్నర దశాబ్దం తరువాత జెమినీ తలొగ్గింది.
జెమినీని ముందుకు నడిపిన ప్రైమ్ టైమ్ సీరియల్ మొగలిరేకులు స్థాయిలో శ్రావణ సమీరాలు ఆకట్టుకోలేకపోవటం, మంచి సినిమాలు మూవీస్ చానల్ లో వేయాల్సిరావటం జెమినీకి మైనస్ పాయింట్స్ కాగా గంటన్నరకు పైగా వ్యవధి ఉన్న జబర్దస్త్ లాంటి కార్యక్రమం రెండుసార్లు ప్రసారమవుతూ ప్రేక్షకాదరణ పొందటం ఈ పరిస్థితికి దారితీశాయి. బోల్ బేబీ బోల్ తప్ప చెప్పుకోదగిన గేమ్ షోస్ లేకపోవటం, ఈటీవీ లో  గేమ్ షోస్ పెరగటం కూడా ప్రధాన కారణాలు.

చానల్
15+ మహిళల
మార్కెట్ వాటా
15+ పురుషుల  మార్కెట్ వాటా
15+ అందరూ మార్కెట్ వాటా
ఈటీవీ
12.70
11.58
12.21
జెమిని
11.91
10.45
11.28
మా టీవీ
11.51
8.16
10.07
జీ తెలుగు
8.30
6.52
7.54
జెమిని మూవీస్
5.59
6.04
5.78
మా మూవీస్
3.86
3.41
3.67
మా గోల్డ్
0.52
0.40
0.46
వనిత
0.24
0.31
0.27
జెమిని మ్యూజిక్
1.42
1.04
1.26
మా మ్యూజిక్
1.00
0.87
0.94
ఆర్వీ ఎస్ టీవీ
0.04
0.04
0.04
ఎక్స్ ట్రా
0.08
0.06
0.07



Source: telugutv.info



No comments:

Post a Comment