వినోదం
కోరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు మా టీవీ చూస్తారంటూ మా టీవీ జాతీయ
స్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. అందుకోసం ఇటీవల ప్రసారం చేసిన మిర్చి
సినిమాకు వచ్చిన రేటింగ్స్ ను ప్రధానాంశంగా వాడుకుంటోంది. ఆ చిత్రం
ప్రసారమైన సమయంలో మూడింట రెండొంతులమంది ప్రేక్షకులు మా టీవీ చూశారని టామ్
సమాచారం ఆధారంగా నిరూపించే ప్రయత్నం చేసింది.
ఆగస్ట్ 18 న సాయంత్రం 6.54 – 10.30 గంటల మధ్య సమయంలో మా టీవీలో మిర్చి సినిమా ప్రసారమవుతుండగా 65.5% మంది ప్రేక్షకులు మా టీవీకి అతుక్కుపోయారని, 18% మంది జెమినీ టీవీ, 10% మంది ఈటీవీ, 6.5% మంది జీ
తెలుగు చూశారని ఆ వివరాలు చెబుతున్నాయి. అయితే, ఒక చానల్ బాగా పేరున్న
సినిమా ప్రసారం చేస్తున్నప్పుడు దానికి దీటైన సినిమా ప్రసారం చేయటమా, లేక
మంచి సినిమాను వృధా చేసుకోకుండా పోటీ నుంచి తప్పుకోవటమా అనేది
వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయాన్నిబట్టి ఉంటుంది. మిగిలిన చానల్స్
మార్కెట్ వాటా ఆ సమయంలో తగ్గటానికి కారణం ఏదైనా కావచ్చు.
Source: telugutv.info
No comments:
Post a Comment