Wednesday, August 28, 2013

పిల్లల్లో టీవీ, ఇంటర్‌నెట్ చూసే వాడకం తగ్గితే చాలామంచిది!

పిల్లల్లో టీవీ, ఇంటర్‌ నెట్‌చూసే వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా కార్టూన్‌ చానెల్స్, ప్లే చానెల్స్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అందులో ఉండే క్యారెక్టర్లను బాగా అనుకరిస్తున్నారు. కొంతమంది పిల్లలు గంటల తరబడి టీవీలకు అతుక్కొనిపోతున్నారు. దీని వలన బద్దకం, మందకొడితనం పెరిగిపోతున్నాయి.

ఈ పోకడను ముందుగానే గమనించుకోవాలి. అటువంటి చానెల్స్‌ను క్రమంగా తగ్గించి వేయాలి. అటువంటి చానెల్స్‌లో ఏ ప్రోగ్రామ్‌‌ను క్రమం తప్పకుండా చూస్తున్నారో గమనించి ఆ సమయంలో వేరే వ్యాపకం అలవాటు చేయటం మేలు.

లేదంటే ఆ కార్యక్రమాలకు అలవాటు పడిపోతే పిల్లలను నియంత్రించండం కష్టతరమవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించటానికి, పనులు చేయించుకోవటానికి టీవీని అలవాటు చేస్తుంటారు. ఇది సరికాదు. తర్వాత కాలంలో ఈ అలవాటే పిల్లల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. 

Source: telugu.webdunia.com

No comments:

Post a Comment