Friday, August 23, 2013

ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శుభవార్త...

2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగులో మరో కొన్ని న్యూస్ చానల్స్ రాబోతున్నాయి. ఇందులో శరవేగంగా రాబోతున్న న్యూస్ చానల్స్ లో సిక్స్ టీవీ, తులసీ, హెచ్ వై టీవీలున్నాయి. టీవీ 5 లో పేరుగాంచిన మంచి జర్నలిస్ట్ ... యువ ఆలోచనలున్న వెంకటకృష్ణ సీఈఓగా సిక్స్ టీవీ అక్టోబర్ నెలాఖరుకు ప్రేక్షకులకు సరికొత్త తరహాలో న్యూస్ ను అందించనుంది.

ఇదే కాకుండా ఎన్నో రోజులుగా చర్చించుకుంటున్న తులసీ న్యూస్ కూడా మరో రెండు నెలలల్లో ప్రసారాలను ప్రారంభించనుంది. ఇప్పటికే ఇంగ్లీష్ , తెలుగులో నడిచి ఆగిపోయినా... హెచ్ వై టీవీని ... డైనమిక్ జర్నలిస్ట్ శైలేష్ రెడ్డి సారథ్యంలో మరోసారి ప్రేక్షకులకు తెలుగులో న్యూస్ ను అందివ్వనుంది. గతంలో లాగా కాకుండా ... జీతాల విషయమే కాదు.. రాష్ట్ర వ్యాప్త ప్రసారాలతో లాంచ్ చేయడానికి శైలేష్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకు అధ్యాపకుడు బావ నారాయణ నేతృత్వంలో ఎపీ9 న్యూస్, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ అజిత నాయకత్వంలో టీవీ 99 న్యూస్ కూడా మరో 3, 4 నెలల్లో అందుబాటులో వస్తుందని తెలుస్తోంది. ఇదే కాక మరో ప్రముఖ జర్నలిస్ట్ , ప్రతిభావంతుడు... పలు పత్రికల వ్యవస్థాపకుడు... సత్యమూర్తి ఎడిటర్ గా బ్రేకింగ్ న్యూస్ కూడా అతి త్వరలోనే ప్రారంభకానుంది. సూర్యలో పని చేసి... ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో అడుగుపెట్టిన సత్యమూర్తి కూడా టాలెంటెడ్ పర్సన్స్ కు అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఆర్ వీఎస్ చానల్ నడిపిస్తున్న పారిశ్రామిక వేత్త, స్నేహాశీలి వెంకటస్వామి ... ఆర్ వీఎస్ న్యూస్ పేరుతో కొత్తగా మరో చానల్ ను స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు న్యూస్ చానల్స్ ప్రారంభిస్తున్న మేనేజ్ మెంట్లు ... జీతాల విషయంలో కచ్చితత్వం, నిర్ణయించిన తేదీనే జీతాలు చెల్లించేలా, ప్రణాళిక బడ్జెట్ తోనే ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాజ్ న్యూస్ ను కూడా విస్తరిస్తున్నారు. ఇది కొంత బీజేపీకి ప్రోగా ఉంటుందని అందులో పనిచేస్తున్న ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఉద్యోగులకు ఇది శుభవార్త. అయినా... ఆయా చానల్స్ లో చేరే ముందు ... కంపెనీ, మేనేజ్ మెంట్లు, అక్కడ చేరిన సీఈఓలు, హెడ్స్ గురించి తెలుసుకోండి. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రండి. మంచి, సక్రమంగా జీతాలు చెల్లించే చానల్స్ వదిలి పెట్టవద్దని సలహా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.

Source: www.tajaanews.com

No comments:

Post a Comment