Thursday, February 3, 2011

జీటీవీ వారి ఛోటీ బహు


హిందీ చానెల్ జీ టీవీలో ‘ఛోటీ బహు’ డైలీ సీరియల్ మళ్లీ మొదలౌతోంది. నిజానికిది ఆదీఅంతంలేని అతి పవిత్రమైన ప్రేమ కథ. సంప్రదాయ హైందవ కుటుంబంలోని ఒక చిన్న కోడలు చుట్టూ తిరిగే కథ. 2008 డిసెంబర్ 8న మొదలై, 492 ఎపిసోడ్లుగా సాగి 2010 సెప్టెంబర్ 19న ముగిసిన ‘ఛోటీ బహు’... తిరిగి ఈ నెల 15న పాత నాయికలతోనే కొత్త కథాంశంగా ప్రారంభమౌతోంది. సమయం: మునుపటిలా రోజూ సాయంత్రం 7.30 గంటలకే.

ఇందులో ప్రధాన పాత్రధారులు దేవ్ (అవినాశ్ సచ్‌దేవ్), రాధిక (రుబీనా దిలైక్) ఈ కొత్త ఎసిసోడ్‌లలోనూ హీరోహీరోయిన్‌లుగా కొనసాగుతారు. వీరి స్వచ్ఛమైన, నిష్కల్మషమైన దాంపత్యం చుట్టూ తిరిగిన వందలాది ఎపిసోడ్లు గత రెండేళ్లలోనూ వీక్షకులను టీవీల ముందు కదలకుండా కూర్చోబెట్టాయి. బృందావన శాస్ర్తి దత్తపుత్రిక అయిన రాధిక... పౌరోహిత్య కుటుంబంలోని చిన్న కోడలిగా చేసిన త్యాగాలలో ముందరి ఎపిసోడ్‌లు సాగాయి. మొదటి పార్ట్‌కు బృందావనం నేపథ్యం కాగా, ఈ రెండో పార్ట్‌ను ‘రావల్ ’ నుంచి మొదలు పెట్టారు. పురాణాల ప్రకారం రాధాకృష్ణుల మధ్య ఆధ్మాత్మిక ప్రేమ రావల్‌లోనే అంకురిస్తుంది. బాల్యంలోనే ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలుగుతుంది. అయితే మొదటి భాగంలో ఉన్నట్లు కొత్త కథలో ఈ దంపతులు మౌనంగా, ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోరు.


మనోభావాలను ధైర్యంగా వ్యక్తం చేశారు. రావల్‌లో మొదలైన కథ మెల్లిగా మధురకు చేరుతుంది. ప్రేమ, స్నేహం, అనుబంధాలు, ఆధునిక భారతదేశంలోని ఆధ్యాత్మిక భావాలను ఈ కొత్త ఎపిసోడ్‌లలో ఎంతో సున్నితంగా, అర్ధవంతంగా చిత్రీకరించినట్లు ‘ఛోటీ బహు’ నిర్మాణ సంస్థ డిజె క్రియేటివ్ యూనిట్ వెల్లడించింది. రాధాకృష్ణుల ప్రేమకథ కాలాతీతమైనది. ఈ ప్రేమకు ఎవరైనా లోనుకావలసిందే. అందుకే మా సీరియల్‌కు అనూహ్యమైన ఆదరణ లభించింది. ఇకముందు కూడా లభిస్తుందని అనుకుంటున్నాం’’ అని జీటీవి ఫిక్షన్ హెడ్ సుకేశ్ మోత్వానీ అంటున్నారు. 
 
Source: www.sakshi.com

No comments:

Post a Comment