రాత్రి పది గంటల నుంచి పదిన్నర వరకు పోగో ఛానల్‌ను చూడండి. అందులో శారీరకంగా ఎదిగినా, దానికి తగినట్టుగా ఎదగని చిన్నపిల్లల మనస్తత్వం గల ఓ వ్యక్తి కనిపిస్తాడు. చేతిలో చాక్‌లెట్ కలర్ ఉన్న టెడ్డీబేర్.. అతను చేసే రకరకాల పిల్ల చేష్టలు.. అవి చూసి మనం నవ్వకుండా ఉండలేం. ఇక పిల్లలైతే టీవీకే అతుక్కుపోతారు. నిద్రపొమ్మని చెప్పినా అతను వారిని తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంటాడు. అమాయకత్వం, అతితెలివి చేష్టలతో నవ్విస్తుంటాడు. అతనే మిస్టర్ బీన్. చానల్ మారిస్తే పిల్లల కోపానికి పెద్దలు కామ్ అయ్యే టైమ్ ఇదే అని ఒప్పుకోకతప్పదు.
మిస్టర్ బీన్ పిల్ల చేష్టలతో రకరకాల సమస్యలను ఫన్నీగా ఎదుర్కొనే క్రమం చూస్తే మనలోని అసహనం కాస్త నవ్వుగా మారి బయటకు పారిపోతుంది. అరగంటపాటు మనల్ని నవ్వించే మిస్టర్ బీన్ ఎపిసోడ్ లండన్ ఐటీవీలో 1990 జనవరిలో బ్రాడ్‌కాస్ట్‌కు సిద్ధమైనా ఐదేళ్ల తర్వాత ప్రసారమైంది. బ్రిటీష్ కామెడీ టెలివిజన్ సీరీస్‌లో పధ్నాలుగున్నర గంటల ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. ఇందులో రావన్ అట్‌కిన్‌సన్ టైటిల్ రోల్‌ను పోషించారు. ఈ పాత్రను విభిన్న తరహాలో ఉండేవిధంగా అట్‌కిన్‌సన్, రాబిన్ డ్రిస్కాల్, రిచర్డ్ కర్టిస్, బెన్ ఎల్టన్ సంయుక్తంగా రచించారు.
లండన్‌లో ప్రసారమైన ఈ సీరీస్‌ను ఐదేళ్లలో దాదాపు రెండు కోట్ల మందిని అలరించిందని సమాచారం. అంతేకాదు... ఈ సీరియల్ ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొంది. ప్రపంచంలోని 200 భూభాగాల్లో ఈ షో అమ్మకాలు జరిగాయంటే మిస్టర్‌బీన్ కామెడీ సీరీస్‌లో ఎంత సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. మిస్టర్ బీన్ తాకిడితో అటు ఫీచర్ ఫిల్మ్‌లకు, యానిమేటెడ్ కార్టూన్లకు పెద్ద దెబ్బపడింది. అటు తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎమ్.ఎస్‌సి చేస్తున్న అట్‌కిన్‌సన్ మిస్టర్ బీన్ క్యారెక్టర్‌ని మరింతగా అభివృద్ధి చేశాడు. మిస్టర్ బీన్ సెలైంట్ క్యారెక్టెర్. తన హావభావాలతో ఆంగ్లేతర ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అంతర్జాతీయంగానూ పేరు సంపాదించింది. మిస్టర్ బీన్ బెస్ట్ ఫ్రెండ్ టెడ్డీబేర్.
ఈ బొమ్మ ముదురు బ్రౌన్ రంగు, బటన్ ఐస్‌తో ఉంటుంది. మిస్టర్ బీన్ ప్రతి పనిలోనూ టెడ్డీ కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మిస్టర్‌బీన్‌కి ప్రతిరూపం టెడ్డీ అని చెప్పవచ్చు. అలాగే మిస్టర్‌బీన్స్ కార్ కూడా ఈ షోలో హైలైట్. మిస్టర్‌బీన్ కార్ టాప్‌పై చెయిర్‌లో కూర్చొని, ఇల్లు తుడిచే కరత్రో కారును నడపడం, పార్కింగ్ ప్లేస్ కాదని ఎంట్రెన్స్‌లోనే కార్ పార్క్ చేయడం... ఇలాంటి ఎన్నో క్యారెక్టర్ల ద్వారా మిస్టర్ బీన్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీరూ పిల్లల్లా మారి సంతోషంగా ఉండటానికి ఒకసారి మిస్టర్ బీన్‌ను కలవండి. వర్రీలన్నీ తుర్రుమంటాయి.
Source: www.sakshi.com
No comments:
Post a Comment