ఛానల్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో అంతే స్థాయిలో ప్రేక్షకులను తమ ఖాతాలో వేసుకోవడానికి విభిన్న తరహాలో గేమ్ షోలు తయారుచేసి ప్రసారం చేస్తున్నాయి ఛానల్స్. ఈ పరంపరలో విస్సా ఛానల్ ‘సై అంటే సై’ అంటూ కొత్త తరహా గేమ్ షోను ప్రతిరోజు 6.30 ని.ల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తుంది.
ఈ గేమ్ షోలో పాల్గొనాలంటే ముందుగా ఉత్తరం రాయడం ద్వారా గాని ఈ-మెయిల్ చేయడం ద్వారా గాని పేరును సెల్ నెంబర్‌తోసహా ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోగ్రాం సమయంలో ఛానల్ వారే కాల్ చేసి గేమ్ షోను ప్రారంభిస్తారు. షో ఫార్మేట్ విషయానికొస్తే పార్టిసిపెంట్‌ని పదంటే పది ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. ఈ ప్రశ్నలు అన్ని రంగాలకు చెందినవై ఉంటాయి. ఒక్కో ప్రశ్నకి రెండు ఆప్షనన్లు ఇవ్వబడతాయి.
పార్టిసిపెంట్ ఒక్కో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే కొలది వంద రూపాయల చొప్పున గెలుచుకుంటూ పోతాడు. ఇలా పది ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు చెబితేనే ప్రైజ్ మనీ వెయ్యి రూపాయలు గెలుచుకోగలుగుతాడు. ఎక్కడైనా రాంగ్ ఆన్సర్ చెప్పాడా అంతే. అప్పటివరకు గెలుచుకున్న మొత్తం కూడా యాంకర్ ఖాతాకు పోతుంది. కరెంట్ మరియు స్టాక్ జి.కె.లతో అడిగే ప్రశ్నలు ఆలోచింపజేయడమే కాదు సమాధానం తెలిస్తే టెలివిజన్ సెట్ల ముందు గెంతులేసేలా చేస్తుంది. అన్ని వయసుల వారు ప్రోగ్రాంలో పాల్గొనడానికి సై అంటే సై అనడమే కాదు. సరదాగా పాకెట్ మనీని కూడా ఇట్టే కొట్టేయవచ్చు. నాలెడ్జికి నాలెడ్జ్. మనీకి మనీ. అందుకే ప్రేక్షకులు ఈ ప్రోగ్రాం పట్ల సై అంటే సై అంటున్నారేమో!
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment