Sunday, February 13, 2011

ఇప్పుడు వారి ఆలోచనలని నమ్ముతున్నాను

కుటుంబకథా చిత్రాల హీరోగా పేరున్న జగపతిబాబు త్వరలో శత చిత్ర హీరోకానున్నారు. జయాపజయాలు పక్కన పెడితే ఆయన నిత్యం బిజీగానే ఉంటారు. చేతిలో ఎప్పుడూ నాలుగు తక్కువ కాకుండా చిత్రాలుంటాయి. మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న ఆయన ప్రస్తుత పరిశ్రమ తీరుతెన్నులు నిశితంగా గమనించారు. నటించే చిత్రాల సంఖ్య పెంచుకున్నారు. ఏడాదిలో పది చిత్రాలు చేయడానికి సిద్ధమని, కేవలం హీరోగానే కాకుండా, వైవిధ్యం అనిపిస్తే క్యారక్టర్‌ పాత్రలు సైతం చేస్తానని చెబుతున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు.

'పుట్టినరోజు విశేషాలేమిటీ?'
నాకు బర్త్‌డేల కంటే రీ బర్త్‌లు ఎక్కువ. చాలా సందర్భాల్లో జగపతిబాబు పని ఇక అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. కానీ కొత్త ఉత్సాహంతో మళ్లిd వచ్చేవాడిని. ఈ విధంగా వంద చిత్రాలకు చేరువయ్యాను. ఈసారి పుట్టినరోజు ఎప్పటిలాగే అభిమానుల మధ్య జరుపుకుంటున్నాను. ఆరోజు ప్రత్యేకంగా చేసే సామాజిక సేవ గురించి చెప్పడం నాకు ఇష్టం అనిపించదు.

'కెరిర్‌ను విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?'
కొన్ని సినిమాలు ఆడలేదు. మరికొన్ని సక్సెస్‌ అయ్యాయి. దీనికి కారణం అంటూ ప్రత్యేకంగా చెప్పలేం. కొన్ని సినిమాల్లో కొన్ని తప్పులు ఉండవచ్చు. అందువల్లే బాగా ఆడకపోవచ్చు. 'గాయం 2' సినిమాపై మంచి అంచనాతో ఉన్నప్పటికీ, ఆ చిత్రం ఫలితం కూడా నన్ను నిరాశపరిచింది. అయితే ఆ సినిమాకు మంచి బిజినెస్‌ చేయగలిగాం. కానీ, బడ్జెట్‌ అధికం కావడం వల్ల వర్కవుట్‌ కాలేదు. 'గాయం2' నా సొంత సినిమా కావడం వల్లే ఈ విషయాలు చెప్పగలు గుతున్నాను.

'మీ ఆలోచనా విధానం మారినట్టుంది?'
అవును. ఇప్పటి వరకు నాకు నచ్చితే చాలు అనుకునేవాడిని. ఇప్పుడు మాత్రం దర్శకుడు, నిర్మాతల ఆలోచనను కూడా నమ్ముతున్నాను. మరోవైపు బడ్జెట్‌ తగ్గించడానికి నా వంతు సహకారం అందిస్తున్నాను. సినిమా హిట్టా, ఫ్లాపా అనేది మనచేతుల్లోలేదు. అయితే ప్రయత్నంలో మాత్రం లోపం ఉండకూడదు. కొన్ని చిన్న సినిమాలకు పెద్ద సినిమాల వల్ల నష్టం జరుగుతోంది. కలక్షన్లు బావున్నప్పటికీ, వేరే సినిమాల కోసం ధియేటర్‌ నుండి తీసివేస్తున్నారు. ఇక నుండి చిత్రాల సంఖ్య పెంచుకుంటున్నాను.

'బడ్జెట్‌ పరిమితికి మీ సహకారం ఎలా ఉంటుంది?'
పాటలు వద్దని చెబుతున్నాను. నేను డాన్సర్‌ని కాదు. నాపై పాటలు చూడ్డానికి జనం ఇష్టపడకపోవచ్చు. అందువల్ల పాటకు కోటి రూపాయల వ్యయం చేసేబదులు, తగ్గించుకోమంటున్నాను. అలాగే ఫైట్స్‌ విషయంలో కూడా హడావుడిగా ఎక్కువ ఫైట్స్‌ పెట్టేబదులు తక్కువ ఫైట్స్‌ బాగా తీస్తే సరిపోతుంది. దీనివల్ల వ్యయం కంట్రోల్‌ అవుతుంది. నేను నటిస్తున్న తాజా చిత్రం చట్టం ఈ విధంగానే రూపొందుతోంది. నిర్మాత నట్టికుమార్‌ వృధాఖర్చును నివారించగలిగారు. అందువల్ల సినిమాకు అవసరం అయిన చోట ఖర్చు పెడుతున్నాడు. ఇతర ఖర్చులు తగ్గించి, క్లయిమాక్స్‌ బాగా తీయాలని చెప్పాను. ఆ విధంగానే తీశారు. ఆయన పర్‌ఫెక్ట్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమా ద్వారా అందరూ సేఫ్‌ అవుతారు. ఇప్పటి నుండి ఎక్కువ సినిమాలు అంటే ఏడాదికి పది చిత్రాల్లో నటిస్తాను. ఏడాదికి పది చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను.
'పది సినిమాల్లో నటించడం వీలవుతుందా?'
కేవలం హీరోగానే కాదు. మంచి క్యారక్టర్‌ ఉంటే కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. యాంటీ హీరోగా, మల్టిdస్టారర్‌ చిత్రాల్లో నటించడానికి అభ్యంతరం లేదు. అంత:పురంలో నటించే సందర్భంలో ఇలాంటి పాత్ర చేయడమేమిటీ అని చాలా మంది తిట్టారు. అదే పాత్రకి పేరు వచ్చింది. అవార్డు తెచ్చింది. ఇక్కడ (సినిమారంగంలో) ఫలానా విధంగానే చెయ్యాలని అనే రూల్‌ లేదు. ఏదైనా చేయవచ్చు.

మహిళా ప్రేక్షకులకు అభిమాన హీరో కదా, ఇప్పుడు అలాంటి చిత్రాలు చేయడం లేదు?'
ఆ రోజుల్లో అలాంటి చిత్రాలు వచ్చాయి. నటించాను. అవి పరిమిత రోజుల్లో, బడ్జెట్‌ కంట్రోల్లో తీసిన చిత్రాలు. ఇప్పుడు అలాంటి చిత్రాలు రావడం లేదు.
'జై బోలో తెలంగాణ చిత్రంలో నటించారు. స్పందన ఎలా ఉంది?'
దర్శకుడు శంకర్‌ జైబోలో తెలంగాణలో నటించాల్సిందిగా కోరారు. కథ చెప్పారు. ఒక రోజంతా ఆలోచించి కమిటయ్యాను. నాన్నగారు కూడా వద్దని వారించారు. అయితే కేవలం ఒక కళాకారుడిగా మాత్రమే నటించాను. ఇందులో ఆంధ్రవారిని విమర్శించే డైలాగ్‌లు లేవు. ఒకటి, రెండు ఉన్నప్పటికీ పలకను అని చెప్పాను.

'టీవీ షో ప్రజెంటర్‌గా ఎలాంటి అనుభూతి పొందారు?'
రాజు రాణి జగపతి షో నాకు పిల్లల మైలేజ్‌ తెచ్చిపెట్టింది. పిల్లలు బాగా ఇష్టంగాచూస్తున్నారు.

'మీ కొత్త చిత్రాలు?'
ప్రస్తుతం 'చట్టం', 'క్షేత్రం', 'నగరం నిద్రపోతున్నవేళ', 'కీ' చిత్రాల్లో నటిస్తున్నాను. 

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment