హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 20 కోట్ల రూపాయలకు రాజ్యసభ సీటును అమ్ముకొని టీవీ ఛానల్ కొన్నారాని పర్చూరు ఎమ్మెల్యే, పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు బుధవారం ఆరోపిస్తూ మీడియాకు ఓ లేఖ రాశారు. నా నియోజకవర్గం పర్చూరుకు వచ్చి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. అవినీతికి అధ్యుడు చంద్రబాబే అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చాలామంది నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇటీవల చంద్రబాబు రాజ్యసభ సీటుని 20 కోట్ల రూపాయలకు అమ్ముకొని టీవీ ఛానల్ కొన్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు అవినీతిపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మార్ కుంభకోణంలోనూ చంద్రబాబే అధ్యుడు అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో చంద్రబాబు విల్లాలు ఉండటం అబద్దమా అని ప్రశ్నించారు. మహానాడు సమయంలో డబ్బులు వసూళ్లు చేసే వారన్నారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ నేతలనుండి డబ్బులు వసూలు చేసేవారని ఆరోపించారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ చంద్రబాబును మందలించేవారని చెప్పారు. 2009 ఎన్నికల్లో హెలికాప్టర్‌లో డబ్బులు తరలించిన ఘతన చంద్రబాబుది అన్నారు. 2004 ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గచ్చిబౌలిలోని వెయ్యి ఎకరాల భూమిని ఐఎంజికి అక్రమంగా కేటాయించారని ఆరోపించారు. అన్ని అక్రమాలకు ఆధ్యుడు అయిన చంద్రబాబుకు అవినీతిపై ఇతరులను ఆరోపించే అర్హత లేదన్నారు.

Source: thatstelugu.oneindia.in
No comments:
Post a Comment