Wednesday, February 9, 2011

తెలుగులో రెండు కొత్త చానళ్లను ప్రారంభించిన మాటీవీ

మా టెలివిజన్ నెట్ వర్క్  తెలుగులో రెండు కొత్త ఛానళ్లను ప్రారంభించింది. యువ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్  తేజ్  మాటీవీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఛానళ్ల ప్రారంభోత్సవంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిగా యువ హీరో హీరోయిన్లు సందడి చేశారు. ఈ సందర్భంగా మాటీవి భవిష్యత్ ప్రణాళికను యాజమాన్యం మీడియాకు వివరించింది. 

వినోద భరిత ఛానల్ మాటీవీకి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అనతికాలంలోనే ప్రముఖ వినోద ఛానళ్లతో పోటీపడి ఒకటిగా నిలిచింది. ప్రేక్షకులను అలరించేందుకు మా టెలివిజన్ నెట్ వర్క్స్ మరో రెండు కొత్త చానళ్లకు శ్రీకారం చుట్టింది. మా జూనియర్ ఛానల్ ను ప్రముఖ నిర్మాత రామానాయుడు ప్రారంభించగా మా మూవీస్ ఛానల్ ను ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. 


రానున్న కాలంలో మరో రెండు రాష్ట్రాలకు మా టీవీ కార్యక్రమాలను విస్తరించాలనుకుంటున్నట్లు మా యాజమాన్యం తెలిపింది. పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశాలు దగ్గరలో లేవని స్పష్టం చేసింది. మా టీవీ ప్రారంభించిన నాటి కంటే ఇప్పుడు రెవెన్యూ ఆదాయం ఐదారు రెట్లు పెరిగిందని సంస్థ ఛైర్మన్ మ్యాట్రిక్ ప్రసాద్ ప్రకటించారు. మా టీవీ బోర్డు డైరెక్టర్ గా యువ నటుడు, చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ చేరారన్నారు.
ఛానళ్ల ప్రారంభోత్సవంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలువురు ఆర్టిస్టులు చేసిన డ్యాన్సులు, మిమిక్రీ ఆహుతులను కట్టిపడేశాయి. యువ హీరో హీరోయిన్లు ప్రారంభోత్సవంలో సందడి చేశారు.

No comments:

Post a Comment