Wednesday, February 9, 2011

చిరంజీవి ఛానెల్ ! సాక్షికి పోటీయా ?

హైదరాబాద్ : ఆదివారం సుముహుర్తంగా కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) వీలిన నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ పార్టీ అధ్యక్షుడైన చిరంజీవి స్వంత టీవీ ఛానల్ ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఇందుకు మరో ఆరు సమయం పట్టవచ్చు. ప్రస్తుతం పిఆర్పీ కార్యాలయంలోని సిబ్బందిని ఆ ఛానల్‌లో చేర్చుకుంటామని 'చిరు' హామీ లబించినట్లు సమాచారం.

"పార్టీల వీలినం గురించి వార్తలు విన్న తర్వాత మేమంతా మా భవిషత్తు గురించి చిరంజీవితో మాట్లాడాం. కొత్తగా పెట్టబోయే ఛానల్‌లో మమ్మల్ని చేర్చుకుంటామన్నారు" అని పిఆర్పీ కార్యాలయానికి చెందిన ఉద్యోగి ఒకరు  ఎక్ష్‌ప్రెస్‌తో అన్నారు.
టీవీ ఛానల్ పెట్టే వరుకూ సిబ్బందికి జీతలిచ్చేందుకు చిరంజేవి ఒప్పుకున్నట్లు తెలిసింది. "నామమాత్రపు సిబ్బందిని ఆరు నెలలపటు పోషించడం చిరంజీవికి భారం కాదు" అని ఆ ఉద్యోగి అభిప్రాయపడ్డారు.
చిరంజీవి కొత్త ఛానెల్‌ పెడితే రాజకీయ పార్టీల మధ్య మీడియా వార్‌ మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఇప్పటికే ప్రత్యర్థుల్ని ఎదుర్కునేందుకు టిఆరెస్‌, జగన్‌, తెలుగుదేశం వర్గాలకు స్వంత టీవీ ఛానెళ్ళున్నాయి. కాగా, చిరంజీవి ఇక కాంగ్రెస్‌ కుటుంబీకుడు కావడంతో ఈయన ఛానెల్‌ కడప మాజీ ఎరీప జగన్‌కు చెందిన "సాక్షి' టీవీ ఛానెల్‌కు పోటీగా కాంగ్రెస్‌పై అటు నుంచి జరిగే దాడుల్ని ఎదుర్కొనడానికి, ప్రతిదాడులు చెయ్యడానికి ఉపయోగపడవచ్చు.  

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment