బొబ్బిలి, మేజర్‌న్యూస్:- ఎందరెందరో సంగీత ఉద్దండులు, వాద్య సంగీత విద్వాంసులు, చిత్రకళాకోవిదులు, అభ్యుదయ మహాకవులు, రచయితలు, ప్రముఖ సినీ కళాకారులు, సంఘసంస్కర్తలు, సాహిత్య కోవిదులు, స్వాతంత్య్ర ఉద్యమ కర్తలు, రాజకీయ వేత్తలు పుట్టి పెరిగిన మట్టి నేల మన తెలుగు నేల. సదాచార సంస్కృతీ సంప్రదాయాలకు నైతిక విలువలకు పుట్టినిల్లు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, సాహిత్య, నృత్య వికాశాలను సుసంపన్నం చేసిన ఈ తెలుగు నేల మీద క్రమేపి సదాచార సంప్రదాయాలు కనుమరుగవుతూనే ఉన్నాయి.
ఆధునికత పేరిట విదేశీ విషసంస్కృతి యువతీ యువకులను , పిల్లల మనసులను కలుషితం చేస్తోంది. టివి చానళ్లలో వస్తున్న రియాలిటీ షోలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విలసిల్లుతున్న కాస్మోపాలిటిన్ సంస్కృతి సాయంత్రం కాగానే పబ్‌లకు, క్లబ్బులకు సాగరతీరాలకు, పార్కులకు వెళ్లటం యువతీ యువకులకు సర్వసాధారణమైపోయింది. యువకులతో బాటు ఆల్కహాల్ కలిపిన సాఫ్ట్ డ్రింక్స్ తీసుకునే యువతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలాగని అందరూ అలాగే ఉంటారని కాదు. సదాచార సంప్రదాయాలు, నైతిక విలువలకు పెద్దపీట వేసే వారు ఉన్నారు. కానీ అలాంటి వారు ఎంత మంది ఉంటారో వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.
పబ్బుల్లో ,స్టార్ హోటళ్లలో యువతీ యువకులు జంటగా పాశ్చాత్య నృత్యాలు చేసే స్థాయికి మన సంస్కృతి మారిపోయింది. వినియోగదారులను ఆకర్షించాలన్న తాపత్రయంతో సమయం, సందర్భం లేకపోయినా ఇటువంటి వికృత నృత్యాలకు అవకాశమిస్తున్నాయి. వందలాది మంది ప్రేక్షకుల నడుమ వేదికపై ఒకరికొకరు పెన వేసుకుంటూ నృత్యాలు చేసే యువత, ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు సరికొత్త జీవనశైలికి తార్కాణంగా నిలుస్తున్నారు. టెలివిజన్ చానళ్లలో వస్తున్న విషసంస్కృతి మాయలో పిల్లలు, యువతీ యువకులు తల్లి దండ్రులు కూడా పడిపోతున్నారు. తెరపై అలాగే కనిపించాలని యువతీ యువకులు తాపత్రయపడుతున్నారు.
చాలీచాలని బట్టలు వేసుకుని ఆడియోలో వినిపిస్తున్న మత్తెక్కించే పాటలకు అసభ్యకరంగా డ్యాన్సులు చేసినా పరవాలేదు. తమ పిల్లలకు నలుగురిలో గుర్తింపు రావాలి, వారు టెలివిజన్ చానళ్లలో కనిపించాలని తహతహలాడే తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టివి చానళ్లు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లో పిల్లలు ముఖ్యంగా అమ్మాయిల్లో అతి చిన్న వయసులోనే అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తుంటే వారిని వారి తల్లిదండ్రులు చప్పట్లు చరిచి మరీ ప్రోత్సహిస్తున్న సందర్భాలు కోకొల్లలు. అర్ధనగ్నంగా కురచదుస్తులు ధరించి అసభ్యకరమైన హావభావాలతో యువతీ యువకులు డ్యాన్సులు చేస్తుంటే ఇది కాదు మన సంస్కృతి అని చెప్పాల్సిన తల్లిదండ్రులు, న్యాయ నిర్ణేతల స్థానంలో కూర్చున పెద్దలు ఇదే మన సంస్కృతి, సంప్రదాయం అని సంబరంగా చాటి చెప్పటాన్ని ఏమనాలి.
ముక్కుపచ్చలారని తమ ఆడ పిల్లలు అర్ధనగ్నంగా దస్తులు ధరించి పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తుంటే వేదిక దిగువన కూర్చుని వారిని చూసి మురిసి పోయే తల్లిదండ్రులు గురించి ఏమనుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఇదేనా మన సంస్కృతి, సంప్రదాయం, మహోన్నతమైన మన తెలుగు సంస్కృతి రోజురోజుకు క్షీణిస్తుంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా. నైతిక విలువలతో సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోకపోతే రాబోయే వారసత్వం ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంగా ఉంటుందనేది వాస్తవం. ఈ పరిరక్షణ కార్యక్రమంలో రచనా సమాఖ్య తన పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తిస్తుందనడంలో సందేహం లేదు.

Source: www.suryaa.com
చాలా చక్కని అంశాన్ని అందించారు ధన్యవాదములు
ReplyDelete