Tuesday, February 15, 2011

చదువే ముఖ్యం..!!


‘బందినీ’ సీరియల్ చూసే వారెవరికైనా - ఆషియా ఖాజీ ముద్దు మొహం గుర్తుంటుంది. ‘సంతు’ పాత్రలో అంతగా వొదిగిపోయింది. ఆ సీరియల్ క్లైమాక్స్‌కి చేరుకోవటంతో - ఇక తర్వాతి ప్రాజెక్ట్ ఏమిటాని దీర్ఘంగా ఆలోచించి.. తన దృష్టిని చదువుపై మళ్లించనున్నట్టు ప్రకటించింది. షూటింగ్‌ల వెంట పరుగులెట్టడంతో అర్థంతరంగా తన లెవెన్త్ స్టాండర్డ్ ఆగిపోయింది. పుస్తకం ముట్టటానికి కుదర్లేదు. నోటు పుస్తకాలన్నీ షూటింగ్ షెడ్యూల్స్‌తో నిండిపోవటం.. షూటింగ్ పూర్తవటంతో చదువు పూర్తి చేయాలన్న ఆకాంక్షని వెలిబుచ్చుతోంది ఆషియా. మరి -ఇంతలో మరో ప్రాజెక్ట్ ఏదైనా వస్తే పరిస్థితి ఏమిటంటే - కెరీర్‌లో మంచి మలుపు లొచ్చినప్పుడు.. ఆ అవకాశాల్ని వదులుకోను. ఐతే - ఎప్పటికైనా చదువు పూర్తి చేస్తానన్న ధీమాని వ్యక్తం చేస్తోంది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment