బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌గా ‘ఈటీవీ’
2001 నుంచి పదేళ్ల కాలానికి మెగా డికేడ్ టీవీ అవార్డులను మెగా సిటీ నవకళావేదిక 14వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేయనుంది. అవార్డుల ప్రదానోత్సవాన్ని మే 18న సాయంత్రం త్యాగరాయ గానసభ సదనంలో జరుపుతున్నట్లు అవార్డుల కమిటీ అధ్యక్షుడు డా.వడ్డేపల్లి కృష్ణ, నిర్వాహణ సంస్థ అధ్యక్షుడు కె.మల్లికార్జునరావు సోమవారం త్యాగరాయ గానసభ భవనంలో విలేకరులకు తెలిపారు. మెగా డికేడ్ టీవీ అవార్డుకు బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌గా ఈ-టీవీ, బెస్ట్ న్యూస్ ఛానల్‌గా ఎన్ టీవీలను ఎంపిక చేసినట్లు వారు వివరించారు. ఉత్తమ నిర్మాతగా నాగబాల సురేష్‌కుమార్, దర్శకుడిగా శ్రీధర్, నటుడుగా ప్రభాకర్, నటిగా ప్రీతి నిగమ్, క్యారెక్టర్ యాక్టర్‌గా జీవీ నారాయణరావు, క్యారెక్టర్ యాక్ట్రెస్‌గా సనా, హాస్యనటుడుగా అశోక్‌కుమార్, హాస్యనటిగా రాగిణి ఎంపికయ్యారని వెల్లడించారు. సాయికుమార్ ఉత్తమ యాంకర్, స్వప్న ఫిమేల్ న్యూస్‌రీడర్, బద్రి మేల్ న్యూస్‌రీడర్, నేతాజీ న్యూస్ కో-ఆర్డీనేటర్, ఎ.శ్రీనివాస్ కథా రచయిత, నాగరాజు సంగీత దర్శకుడు, నిత్యసంతోషిని గాయని, బంటి గాయకుడుగా అవార్డులు అందుకుంటారన్నారు. ముఖ్య అతిథిగా స్త్రీ శిషు సంక్షేమ శాఖామంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సభాధ్యక్షుడుగా సమాచార శాఖ కమిషనర్ పార్థసారధి హాజరవుతారన్నారు. మొదట మువ్వ ఆంధ్ర నాట్యం ప్రదర్శిస్తారన్నారు. గానసభ అధ్యక్షుడు కళాదీక్షితులు, నిర్వాహణ సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రాఘవేంద్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Source: www.vasantam.net
No comments:
Post a Comment