ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న కేబుల్ టీవీ వ్యవస్థను చిన్నతరహా పరిశ్రమగా గుర్తించాలని ఇంటర్ రీజినల్ కేబుల్ టీవీ ఎంఎస్‌వోలు కులదీప్ సహాని, భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన కేబుల్ టీవీ వంటి ప్రతిష్ఠాత్మక మాధ్యమానికి కనీస రక్షణ, ప్రోత్సాహం, గుర్తింపు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. డీటీహెచ్ సర్వీసులు, పే ఛానళ్లు, పెరుగుతున్న నిర్వహణ వ్యయం.. వంటి సమస్యలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం ఆదుకొనేందుకు ప్రయత్నించడం లేదన్నారు. కేబుల్ పరిశ్రమను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని, విద్యుత్తు స్తంభాలను ఉచితంగా వినియోగించుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని, వినోద పన్ను ఎత్తివేయాలని, ఎంఎస్‌వోలు, కేబుల్‌ఆపరేటర్లకు గుర్తింపుకార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Source: www.eenadu.net
No comments:
Post a Comment