Tuesday, May 17, 2011

ఆరు వసంతాల జీ తెలుగు సంబరాలు

జీ తెలుగు నేటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకుని తెలుగులో ప్రధాన వినోదభరిత ఛానెల్‌గా నిలిచింది. ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, మ్యూజిక్, మూవీస్ ఇలా అన్ని విభాగాల్లో ఛానెల్స్‌ని నిర్వహిస్తూ వినోదమే ఊపిరిగా, వైవిధ్యమే ఆయువుగా జీ తెలుగు కొనసాగుతోంది. ప్రతిభా అన్వేషణలో భాగంగా సింగింగ్ టాలెంట్ షోస్‌కి కొత్తదనాన్ని జోడించి జీ తెలుగు ఆవిష్కరించిన సరాగాల స్వరఝరి ‘సరిగమప’.. డాన్స్ అంటే ఆట, ఆట అంటే డాన్స్ అన్న రీతిలో ‘ఆట’ ది అల్టిమేట్ డాన్స్ షో.. తెలుగులో ప్రారంభమైన తొలి కుకరీ షో ‘మీ ఇంటి వంట’ ఇప్పటికి 2000 పైగా ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుని మున్ముందుకు సాగుతోంది. ప్రేక్షకులకు ఆధ్యాత్మిక భావాన్ని అందించాలన్న ఆలోచనతో పుట్టిన ‘భక్తి సమాచారం’... సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమం ఇప్పటికి దాదాపు వంద కుటుంబాలను కలిపింది. జీ తెలుగు అందిస్తున్న ఆయుర్వేద జీవన విజ్ఞానం, గోపురం, గడసరి అత్త - సొగసరి కోడలు కార్యక్రమాలు మహిళా ప్రేక్షకుల మన్ననలతో సాగుతున్నాయి. ఇక సీరియళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. రాధికా మాధవుల ప్రణయగాథ ‘చిన్నకోడలు’.. చిట్టితల్లి సావిత్రి హృదయ వేదన ‘పసుపు కుంకుమ’.. చిన్నారి రాధతో విధి చెలగాటం ‘రాధా కల్యాణం’... - ఇలా ఎన్నో సీరియళ్లతోనూ కార్యక్రమాలతోనూ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది జీ తెలుగు.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment