Monday, May 23, 2011

టాలెంట్ ఉన్న యువ హీరో కౌశిక్

''సునిశితమైన భావాలు వెండితెరపై పలికించడానికి కళ్ళు, పెదవులు ప్రధానం. కౌశిక్ లో అవి రెండూ వున్నాయి. దానికి తోడు తీరైన పర్సనాలిటీని ఇటీవలి కాలంలో పెంపొందించుకుని సిసలైన హీరోగా తయారయ్యాడు'' అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ''టాలెంట్ వుండే సినీ నేపథ్యం లేని వాళ్ళకు హీరోగా ఇప్పటి పోటీ వాతావరణంలో ఛాన్స్ వుందా అనే ప్రశ్నకు జవాబు కౌశిక్. ఇలాంటి కుర్రాళ్ళు చాలామంది ఇండస్ట్రీలోకి రావాలి'' అని కౌశిక్ ని ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన వైబ్ సైట్ ని ప్రారంభిస్తూ ఆయన అన్నారు. ''రియల్ టాలెంట్ వున్నవారు గతంలో విజయం సాధించారు. ఆ కళ్ళు, ఆ పెదవులు పౌరాణిక చిత్రాలకు, పాత్రలకు చక్కగా సరిపోతాయి అనుకుంటే ఇప్పుడు డెవలప్ అయిన కారణంగా సాంఘిక చిత్రాలకూ హీరోగా ధీటుగా సరిపోతాడు. స్వర్ణయుగంలో రూపొందించిన అన్నపూర్ణావారి చిత్రాలు, శాంతినివాసం వంటి సినిమాల్లాంటివి ఇప్పుడు తీయాలంటే సరైన హీరోలులేని రోజులివి. అలాంటి చిత్రాలకు కూడా హీరోగా కౌశిక్ చక్కగా సూట్ అవుతాడు. రియల్ టాలెంట్ వున్నవారిని సరైన దిశలో ప్రమోట్ చేయగలిగితేనే సక్సెస్ లభిస్తుంది. కౌశిక్ విషయంలో అదే జరిగింది. మలయాళంలో అయ్యప్పస్వామిగా పాపులర్ అయిన కౌశిక్ అక్కడే హీరోగా ద్విపాత్రాభినయం చేసే అవకాశం వస్తే చేయడం, తర్వాత 'జగద్గురు ఆది శంకరాచార్య'లో నటించడం... ఇలా మంచి రూట్లో వెడుతున్నారు. తండ్రి విజయబాబు నుంచి క్రమశిక్షణ, పట్టుదల అలవరచుకున్న కౌశిక్ నిర్మాతల హీరోగా రాణిస్తాడని రాణించాలని హీరోగా తొలి నాలుగు చిత్రాల వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తే కౌశిక్ కి తిరుగుండదని, టాలెంట్ వున్న కొత్తవాళ్ళలో, సినిమాలు చేసే నాలాంటి వాళ్ళకు సరైన హీరో ఇతడే'' అని ఆశీర్వదించారు దాసరి. బాలనటుడు కౌశిక్ చిత్రరంగ ప్రవేశం, టీవీ రంగంలో ప్రవేశం తన ప్రమేయం లేకుండానే జరిగిందన్నారు కౌశిక్ తండ్రి విజయబాబు. ఇటీవల మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ అవార్డ్ లభిస్తే అది బాలనటుడుగా వచ్చిందేమోనని అనుకున్నానని, మోస్ట్ పాపులర్ యాక్టర్ గా ఇచ్చారని తెలిసి ఆనందించానని ఆయన అన్నారు. చదువు దెబ్బతినకూడదనే ఆలోచనతో సినిమాలకు తాత్కాలికంగా చెక్ పెడదామని అనుకుంటే మలయాళంలో అయ్యప్పస్వామి సీరియల్ అనేసరికి అంగీకరిస్తే అది మూడు సంవత్సరాలు ప్రసారరమై అక్కడ వారికి అభిమాన పాత్రుడయ్యాడు అన్నారు. సినీరంగంలో నిలదొక్కుకునేందుకు గాడ్ ఫాదర్స్ గానీ, నిలబెట్టే ఆర్థిక స్థోమత గాని లేదనే విషయం తన మాటల ద్వారా గుర్తించి స్వయంకృషితో డాన్స్లులు, ఫైట్లు అన్నిటిలో తర్ఫీదు పొంది స్టామినా సాధించాడని'' విజయబాబు చెప్పారు. జగద్గురు ఆదిశంకరాచార్యకి దర్శకత్వం వహిస్తున్న భారవి మాట్లాడుతూ- ''కేరళలో కౌశిక్ ని కుట్టి ఎన్టీఆర్ అని ప్రేమగా అభిమానంగా పిలుస్తారని, పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్ స్థాయికి కౌశిక్ ఎదగాలని, అతనిలోని క్రమశిఓణ, డివోషన్ అందుకు బాగా ఉపకరిస్తాయని అన్నారు. నిర్మాత నారా జయశ్రీ, తమ్మరెడ్డి భరద్వాజ కౌశిక్ నటన క్రమశిఓణ తదితర అంశాల గురించి ప్రసంగించారు.

Source: www.manyaseema.com

No comments:

Post a Comment