Monday, May 23, 2011

ఎస్వీ భక్తి ఛానల్ నిధుల దుర్వినియోగం

తిరుమల తిరుపతి దేవస్థానముల (టిటిడి) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో(ఎస్వీబీసీ) అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్ధతో (సిబిఐ) విచారణకు ఆదేశించాల్సిందిగా శ్రీవైష్ణవ బ్రాహ్మణ సమాజ సంఘ సేవా సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుబట్టింది. 

సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలాచార్యులు గురువారమిక్కడి విలేకరులతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి కార్యక్రమాల రూపకల్పనలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ""ఛానల్‌కు కార్యక్రమాలు రూపొందిస్తున్నామనే ముసుగులో కొందరు అగ్ర నిర్మాతలు వారికి చెందిన ప్రెవై[ట్‌ స్టూడియోల్లో చిత్రీకరణకు అనుమతిస్తూ పెద్ద మొత్తాల్లో బిల్లులు సమర్పిస్తున్నారు. కార్యక్రమాల చిత్రీకరణకు ఇప్పటి దాకా సరిగ్గా ఉపయోగపడని ఒక ప్రెవై[ట్‌ స్టూడియోకు సైతం ఛానల్‌ నెలకు రూ.మూడు లక్షలు చెల్లిస్తోంది'' అని ఆయన ఆరోపించారు.

ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి తిరుపతికి తరలించేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని గోపాలాచార్యులు పేర్కొన్నారు. 

"అర్చన' సీరియల్‌ రూపకల్పన కోసం ఎస్వీబీసీ ఛానల్‌ అలిపిరి గేట్‌ దగ్గర రూ.రెండు కోట్ల విలువైన షూటింగ్‌ సెట్‌ను నిర్మించింది. కానీ పెదజీయర్‌ స్వామీ అభ్యంతరం చెప్పటంతో ఆ సీరియల్‌ ఛానల్‌లో ప్రసారం కాలేదు. స్వామీ అభ్యంతరాన్ని అనుసరించి "అర్చన' సీరియల్‌ ఒక ప్రైవేట్‌ ఛానల్‌లో ప్రసారమవుతోందని ఆయన ఆరోపించారు.

ఛానల్‌లో జరుగుతున్న అవకతవకలపై త్వరలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డికి తాము ఒక వినతి పత్రం సమర్పిస్తామని గోపాలాచార్యులు తెలిపారు. ఛానల్‌ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తిరుపతి వద్ద ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని గోపాలాచార్యులు బెదిరించారు.

Source: www.apweekly.com

No comments:

Post a Comment