తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తూ, మోసపూరితంగా ఉద్యమాన్ని అణిచివేయాలని టీవీ-9 చానల్ ప్రయత్నిస్తున్నది.. దానికి నిరసనగా ఆ చానల్ ప్రసారాలను తెలంగాణలోని 10 జిల్లాల్లో సోమవారం నుంచి నిరవధికంగా బంద్ చేస్తున్నాం.. అని తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు కుల్‌దీప్ సహాని ప్రకటించారు. ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, తెలంగాణవాదుల ఒత్తిడి మేరకు టీవీ-9 ఛానల్‌ను బంద్ చేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబ సభ్యులు సైతం టీవీ-9 ప్రసారాలను నిలిపివేయాలని కోరారని చెప్పారు. గతంలో చేసిన రాజీనామాలను శాసనసభ స్పీకర్ తిరస్కరించినప్పటికీ, తెలంగాణ ప్రజావూపతినిధులు మళ్లీ రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపచేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాలను ఆమోదింపజేసుకున్నపుడే వారు ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. లేకుంటే నేతల భవిష్యత్ శూన్యం అవుతుందని హెచ్చరించారు. ప్రజావూపతినిధులు ఉద్యమంలో మమేకమై పోరాడాలని సహాని సూచించారు. మిగతా సీమాంధ్ర చానళ్లను కూడా బ్యాన్ చేయాలని కులదీప్ సహానీకి పోరుతెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది.
Source: www.porutelangana.com
మీ సంస్కారంనకు నిదర్శనం.
ReplyDelete