Friday, July 15, 2011

సోనీ టివీ చేతుల్లోకి రామోజీరావు ఈటివి?

ఈటీవీ కి చెందిన పదకొండు రీజనల్ ఛానెల్స్ ని సోనీ టెలివిజన్ ఇండియా వారు కొనుగోలు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే ఇండియాలో ఇప్పటి వరకూ జరిగిన పెద్ద మీడియా డీల్ గా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

రామోజీరావు తన తమ మీడియా గ్రూపులోని ప్రాంతీయ భాషా చానళ్లలో కొంత వాటాను సోని గ్రూప్ కు అమ్మివేయనున్నారంటూ బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో ఓ కధనం వచ్చింది. దాని ప్రకారం రెండు కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇవి అడ్వాన్స్ డ్ దశలో ఉన్నాయని ఈ పత్రిక రాసుకొచ్చించది. అలాగే సోని గ్రూపునకు వాటాలను విక్రయించడం ద్వారా రామోజీ గ్రూప్ కు సుమారు 2400 కోట్ల రూపాయల వరకు సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఒప్పదం కనుక ఖరారైతే, దేశంలోనే అతిపెద్ద డీల్ అవుతుందని బిజినెస్ స్టాండర్డ్ వ్యాఖ్యానించింది.

ఇక దేశవ్యాప్తంగా స్టార్, జీ చానళ్లను ఎదుర్కోవడానికి సోని ఈ నిర్ణయానకి వచ్చిందని సమాచారం. అయితే సోని సంస్థ అదికార ప్రతినిదికాని, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, ఎమ్.డి కిరణ్ గాని ఈ విషయంపై ప్రస్తుతం స్పందించటానకి ఒప్పుకోవటం లేదు. ఇక ఈనాడు గ్రూప్ ఈ పెట్టుబడలు ఆహ్వానించటానకి కారణం ఇప్పటికే ఈనాడు గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన కంపానీ గ్రూప్ ను బయటకు పంపించివేయడానికే అని ఆ పత్రిక తెలిపింది.

ఇక కంపానీకి పెట్టిన రెండు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులకు గాను నలభై శాతం వాటాను ఇచ్చారు. ఇప్పుడు ఆ వాటాను సోనికి విక్రయించడం వల్ల ఈటివి ఛానల్ లో వార్తల స్లాట్ ను నిబంధనల ప్రకారం ఎత్తివేయవలసి ఉంటుందని అంటున్నారు. అయితే రామోజీ గ్రూప్ ఈటీవి-2 ని సోనికి విక్రయించడం లేదు. కాబట్టి వార్తా ఛానెల్ కి సమస్య రాదు.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment