Thursday, July 28, 2011

వాల్ట్ డిస్ని చేతికి ఆ ఛానెల్

ప్రపంచంలో భారతదేశం టీవీ మార్కెట్లో మడవ ప్లేసులో ఉంది. కెపిఎమ్ జి సర్వే ప్రకారం చైనా, అమెరికా తర్వాత ఎక్కువ టీవీ వీక్షకులు ఉన్న మార్కెట్ మనదే. దాంతో ఇప్పుడు లోకల్ మార్కెట్ ని ఆక్రమించటానికి ఎక్కడెక్కడి సమీకరణాలు మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రిందట ఈటీవిని రీజనల్ మార్కెట్ లో వాటా కోసం సోనీ కొనుగోలు చేయటానకి మందుకు వచ్చిందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు డిస్నీ స్టూడియో వారు యూటీవీని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు తీసుకోవటాకి ఒప్పందం కుదుర్చుకోవటానకి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


ప్రపంచంలోని మీడియా ఫర్మ్ లలో ఒకటైన వాల్ట్ డిస్నీ వారు యూటీవి సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ లిమెటెడ్ ని తీసుకోవటానకి కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ రెండు ఫర్మ్ లు కలిసి పనిచేస్తున్నాయి. వాల్ట్ డిస్నీ 50.44% వాటాని యూటీవిలో కలిగి ఉంది. ఇప్పుడు మిగిలిన మార్కెట్ ని కూడా హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. షేర్ వెయ్యి రూపాయలు చొప్పున యూటీవీ షేర్స్ ని షేర్ హోల్డర్స్ నుంచి కొనుగోలు చేయటానికి ముందుకొచ్చింది. ఈ ప్రపోజల్ కి యూటీవీ ఛీప్ రోనీ స్క్రూవాల్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ డీల్ ఖరారైతే రోనీ స్క్రూవాలా ఆ సంస్ధకు యజమాని నుంచి ఎంప్లాయిగా మారుతారు. అంతేగాక డిస్నీకు చెందిన మేనేజింగ్ డైరక్టర్స్ లలో ఒకరిగా సౌత్ ఆసియన్ రీజియన్ కి వ్యవహరిస్తారు. అతి త్వరలోనే ఈ డీల్ పూర్తవతుందని బిజెనెస్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదే జరిగితే తమ పరిస్ధితి్ ఏమిటని యూటీవికి పోటీ ఇస్తున్న మిగతా ఛానళ్ళు ఆలోచనలో పడ్డాయి. లోకల్ ఛానెల్ కు పోటీ సాధ్యమేకానీ, అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే ఛానెల్ తో పోటీ పడటం కష్టమేనని అభిప్రాయపడుతున్నాయి.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment