Tuesday, July 5, 2011

ట్విస్ట్‌లతో సరదాగా సాగే.. ‘బంగారు కోడిపెట్ట’

జెమిని టెలివిజన్‌లో సరికొత్త గేమ్ షోగా ‘బంగారు కోడిపెట్ట’ ఇటీవల ప్రారంభమైంది. ఈ షో ప్రతి శని, ఆదివారాలలో సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రేక్షకులను అలరించనుంది. జెమిని టాక్‌షోలకు గేమ్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంలో ఉదయభానుకు మంచి క్రేజ్ ఉంది. ఈ షోకు కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ బుల్లితెరపై దర్శనమిచ్చింది.

‘బంగారు కోడిపెట్ట’ షో పేరుకు తగ్గ సెట్ ప్రాపర్టీతో కనిపించింది. ‘ఘరానా మొగుడు’ ‘మగధీర’లలో మంచి పాపులర్ అయిన ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి...’ పాటను ఉదయభాను స్టెప్స్‌తో గ్రాఫిక్ మిక్సింగ్ బాగా చేయడంతో ప్రేక్షకులు షో పట్ల కూడా ఆకర్షితులయ్యారు.

వందల నుండి లక్షల వరకు డబ్బును గెలుచుకోవచ్చుననే కాన్సె
ప్ట్‌తో తయారు చేయబడిన ‘బంగారు కోడిపెట్ట’ షో ఫార్మేట్ డిఫరెంట్‌గా ఉంది. గేమ్‌లో ఎపిసోడ్‌కి నలుగురికి మాత్రమే అవకాశం కల్పించ బడుతుంది. నాలుగు రౌండ్లలో గేమ్ ముగిసేలోపు ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. మిగిలిన ఒకరు ఆఖరి జాక్‌పాట్ రౌండ్‌లో ఎంత గెలుచుకుంటారో అదే విన్నింగ్ ప్రైజ్‌గా లభిస్తుంది.

మొదట ప్రతి పార్టిసిపెంట్‌కి నాలుగు బంగారు కోడిగుడ్లు ఇస్తారు. వాటిలో మూడు అంకెల డబ్బు నుండి ఐదంకెల డబ్బు వరకు ఉంటుంది. ఇంకా అమృతం బిందె కాని విషం బాటిల్ కాని సర్వం గాని ఉండవచ్చు. అమృతం వస్తే పార్టిసిపెంట్ దానిని లైఫ్‌లైన్‌గా తనకు తాను ఉపయోగించుకోవచ్చు లేదా ఎదుటివారికి (నచ్చితే) ఉపయోగించవచ్చు.

విషం బాటిల్ వస్తే షో నుండి ఎలిమినేట్ కావల్సిందే. సర్వం వస్తే మనకు నచ్చని పార్టిసిపెంట్‌ని (కాటు వేసి) ఎలినిమేట్ చేయవచ్చు. కాకపోతే ఎందుకు ఎలిమినేట్ చేశామో రీజనింగ్ చెప్పాలి. జాక్‌పాట్ రౌండ్‌లో కోడిగుడ్లు కాస్తా బాతుగుడ్లుగా మారి షో ఆడాల్సి ఉంటుంది. పేరు బంగారు కోడిపెట్ట అంటూ ఘనంగా పెట్టినా దీనిలో ట్విస్ట్‌లు పార్టిసిపెంట్స్‌ని ముప్పుతిప్పలు పెట్టి ఒకరికే ప్రైజ్ మనీ వచ్చేలా చేస్తుంది. పాతిక లక్షలు గెలుచుకోవచ్చని భారీ నజరానా ఆశచూపినా అంత వచ్చే సీన్ అరుదనే చెప్పాలి.

ఇక టెలివిజన్ గేమ్ షోల ప్రత్యేక జాఢ్యం రూల్స్ ప్రకారం సెలబ్రిటీలతోనే ఎపిసోడ్‌లను నడిపించడం జరుగుతున్న ఈ తరుణంలో బంగారు కోడిపెట్ట తొలి ఎపిసోడ్ కూడా ఏమీ తీసిపోలేదు. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టు నలుగురు పార్టిసిపెంట్స్‌లో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు ఇద్దరు సాధారణ పార్టిసిపెంట్స్ కనిపించడం కొసమెరుపు. రాబోయే ఎపిసోడ్స్‌లో సాధారణ పార్టిసిపెంట్సగా ఎందరు వచ్చి ప్రేక్షకులను అలరిస్తారో వేచి చూడాలి.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment