Monday, May 30, 2011

శతాబ్ది రైళ్లలో టెలివిజన్

శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు వాల్యూ యాడెడ్ సర్వీపుల కింద ప్రయాణికులకు టిలిజన్ సదుపాయం కలిగించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది.

ఇప్పటికే ఒక శతాబ్ది రైలులోప్రయోగాత్మంగా అమలు చేయగా, దానికి మంచి స్పందన ప్రయాణికులలో కనిపించడంతో ముందుగా అరడజను శతాబ్ది రైళ్లలో టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్జిక్యూటివ్ క్లాస్ లో, ఎసి ఛైర్ కార్ లలో ప్రతి సీటు వెనుక పది అంగుళాల సైజు ఉన్న ఎల్ సిడి టివి అమర్చుతారు. వార్తా ఛానళ్లు, క్రీడల ఛానళ్లు అందుబాటులో ఉండే విదంగా సర్వీస్ ప్రొవైడర్ల కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు సంవత్సరానికి పదమూడు నుంచి పద్దెనిమిది లక్షల వ్యయం అవుతుందని అంచనా, అయితే టివీ సర్వీస్ స్కీమ్ ద్వారా సంవత్సరానికి ఒక సీటు ద్వారా ఇరవై ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతానికి అమృతసర్, కల్క, లక్నో, భోపాల్, అజ్మీర్, డెహ్రాడూన్ లకు వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఈ టివీ స్కీమ్ ను అమలు చేయబోతున్నారు. 

Source: kommineni.info

వన్నె తగ్గిన ఐపిఎల్‌

  • పడిపోయిన టివి రేటింగ్‌
  • మితిమీరిన షెడ్యూల్‌ ఆటగాళ్ల అలసట
అంతర్జాతీయ క్రికెట్‌ స్టార్‌ ఆటగాళ్ళు, బాలీవుడ్‌ గ్లామర్‌ కలగలసి అభిమానులకు కనువిందు చేస్తూ భారత మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ 2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) టి20 ఫార్మాట్‌కు ఈ సంవత్సరం వన్నె తగ్గింది. టివి రేటింగ్స్‌ గత సంవత్సరం కంటే దారుణంగా పడిపోయాయి. ప్రపంచకప్‌ ముగిసిన ఆరు రోజులకే ఈ టోర్నమెంట్‌ ప్రారంభం కావడం కూడా దీనికి కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మితి మీరిన షెడ్యూల్‌ వల్ల అటు క్రికెటర్లకు, ఇటు అభిమానులకు ఆసక్తి తగ్గినట్లయిందని చెపుతున్నారు. లీగ్‌ మ్యాచ్‌లతో కలిపి, ఈ టోర్నీలో శనివారం నాడు జరగనున్న ఫైనల్‌తో మొత్తం 74 మ్యాచ్‌లు అవుతాయి. ఐపిఎల్‌ బ్రాండ్‌ విలువ గత సంవత్సరం కంటే 11 శాతం తగ్గిందని ఇటీవల దీనిపై అధ్యయం నిర్వహించిన బ్రిటన్‌ కన్సల్టెన్సీ బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ పేర్కొంది. గత సంవత్సరం ఐపిఎల్‌ బ్రాండ్‌ విలువ 413 కోట్ల డాలర్లు కాగా ఈ సంవత్సరం 367 కోట్ల డాలర్లు మాత్రమే. టోర్నీలో మొదటి 26 మ్యాచ్‌లకు టివి వీక్షకుల సంఖ్య 22 శాతం తగ్గిందని టిఎఎం మీడియా పరిశోధనలో వెల్లడైంది. ఏప్రిల్‌ 2న భారత్‌ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. వెంటనే ఐపిఎల్‌ టోర్నీ ప్రారంభం కావడంతో టివి రేటింగ్‌ పడిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచకప్‌లో రాణించిన యువరాజ్‌సింగ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఐపిఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అలసటే కారణమని అంటున్నారు. ఈ రేటింగ్స్‌పై అధికారికంగా ఎలాంటి వివరణలు వెలువడకపోయినా చాలా స్టేడియాల్లో టికెట్లు పూర్తిగా అమ్ముడవడం లేదని తెలుస్తోంది. మ్యాచ్‌ల సందర్భంగా ప్రేక్షకులు లేక స్టేడియాలు వెల వెల బోతున్నాయి. ఈ సంవత్సరం టోర్నీలో రెండు కొత్త జట్లను తీసుకోవడంతో మ్యాచ్‌లు పెరగడం కూడా అనాసక్తికి కారణమని తెలుస్తోంది. 'క్రికెట్‌ షెడ్యూల్‌ మితిమీరింది.' అని ముంబయికి చెందిన కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బంటి సాజ్ధే వ్యాఖ్యానించారు.

Source: www.prajasakti.com

సాక్షి టివి సిఇఓగా మురళి

సాక్షి టెలివిజన్ ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా వి.మురళిని తాత్కాలికంగా నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం ఇంతకుముదు ఉన్న సి.ఇ.ఓ. రామ్ రెడ్డికి సాక్షి యాజమాన్యం ఉద్వాసన చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిఇఓగా అదనపు బాధ్యతలు నిర్వహించవలసిందిగా మురళిని యాజమాన్యం కోరింది. ప్రస్తుతం సాక్షి దినపత్రిక సంపాదకుడిగా ఉన్న మురళి ఇకపై టీవీకి అదనపు బాధ్యతలు చేపడతారని సాక్షి వర్గాలు చెప్పాయి. కొత్తగా సిఇఓ కోసం యాజమాన్యం అన్వేషిస్తోందని, ఈలోగా పర్యవేక్షణ నిమిత్తం మురళికి బాధ్యత ఇచ్చారని అంటున్నారు. మురళి ఈనాడు దినపత్రికలో తన కేరీర్ ను ఆరంభించారు. ఆ తర్వాత ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ దినపత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. సాక్షి పత్రికలో చేరడానికి ముందు ఆయన ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత సాక్షి దినపత్రిక ఎడిటర్ గా వెళ్లారు. పేజీ మేకప్ లో, శీర్షికలు పెట్టడంలో ఆయనకు మంచి పేరుంది. ఈయన నల్లొండ జిల్లాకు చెందిన మురళి తండ్రి బుచ్చిరాములు వామపక్ష నాయకుడిగా గుర్తింపు పొందారు. 

Source: kommineni.info

Monday, May 23, 2011

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి


  • కరుణానిధి సిఎంగా కూతురు కనిమొళికి కలైనార్‌ టివి
  • వైఎస్సార్‌ సిఎంగా కుమారుడు జగన్‌కి సాక్షి పత్రిక, టివి
  • నిధుల సేకరణలో ప్రేరణ ఒక్కటే
  • అక్కడ కమ్యూనికేషన్‌ శాఖలో అక్రమ కేటాయింపుల ద్వారా కలైనార్‌కు కాసుల పోగు
  • ఇక్కడ గనులు, భూముల పందేరంతో సాక్షికి నిధుల వరద
  • ప్రత్యర్థుల్ని దెబ్బతియ్యడమే లక్ష్యంగా సొంత మీడియా ఏర్పాటు
  • తమిళనాడులో ఫార్ములా వికటించి జైలు పాలైన కనిమొళి
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ప్రాంతీయ పార్టీలకు సొంత మీడియా సంస్థల ఆపేక్ష పెరిగింది. ఇదే వారి పతనానికి కారణమౌతోంది. అక్కడ కలైనార్‌, జయ టివిలు, ఇక్కడ సాక్షి టివి, పత్రికలు ఇలా ఏర్పాటైనవే. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుమార్తె కనిమొళి పేరిట కలైనార్‌ టివిని ప్రారంభించారు. వైఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే కుమారుడు జగన్‌ పేరిట సాక్షి పత్రిక, టివిలను మొదలెట్టారు. నిధుల సేకరణలో ఈ రెండింటికీ సారూప్యత ఉంది. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలోని విలువైన గనులు, ప్రకృతి వనరులు, భూముల్ని ఆయాచితంగా పొందడం ద్వారా లగడపాటి రాజ్‌గోపాల్‌, మేట్రిక్స్‌ ప్రసాద్‌, ఇందు గ్రూప్‌ ప్రతినిధులు సాక్షి మీడియాలోకి నిధులు భారీగా సమకూర్చారు.

కేంద్ర స్థాయిలో డిఎంకె పార్టీకి చెందిన రాజా మంత్రిగా ఉన్న కమ్యూనికేషన్‌ శాఖలో అక్రమ కేటాయింపులు జరిపి స్వాన్‌, అడాగ్‌, ఎయిర్‌సెల్‌, యునినార్‌ వంటి సంస్థల ద్వారా దొడ్డిదారిలో కలైనార్‌ టివికి నిధుల్ని పోగేశారు. అన్ని అంశాల్లోనూ ఈ రెండింటికీ పోలికలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ రెండింటిపై కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా కలైనార్‌ టివి నిధుల విషయంలో కరుణానిధి కుమార్తె కనిమొళి జైలుపాలయ్యారు.

అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అక్రమాలకు పదవులు పోయాక ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తోంది. అక్కడ ముఖ్యమంత్రి కూతురు, ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకుల పేరిట ఏర్పాటైన మీడియా సంస్థలకు వందలు, వేలకోట్లు సమకూరిన విషయం దేశంలో చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఇలాంటి సంస్కృతి మరెక్కడా లేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాపై కక్ష సాధింపు చర్యగా సొంతంగా పేపర్లు, చానల్స్‌ పెట్టి తమ ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు వివరణలిస్తున్నారు. ప్రతిపక్షాల్ని దుమ్మెత్తిపోస్తున్నారు. జయలలితతో సరిసమాన స్థాయిలో తన కూతురు కనిమొళిని తమిళరాజకీయ వేత్తగా తీర్చిదిద్దాలన్న కరుణానిధి ఆకాంక్షలన్నీ కుప్పకూలిపోయాయి. కలైనార్‌ టివిలోకి అక్రమ నిధుల వరద విషయాన్ని సిబిఐ పసిగట్టింది. విచారణలో ఆధారాల్ని సేకరించింది. కేంద్రస్థాయిలో కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలేవీ ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడ్డంలేదు. అవి మీడియాను మీడియాగానే చూస్తున్నాయి. తమ విధానాల్తో మీడియాను ఆకర్షిస్తున్నాయి. తమ సిద్ధాంతాలకనుగుణంగా ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాయి. తమపై వచ్చిన ఆరోపణలకు కూడా మీడియా ద్వారానే బదులిస్తున్నాయి. రాజ్యాంగంలో మీడియాకు పొందుపర్చిన ప్రతిపత్తిని కాలరాచేందుకు ప్రయత్నాలు చేయడంలేదు. మీడియా గౌరవాన్ని, హోదాను కొనసాగించేందుకు సహకరిస్తున్నాయి.

Source: www.andhraprabhaonline.com

Ram To Get Out Of Sakshi?

If rumours in the media circles are to be believed, viewers of Sakshi television channel will soon be missing the baritone voice of CEO “Priyadarshini” Ram Reddy, popularly called “Ram Annayya.”

According to these rumours that emanated from Sakshi media house, Ram, whose name has become synonymous with Sakshi, is terribly upset with the way Kadapa MP Y S Jaganmohan Reddy has been treating him of late. 

Though Ram has gave his own business activities and dedicated himself completely to Sakshi, Jagan has not been giving him due importance and treating him only as an employee. Of late, Jagan shouted at him in humiliating tone that hurt Ram very much.

Sources said Ram reportedly told his friends in Sakshi that he was planning to call it quits. 

“I had joined Sakshi only because of Y S Rajasekhara Reddy, who used to show a lot of affection for me. He never treated me like any employee, but as a family member. But Jagan is an out and out businessman and he does not believe in human relations,” Ram is learnt to have commented.

The reason is that Jagan did not want Ram to get highlighted too much in Sakshi. As per sources, Jagan does not want anybody, except him, to hog the limelight. That is the reason why people like Rajasekhar or Raja or Roja could not feel comfortable with Jagan!

Source: www.greatandhra.com

కేబుల్‌ టీవీ వ్యవస్థను చిన్నతరహా పరిశ్రమగా గుర్తించాలి: ఎంఎస్‌వోలు

ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న కేబుల్‌ టీవీ వ్యవస్థను చిన్నతరహా పరిశ్రమగా గుర్తించాలని ఇంటర్‌ రీజినల్‌ కేబుల్‌ టీవీ ఎంఎస్‌వోలు కులదీప్‌ సహాని, భాస్కర్‌ ప్రభుత్వాన్ని కోరారు. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన కేబుల్‌ టీవీ వంటి ప్రతిష్ఠాత్మక మాధ్యమానికి కనీస రక్షణ, ప్రోత్సాహం, గుర్తింపు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. డీటీహెచ్‌ సర్వీసులు, పే ఛానళ్లు, పెరుగుతున్న నిర్వహణ వ్యయం.. వంటి సమస్యలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం ఆదుకొనేందుకు ప్రయత్నించడం లేదన్నారు. కేబుల్‌ పరిశ్రమను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని, విద్యుత్తు స్తంభాలను ఉచితంగా వినియోగించుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని, వినోద పన్ను ఎత్తివేయాలని, ఎంఎస్‌వోలు, కేబుల్‌ఆపరేటర్లకు గుర్తింపుకార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Source: www.eenadu.net

టాలెంట్ ఉన్న యువ హీరో కౌశిక్

''సునిశితమైన భావాలు వెండితెరపై పలికించడానికి కళ్ళు, పెదవులు ప్రధానం. కౌశిక్ లో అవి రెండూ వున్నాయి. దానికి తోడు తీరైన పర్సనాలిటీని ఇటీవలి కాలంలో పెంపొందించుకుని సిసలైన హీరోగా తయారయ్యాడు'' అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ''టాలెంట్ వుండే సినీ నేపథ్యం లేని వాళ్ళకు హీరోగా ఇప్పటి పోటీ వాతావరణంలో ఛాన్స్ వుందా అనే ప్రశ్నకు జవాబు కౌశిక్. ఇలాంటి కుర్రాళ్ళు చాలామంది ఇండస్ట్రీలోకి రావాలి'' అని కౌశిక్ ని ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన వైబ్ సైట్ ని ప్రారంభిస్తూ ఆయన అన్నారు. ''రియల్ టాలెంట్ వున్నవారు గతంలో విజయం సాధించారు. ఆ కళ్ళు, ఆ పెదవులు పౌరాణిక చిత్రాలకు, పాత్రలకు చక్కగా సరిపోతాయి అనుకుంటే ఇప్పుడు డెవలప్ అయిన కారణంగా సాంఘిక చిత్రాలకూ హీరోగా ధీటుగా సరిపోతాడు. స్వర్ణయుగంలో రూపొందించిన అన్నపూర్ణావారి చిత్రాలు, శాంతినివాసం వంటి సినిమాల్లాంటివి ఇప్పుడు తీయాలంటే సరైన హీరోలులేని రోజులివి. అలాంటి చిత్రాలకు కూడా హీరోగా కౌశిక్ చక్కగా సూట్ అవుతాడు. రియల్ టాలెంట్ వున్నవారిని సరైన దిశలో ప్రమోట్ చేయగలిగితేనే సక్సెస్ లభిస్తుంది. కౌశిక్ విషయంలో అదే జరిగింది. మలయాళంలో అయ్యప్పస్వామిగా పాపులర్ అయిన కౌశిక్ అక్కడే హీరోగా ద్విపాత్రాభినయం చేసే అవకాశం వస్తే చేయడం, తర్వాత 'జగద్గురు ఆది శంకరాచార్య'లో నటించడం... ఇలా మంచి రూట్లో వెడుతున్నారు. తండ్రి విజయబాబు నుంచి క్రమశిక్షణ, పట్టుదల అలవరచుకున్న కౌశిక్ నిర్మాతల హీరోగా రాణిస్తాడని రాణించాలని హీరోగా తొలి నాలుగు చిత్రాల వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తే కౌశిక్ కి తిరుగుండదని, టాలెంట్ వున్న కొత్తవాళ్ళలో, సినిమాలు చేసే నాలాంటి వాళ్ళకు సరైన హీరో ఇతడే'' అని ఆశీర్వదించారు దాసరి. బాలనటుడు కౌశిక్ చిత్రరంగ ప్రవేశం, టీవీ రంగంలో ప్రవేశం తన ప్రమేయం లేకుండానే జరిగిందన్నారు కౌశిక్ తండ్రి విజయబాబు. ఇటీవల మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ అవార్డ్ లభిస్తే అది బాలనటుడుగా వచ్చిందేమోనని అనుకున్నానని, మోస్ట్ పాపులర్ యాక్టర్ గా ఇచ్చారని తెలిసి ఆనందించానని ఆయన అన్నారు. చదువు దెబ్బతినకూడదనే ఆలోచనతో సినిమాలకు తాత్కాలికంగా చెక్ పెడదామని అనుకుంటే మలయాళంలో అయ్యప్పస్వామి సీరియల్ అనేసరికి అంగీకరిస్తే అది మూడు సంవత్సరాలు ప్రసారరమై అక్కడ వారికి అభిమాన పాత్రుడయ్యాడు అన్నారు. సినీరంగంలో నిలదొక్కుకునేందుకు గాడ్ ఫాదర్స్ గానీ, నిలబెట్టే ఆర్థిక స్థోమత గాని లేదనే విషయం తన మాటల ద్వారా గుర్తించి స్వయంకృషితో డాన్స్లులు, ఫైట్లు అన్నిటిలో తర్ఫీదు పొంది స్టామినా సాధించాడని'' విజయబాబు చెప్పారు. జగద్గురు ఆదిశంకరాచార్యకి దర్శకత్వం వహిస్తున్న భారవి మాట్లాడుతూ- ''కేరళలో కౌశిక్ ని కుట్టి ఎన్టీఆర్ అని ప్రేమగా అభిమానంగా పిలుస్తారని, పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్ స్థాయికి కౌశిక్ ఎదగాలని, అతనిలోని క్రమశిఓణ, డివోషన్ అందుకు బాగా ఉపకరిస్తాయని అన్నారు. నిర్మాత నారా జయశ్రీ, తమ్మరెడ్డి భరద్వాజ కౌశిక్ నటన క్రమశిఓణ తదితర అంశాల గురించి ప్రసంగించారు.

Source: www.manyaseema.com

త్వరలో ఏర్పాటు కానున్న టీవీ సెన్సార్ బోర్డ్

ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ చానెళ్లను మరింతగా పర్యవేక్షించడానికి త్వరలో సెన్సార్ బోర్డ్ ఏర్పాటు కానుంది. ఈ మధ్య కాలంలో అనేక చానెళ్లలో వస్తున్న రియాలిటీ షో లు వివాదాస్పదం కావడం, అధికంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి టీవీ చానెళ్ల మధ్య పెరుగుతున్న పోటీని పర్యవేక్షించడానికి సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది.

హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ ప్రవేశించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తరువాత అసభ్యత ను ప్రోత్సహిస్తున్న రియాలిటీషో లపై సెన్సారింగ్ ఉండాలనే డిమాండ్ అధికంగా వుంది. ఈ విధమైన అనేక షో లను గమనించిన తరువాతే ప్రత్యేకంగా ఒక బోర్డు ఆవశ్యకతను గుర్తించారు.

ఈ కమిటీలో అన్ని చానెళ్ల ప్రతినిధులకు అవకాశం కల్పించి, వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఒకసారి బోర్డు ఏర్పాటు జరిగిన తరువాత ఆ సూచనలను అతిక్రమించకుండా పాటించాల్సిన బాధ్యత చానెళ్లదే.   

Source: www.tollywoodsite.com

ఢిల్లీ ఈటీవీ విలేకరిపై దాడి

న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: తెలంగాణపాత్రికేయుల వేదిక దేశ రాజధానిలో చేపట్టిన ధర్నాకు వచ్చిన కొందరు వ్యక్తులు ఈటీవీ ఢిల్లీ ప్రతినిధి బి.ఎల్‌.ఎస్‌.వి.ప్రసాద్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. గురువారం ఇక్కడి పార్లమెంటు వీధిలో ధర్నాను ప్రసాద్‌ కవర్‌ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సాయిలు అనే వ్యక్తి వచ్చి.. ధర్నాకు కేవలం రెండు వందల మందే వచ్చారని ఎన్‌టీవీలో ఎలా ఇస్తారని ఈటీవీ ప్రతినిధిని ప్రశ్నించారు. తాను ఈటీవీ రిపోర్టర్‌నని ప్రసాద్‌ చెబుతూ.. పక్కనే ఉన్న ఎన్‌టీవీ రిపోర్టర్‌ను చూపి అతన్ని అడగండి అని సూచించారు. సదరు వ్యక్తి ఏ రిపోర్టర్‌ అయితేనేం, ఏ ఛానల్‌ అయితేనేం అని గట్టిగా అరుస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నంచేశారు. చుట్టూ 30, 40 మంది వ్యక్తులు గుమికూడారు. ఆ గుంపులో నుంచే ఓ వ్యక్తి ముందుకొచ్చి తెలంగాణ గురించి నువ్వేందో అంటున్నావంటూ గట్టిగా అరుస్తూ చేయి చేసుకొన్నాడు. అక్కడే ఉన్న కొందరు పాత్రికేయులు వచ్చి సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రసాద్‌ను కోరారు. ప్రసాద్‌ ఈటీవీ వ్యాన్‌ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి కేకలు వేసుకుంటూ తరిమే ప్రయత్నం చేశారు. వ్యాన్‌ ఎక్కి వెళ్తుండగా దాన్ని చుట్టుముట్టి అద్దాలపై బాదుతూ అడ్డుకున్నారు. ఇంతలో ధర్నా కార్యక్రమానికి నేతృత్వం వహించిన క్రాంతి, పి.వి.శ్రీనివాస్‌ అనే పాత్రికేయులు అక్కడికొచ్చి సర్దిచెప్పి, ప్రసాద్‌ను వ్యాన్‌ ఎక్కించి వెళ్లాలని కోరారు. ఈ ఘటనను తెలంగాణ పాత్రికేయుల వేదిక అధ్యక్షుడు అల్లం నారాయణ దృష్టికి పాత్రికేయులు తీసుకెళ్లినప్పుడు ఆయన విచారం వ్యక్తంచేశారు. దాడికి పాల్పడిన వారిని విచారించి, మళ్లీ మాట్లాడతానని బాధిత పాత్రికేయుడు ప్రసాద్‌కు హామీ ఇచ్చారు. ఈ ఘటన పట్ల తెరాస ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ెకేటీఆర్‌లు విచారం వ్యక్తంచేశారు.

Source: www.eenadu.net

మీడియాపై మంత్రి తోట ధ్వజం

రాష్ట్ర మంత్రి తోట నరసింహం ఎన్నడూ లేని విధంగా మీడియాపై ధ్వజమెత్తారు. ఆయన పిఠాపురంలో శనివారం రాజీవ్ వర్థంతి సందర్భంగా ఈ చర్యకు పాల్పడ్డారు. విలేఖరులతో మాట్లాడుతూ తాను ఇటీవలి పరిణామాలతో పేపరు చదవడం మానేశానని, టీవీ ఛానళ్ళు కూడా చూడటం లేదని చెప్పారు. దీంతో స్థానిక నేతలు ఆశ్చర్యపోతుండగా ఆయన మాట్లాడుతూ ఓ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ లోగోనూ చూస్తూ ఆయన ఆవేశంతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. సదరు ఛానల్ వారు ఎసి రూముల్లో కూర్చుని, ఏవేవో సృష్టించి వార్తలు ప్రసారం చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల మంత్రిని సదరు ఛానల్ గోడమీద పిల్లి వాటంగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ మంత్రి ఈ విధంగా ఆగ్రహించినట్టు స్థానిక కార్యకర్తలు చెవులు కొరుక్కున్నారు. ఆ సమయంలోనే మరో పత్రిక విలేఖరి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో కోవర్టుల పాత్రను ప్రస్తావించగా తాను పూర్తిగా పేపర్లు చదవటం మానేశానని, ఇది ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

 

Source: www.andhrabhoomi.net

ఎస్వీ భక్తి ఛానల్ నిధుల దుర్వినియోగం

తిరుమల తిరుపతి దేవస్థానముల (టిటిడి) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో(ఎస్వీబీసీ) అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్ధతో (సిబిఐ) విచారణకు ఆదేశించాల్సిందిగా శ్రీవైష్ణవ బ్రాహ్మణ సమాజ సంఘ సేవా సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుబట్టింది. 

సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలాచార్యులు గురువారమిక్కడి విలేకరులతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి కార్యక్రమాల రూపకల్పనలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ""ఛానల్‌కు కార్యక్రమాలు రూపొందిస్తున్నామనే ముసుగులో కొందరు అగ్ర నిర్మాతలు వారికి చెందిన ప్రెవై[ట్‌ స్టూడియోల్లో చిత్రీకరణకు అనుమతిస్తూ పెద్ద మొత్తాల్లో బిల్లులు సమర్పిస్తున్నారు. కార్యక్రమాల చిత్రీకరణకు ఇప్పటి దాకా సరిగ్గా ఉపయోగపడని ఒక ప్రెవై[ట్‌ స్టూడియోకు సైతం ఛానల్‌ నెలకు రూ.మూడు లక్షలు చెల్లిస్తోంది'' అని ఆయన ఆరోపించారు.

ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి తిరుపతికి తరలించేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని గోపాలాచార్యులు పేర్కొన్నారు. 

"అర్చన' సీరియల్‌ రూపకల్పన కోసం ఎస్వీబీసీ ఛానల్‌ అలిపిరి గేట్‌ దగ్గర రూ.రెండు కోట్ల విలువైన షూటింగ్‌ సెట్‌ను నిర్మించింది. కానీ పెదజీయర్‌ స్వామీ అభ్యంతరం చెప్పటంతో ఆ సీరియల్‌ ఛానల్‌లో ప్రసారం కాలేదు. స్వామీ అభ్యంతరాన్ని అనుసరించి "అర్చన' సీరియల్‌ ఒక ప్రైవేట్‌ ఛానల్‌లో ప్రసారమవుతోందని ఆయన ఆరోపించారు.

ఛానల్‌లో జరుగుతున్న అవకతవకలపై త్వరలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డికి తాము ఒక వినతి పత్రం సమర్పిస్తామని గోపాలాచార్యులు తెలిపారు. ఛానల్‌ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తిరుపతి వద్ద ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని గోపాలాచార్యులు బెదిరించారు.

Source: www.apweekly.com

Friday, May 20, 2011

Nagam To Launch A News Channel?

Senior Telugu Desam Party leader Nagam Janardhan Reddy, who has been at loggerheads with the party leadership on Telangana issue, is said to be toying with the idea of launching a news channel. 

The rebel Telangana leader is understood to be keen on taking “Raj TV” on lease and convert it into a full-fledged channel for promoting Telangana statehood cause.

Earlier, the Telangana Rashtra Samithi had an arrangement with Raj TV before starting its own channel “T News” which has gained popularity within a short span of time. The Telangana channel has registered significant growth compared to its competitors in the market and garnered a significant TRP rating.

With leading politicians owning news channels and using them as platforms for promoting their image, Nagam, who has been projecting himself as the sole champion of Telangana cause in the TDP, is keen to join the bandwagon. 

Sources say that he has made preliminary inquiries with Raj TV regarding the lease charges and also the cost of running a news channel. Already, the YSR Congress Party President Y S Jagan Mohan Reddy owns “Sakshi” channel while TDP President N Chandrababu Naidu’s son Nara Lokesh runs “Studio N” channel.

There is also a speculation in political circles that Nagam may walk out of the TDP and float his own party to carry forward the Telangana agitation. He has openly defied the party leadership and organized “Telangana Nagaara” in his home town Nagarkurnool in Mahaboobnagar district recently without displaying the TDP’s flag.

Source: www.greatandhra.com

Thursday, May 19, 2011

రొటీన్ కాన్సెప్ట్

రియాలిటీ షోల హవా చిన్న తెరకు ప్రధాన ముడి సరుకైన సీరియల్స్‌ని పక్కకు పెట్టేస్తుందేమోనన్న ఆలోచన వస్తున్న సమయంలో కొత్త సీరియల్స్ ప్రారంభించడంతో జీ తెలుగు ఛానెల్ మళ్లీ ఆ దిశగా వీక్షకుణ్ణి ఆసక్తిగా చూసేలా చేసింది. ఆ క్రమంలో జీ తెలుగు టీవీలో మే 9 నుంచి రాత్రి 9 గంటలకు ‘కన్యాదానం’ ధారావాహిక ప్రారంభమైంది.


అలవాటైన పంథా
పెళ్లికెదిగిన అమ్మాయిలు, పెళ్లి చేయడానికి వారి తల్లిదండ్రులు పడే తపన, కట్నాలు రాబట్టుకోవాలని అబ్బాయిల తరఫు వారు చూపించే ఆత్రం.. మొదలైన వాటిలో ఎన్ని చెప్పుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. ఆ కోణం ఆసరా చేసుకుని తయారైన కథగా తొలి భాగాల్లో కన్యాదానం కన్పడింది. దీనికి తోడు పెళ్లి కావలసిన అమ్మాయి ‘రంగు’ తక్కువ అంశం కూడా ప్రధానంగా ఉంది ఇందులో. పెళ్లి కావల్సిన అమ్మాయి అర్చన నల్లగా ఉంటుంది. ఆ కారణంగా ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి. ఆమె తల్లిదండ్రులు జమీందారు వంశీకులైనా ఆస్తి కోర్టు తగాదాల్లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. అయినా డాంబికానికి లోటు లేకుండా అందిన చోట్లంతా అప్పులు చేస్తూ పైకి పరువు నిలుపుకుంటూంటారు. రంగు తక్కువైనా పెళ్లికి ఓకే అంటూ అందుకు ప్రతిగా భారీ మొత్తం కట్నంగా అడుగుతుంది అబ్బాయి తల్లి. ఆ డబ్బు సర్దుబాటు చేయలేక సతమతమవుతూంటే, ఈ పెళ్లి కుదిర్చిన పెళ్లిళ్ల పేరమ్మ రమాదేవి, మీ అబ్బాయికి పెళ్లి చేసి ఆ కట్నంలో అమ్మాయి పెళ్లి చేసేయండని సమయోచిత సలహా వదిలేస్తుంది. అది తప్ప మరో దారిలేక ఆ పనికీ ఉపక్రమిస్తారు అమ్మాయి కుటుంబం వారు. అయితే ఇక్కడో మెలికుంది. నల్లగా వుండే అర్చన, వాళ్లన్నయ్య కూడా వేర్వేరుగా ప్రేమలో పడతారు. కానీ ఈ సంగతి అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వెల్లడి చేయలేక పోతారు. ఇప్పటివరకూ స్థూలంగా జరిగిన కథ ఇది.

కాలదోషం పట్టిన కాన్సెప్ట్..
అసలు ఈ ధారావాహికకెన్నుకున్న మూల బిందువే అంతగా అందరూ ఒప్పుకునేది కాదు. ‘నలుపు కన్నయ్యకు అందం - నాకు శాపమా?’ అన్నది అప్పుడెప్పుడో అరవై దశకాల్లో ‘నాదీ ఆడజన్మ’ చిత్రం నాటి సంగతి. అప్పుడే నలుపులో ఉన్న నాణ్యతను ఫోకస్ చేస్తూ చెప్పుకొచ్చేవారు. రానురాను అసలు నలుపుపై చిన్న చూపు ఉండటం లేదు కూడా. పైగా ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ మంచి విశేషణాలు కూడా జోడించే ఆరాధనా భావం కూడా పెరిగింది. మరి ఇలాంటి సందర్భాలలో ‘నలుపు’ పెద్ద అవరోధంగా కథాక్రమం సాగడం అసమంజసంగా ఉంది. ఇంక అర్చన - మురళి మధ్య అనురాగం పెరుగుతూంటే దాన్ని వ్యక్తపరచుకోడానికి పడిన సంకోచంలోనూ సమంజసత కన్పడలేదు. అలాగే రాజా (అర్చన సోదరుడు) మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు వెల్లడి చేయకపోవడానికి కనపర్చిన కారణం (కట్నం రాకపోతే తన చెల్లెలి పెళ్లి కాదు) కొనసాగింపునకూ కేవలం కథలో పెట్టుకున్న ట్విస్టే మూలం అనుకోవాలి తప్ప మరే సమర్థనీయ కారణమూ కన్పడటం లేదు. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే ‘ఇదిలా సరికాదు’ అని మనమిప్పుడేవైతే చెప్పుకున్నామో అని అన్నీ ఆయా పాత్రధారుల పక్క పాత్రల ద్వారా చెప్పించడం జరిగినా రైట్ ట్రాక్‌లోకి కథ రానివ్వలేదు. అలా వస్తే కథ నడవడం ఎలా అంటారా? అది వేరే సంగతి. అదే విధంగా లేని జమీందారీతనం కోసం లేనిపోని గొప్పలు పోవడం, అందుకుగానూ తలకు మించిన అప్పులు చేయడమూ లాంటివి కూడా ఇప్పటి కాలంలో అంతగా పొసగని సంగతులు.

మరీ అంత దట్టింపు అవసరమా?
ఇందులో సంభాషణా రచయిత చాలా పెద్ద పాత్ర వహించారు. చాలా చోట్ల సందేశాత్మక సంభాషణలూ, ఉదాహరణ పూర్వక మాటలూ దట్టిం చేశారు. ‘వంద అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయమనడం అప్పటి ట్రెండు. వంద నిజాలు చెప్పి ఒప్పించి పెళ్లి చేయడం ఇప్పటి ట్రెండు’. ‘ఆడపిల్ల ఎంత అందం తక్కువగా ఉంటే అంత ఎక్కువ కట్నం పిండచ్చు’ ‘నిన్ను మర్చిపోవడమంటే, నన్ను నేను మర్చిపోవడమే’ ‘ఆ పాట అలసిపోయిన గుండెలను నిద్రపుచ్చేదిలా ఉంటుంది’ ‘మనసులోని ప్రేమ దాచుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్లంటే నాకిష్టం లేదు..’ ఇంత స్థాయి దట్టింపులు అవసరం లేదు. ఇవే భావాలు చిన్నచిన్న మాటలతో పలికించవచ్చు. కొన్నిచోట్ల ఉపయోగించిన (మనుషులకి తప్ప మనసులకి పేదా గొప్పా తేడా తెలియదేమో! ‘మనిషిలో నిరాశ పెరిగినప్పుడు ప్రతి చిన్న విషయం సమస్యగానే ఉంటుంది’ లాంటివి) వాక్యాలు అర్థవంతంగా, సన్నివేశానికి పుష్టినిచ్చేవిగానూ ఉన్నాయి. బంగారానికీ, రాగికీ తేడా తెలుపుతూ రమాదేవితో పలికించిన పదాలూ బాగున్నాయి. అన్ని సీరియల్స్‌లోలా ఇందులో టైటిల్ సాంగ్ అంటూ పెట్టక, మధ్యలో మురళి (సీరియల్‌లో గాయకుని పాత్ర - అర్చన ప్రేమికుడు) పాత్రపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ‘ఓ ప్రియతమా..’ అంటూ పాట పెట్టడం, అది కూడా పెద్ద ఇబ్బందేమీ పెట్టనిదిగా ఉండటం అభినందనీయం.

మేకప్స్‌లో శ్రద్ధ వహించాలి..
మేకప్‌ని ఎంత తక్కువగా చేస్తే అంత సహజంగా ఉంటుంది. దాన్ని లైటింగ్ పరంగా, ఇతరేతర విధానాల ద్వారా సహజంగా చెయ్యచ్చు. కానీ ఇందులో పద్మజా రాణి కారీతి దట్టమైన మేకప్పు అవసరం లేదనిపించింది. .కనీసం రమాదేవి పాత్రకు వేసిన పెదాల రంగు విషయంలోనూ నిర్లక్ష్యం వహించడం వల్ల అది తెరపై వీక్షకులు చూడడానికి ఇబ్బంది పెట్టేసింది.

Source: www.andhrabhoomi.net

Wednesday, May 18, 2011

Zee Telugu celebrates 6th anniversary

As the caption suggests 'Sarikotta Velugu', a Telugu phrase that conveys the meaning 'New Light'. Zee Telugu has always stood by it. Zee Telugu, the channel created with a vision to provide wholesome entertainment to the entire family, has become a very popular channel amongst all age groups today. The programs range from fiction, devotional, music, dance, comedy, to reality shows and blockbuster movies.

 Zee Telugu is the first southern regional channel from Zee bouquet. In just few years of its inception it soared high on popularity charts by breaking the barriers of a stereo typical Fiction Television. It gave a new path with its creative ideas, constant innovation and a feel for popular taste thereby bringing radical changes in viewership patterns. Zee Telugu has been a head turner by bringing in innovative ideas and concepts like 'Reality' in regional entertainment. Being a strong contender for No.2 in Telugu GEC, Zee Telugu is striving to consolidate its position. There are over 15 million patrons to Zee Telugu across the globe.

This glorious journey has some beautiful and cherishable moments with shows like Sa Re Ga Ma Pa - a singing sensation, Aata - the ultimate dance show are exceptional properties, which broke the records with five back to back seasons. Loved by all and enjoyed by many has made these programs the channel driver for Zee Telugu. These shows have showcased the immense talent hidden in aspiring and upcoming singers and dancers from the state of Andhra Pradesh, who have now become youth icons in the industry.

Besides, catering to all cross sections of society today Zee Telugu has successfully completed above 2000 episodes in its shows like Mee Inti Vanta and Bhakti Samacharam which have been leading in its respective genres.

The channel has also done exceptionally good by bringing in a change with shows like Ayurvedam, Gopuram and a funfilled ladies entertaining game show Gadasai Atta Sogasari Kodalu that has made women all over Andhra Pradesh play, enjoy, and laugh.

With the stupendous success in the non - fiction segment, Zee Telugu has expanded its feature programming lineup into fiction segment with interesting Soaps and Serials. Serials like Chinna Kodalu and Muddubidda have been the milestone lunches as a step forward to strengthen our fiction bands. Post which, came-in serials like Pasupu Kumkuma, Radha Kalyanam with new look and feel that have strengthened the fiction band and have been giving good competition to other shows in the same band.

Our recent launches Kanyadanam and Kalavari Kodalu have been the prime talk of the town.

Zee Telugu's fiction has stood by the concept of family entertainment, with the right balance of emotion, comedy and drama that makes it a wholesome entertainment.

Zee Telugu reserves the right to entertain its audience with many good and well-presented blockbuster movies. Keeping up the glory of blockbuster films this year we have been able to bank in films like Mirapakaya, Alamodaliyindi, Nagavalli by adding this to the existing bank of a great range of Telugu films, especially blockbusters, from recent successes to all-time hits. All in all, Zee Telugu has become a wholesome entertainment package for its viewers.

Today we take the pride of putting forward the journey of our six years and dedicate it to all our viewers who have played a vital role in this successful journey.

Source: www.afaqs.com

త్వరలో 'మెగా' ఛానల్

Source: telugu.greatandhra.com

Tuesday, May 17, 2011

మెగా డికేడ్‌ టీవీ అవార్డుల ప్రదానం 18న

బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌గా ‘ఈటీవీ’ 

 

2001 నుంచి పదేళ్ల కాలానికి మెగా డికేడ్‌ టీవీ అవార్డులను మెగా సిటీ నవకళావేదిక 14వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేయనుంది. అవార్డుల ప్రదానోత్సవాన్ని మే 18న సాయంత్రం త్యాగరాయ గానసభ సదనంలో జరుపుతున్నట్లు అవార్డుల కమిటీ అధ్యక్షుడు డా.వడ్డేపల్లి కృష్ణ, నిర్వాహణ సంస్థ అధ్యక్షుడు కె.మల్లికార్జునరావు సోమవారం త్యాగరాయ గానసభ భవనంలో విలేకరులకు తెలిపారు. మెగా డికేడ్‌ టీవీ అవార్డుకు బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌గా ఈ-టీవీ, బెస్ట్‌ న్యూస్‌ ఛానల్‌గా ఎన్‌ టీవీలను ఎంపిక చేసినట్లు వారు వివరించారు. ఉత్తమ నిర్మాతగా నాగబాల సురేష్‌కుమార్‌, దర్శకుడిగా శ్రీధర్‌, నటుడుగా ప్రభాకర్‌, నటిగా ప్రీతి నిగమ్‌, క్యారెక్టర్‌ యాక్టర్‌గా జీవీ నారాయణరావు, క్యారెక్టర్‌ యాక్ట్రెస్‌గా సనా, హాస్యనటుడుగా అశోక్‌కుమార్‌, హాస్యనటిగా రాగిణి ఎంపికయ్యారని వెల్లడించారు. సాయికుమార్‌ ఉత్తమ యాంకర్‌, స్వప్న ఫిమేల్‌ న్యూస్‌రీడర్‌, బద్రి మేల్‌ న్యూస్‌రీడర్‌, నేతాజీ న్యూస్‌ కో-ఆర్డీనేటర్‌, ఎ.శ్రీనివాస్‌ కథా రచయిత, నాగరాజు సంగీత దర్శకుడు, నిత్యసంతోషిని గాయని, బంటి గాయకుడుగా అవార్డులు అందుకుంటారన్నారు. ముఖ్య అతిథిగా స్త్రీ శిషు సంక్షేమ శాఖామంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సభాధ్యక్షుడుగా సమాచార శాఖ కమిషనర్‌ పార్థసారధి హాజరవుతారన్నారు. మొదట మువ్వ ఆంధ్ర నాట్యం ప్రదర్శిస్తారన్నారు. గానసభ అధ్యక్షుడు కళాదీక్షితులు, నిర్వాహణ సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రాఘవేంద్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
 
Source: www.vasantam.net

వీక్షకుల తీర్పు

ఏ ఛానెల్ చూసినా డాన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాయి. కొన్నింటిలో మరీ విపరీతమైన కొనసాగింపు.  ‘ఢీ’తో మొదలైన కార్యక్రమం ‘ఢీ2’ నుండి ‘ఢీ4’ వరకూ కొనసాగుతూ ఉంది. మరి చివరి నెంబర్ ఎంతో తెలీదు. ఇక ఒక ఛానెల్‌లో నిర్వహించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించరాదని, అది చిన్నపిల్లల మానసిక ఆనందానికి ఇబ్బంది కలిగిస్తున్నదని, వారి హక్కుల పరిరక్షణకు భంగకరమని.. ఇంకొన్ని కారణాల మూలంగా కొద్ది రోజులపాటు ఆ కార్యక్రమం నిర్వహించరాదని మానవ హక్కుల సంఘం వారి నుంచి తాఖీదులు కూడా అందాయి. కాని తరువాతి పరిణామాల వల్ల సదరు కార్యక్రమం ఈ రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. ఒక ఛానెల్‌లో మొదలైన ఇలాంటి కార్యక్రమం అంటుజాఢ్యంలా ప్రతి ఛానెల్‌కూ వ్యాపించింది. కొన్నింటిలోనయితే జుగుప్సాకరంగా డాన్స్‌లు చేయడం కూడా జరుగుతోంది.

వీటికి భిన్నంగా ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమవుతోన్న ‘భగవద్గీత’ శ్లోకాల పోటీ కార్యక్రమంలో న్యాయనిర్ణేత, పార్టిసిపెంట్స్, యాంకర్స్ కూడా సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి ఉంటారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి చిన్నారి వారి స్తోమతకు తగ్గట్టుగా పట్టు పరికిణీలు లేదా మిగతా సంప్రదాయబద్ధమైన వస్త్రాలు ధరించి ఉంటారు. న్యాయనిర్ణేత వచ్చిన ప్రతి చిన్నారినీ ఫలానా శ్లోకం చెప్పమని అడగటమూ, చెప్పిన తరువాత సదరు శ్లోకానికి అర్థం అడగటం లాంటివన్నీ చూస్తూంటే ఆ పిల్లలకూ న్యాయనిర్ణేతకు శ్లోకాలపై, భగవద్గీతపై గల పట్టును సూచిస్తుంది. యాంకర్ కూడా ఇందులో భాగం వహించడంతో కార్యక్రమానికి మరింత శోభ వచ్చినట్లుగా కనిపిస్తుంది. పైన అనుకున్న ఏ డాన్స్ కార్యక్రమాన్ని చూసినా న్యాయనిర్ణేత, పార్టిసిపెంట్స్, యాంకర్స్‌తో మొదలుకొని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేసే ఉద్దేశంతో విజిల్స్ (ఆడ మగ తేడాల్లేకుండా) వేదిక మీద వేయడం, మార్కులు చెప్పమంటే ‘నీ పాట అదుర్స్’ అంటూ తెలుగులో లేని పదాలను వాడి భాషను ఖూనీ చేయడం లేదా చేత్తో పేపర్‌ని పట్టుకుని చించివేయడం లాంటివి చేస్తూ కనిపిస్తారు. కాని ఇక్కడ అలాంటివేవీ కనిపించవు. వినిపించవు. ప్రతి మాటలోనూ సభ్యత, సంస్కారమూ కనిపిస్తాయి. ఈ రోజున ఏ పిల్లాడికీ, తెలుగులో సక్రమంగా (ఆంగ్ల పదాన్ని వాడకుండా) పది నిమిషాలు కూడా మాట్లాడలేని స్థితిలో ఉండి ఇంటి ముందరకు వచ్చిన బిచ్చగాడితో (అడుక్కునే అంకుల్ వచ్చాడని ఇంటిలోని వారికి చెప్పడం) మొదలుకొని ప్రతి వాడినీ అంకుల్ అని పిలవడంతో మొదలయ్యే దనచర్యలో ఎక్కడా కూడా శ్లోకాలు, పద్యాలు లాంటివి కనిపించవు. వినిపించవు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వారు ఏకంగా శ్లోకం, దాని అర్థం కూడా చెప్పగలిగేలా వారడిగిన మరో శ్లోకాన్ని చెప్పగలిగేలా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో వాటిని కొనసాగించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటే మంచిది.

ఇక దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ‘అమ్మ’ కార్యక్రమంలో తల్లిని గురించి కొంతమంది పంపే కవితలను చదివి వాటిని విశ్లేస్తుంటారు. ఈ రోజున తల్లిదండ్రులను గౌరవించాలన్న స్పృహే లేకుండా, ప్రేమ పేరుతో తల్లిదండ్రుల మనసులను బాధలకు గురిచేస్తూ ఉంటూ ఆ విధమైన శాడిజానికి మోడల్‌గా ఉంటున్న ఈ రోజుల్లో తల్లిని గురించి కవితలు చెప్పడం, రాయడం, తల్లికి ఒక గొప్ప గౌరవం.
 
Source: www.andhrabhoomi.net

ఆరు వసంతాల జీ తెలుగు సంబరాలు

జీ తెలుగు నేటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకుని తెలుగులో ప్రధాన వినోదభరిత ఛానెల్‌గా నిలిచింది. ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, మ్యూజిక్, మూవీస్ ఇలా అన్ని విభాగాల్లో ఛానెల్స్‌ని నిర్వహిస్తూ వినోదమే ఊపిరిగా, వైవిధ్యమే ఆయువుగా జీ తెలుగు కొనసాగుతోంది. ప్రతిభా అన్వేషణలో భాగంగా సింగింగ్ టాలెంట్ షోస్‌కి కొత్తదనాన్ని జోడించి జీ తెలుగు ఆవిష్కరించిన సరాగాల స్వరఝరి ‘సరిగమప’.. డాన్స్ అంటే ఆట, ఆట అంటే డాన్స్ అన్న రీతిలో ‘ఆట’ ది అల్టిమేట్ డాన్స్ షో.. తెలుగులో ప్రారంభమైన తొలి కుకరీ షో ‘మీ ఇంటి వంట’ ఇప్పటికి 2000 పైగా ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుని మున్ముందుకు సాగుతోంది. ప్రేక్షకులకు ఆధ్యాత్మిక భావాన్ని అందించాలన్న ఆలోచనతో పుట్టిన ‘భక్తి సమాచారం’... సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమం ఇప్పటికి దాదాపు వంద కుటుంబాలను కలిపింది. జీ తెలుగు అందిస్తున్న ఆయుర్వేద జీవన విజ్ఞానం, గోపురం, గడసరి అత్త - సొగసరి కోడలు కార్యక్రమాలు మహిళా ప్రేక్షకుల మన్ననలతో సాగుతున్నాయి. ఇక సీరియళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. రాధికా మాధవుల ప్రణయగాథ ‘చిన్నకోడలు’.. చిట్టితల్లి సావిత్రి హృదయ వేదన ‘పసుపు కుంకుమ’.. చిన్నారి రాధతో విధి చెలగాటం ‘రాధా కల్యాణం’... - ఇలా ఎన్నో సీరియళ్లతోనూ కార్యక్రమాలతోనూ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది జీ తెలుగు.

Source: www.andhrabhoomi.net

Wednesday, May 11, 2011

T ఛానల్ TRSదా? తెలంగాణదా?

తెలంగాణ కోసమే పుట్టిందని పదే పదే చెప్పుకుంటున్న టీ ఛానల్ లో తెలంగాణ అంటే కేసీఆర్ తప్పించి మిగిలిన తెలంగాణ వాదులు కానీ.. నాయకులు కానీ పెద్దగా కనిపించరు.. అక్కడ కేసీఆర్ కుటుంబ రాజ్యం  నడుస్తుందనేది  బహిరంగ సత్యం. తెలంగాణ ఉద్యమం ఎవరు చేసినా..  ఎక్కడ చేసినా దానిని ప్రత్యేకంగా కవర్ చేయాల్సిన బాధ్యత టీ ఛానల్ పై ఉంది.  ఎందుకంటే అది తెలంగాణ వాదుల అందించే పైసల మీద నడుస్తుంది కాబట్టి.. కానీ నాగం జనార్థన్ రెడ్డి పాలమూరు జిల్లాలో భారీ ఎత్తున నగరా నిర్వహిస్తే… దానిని లైవ్ కవరేజ్  మాత్రం టీ ఛానల్ లో కనిపించదు.. అందులో కనిపించేది..చంద్రబాబుకు వ్యతిరేకంగా  వచ్చేది మాత్రమే..లేదంటే తెలుగుదేశం పార్టీని చీల్చడానికో.. టీఆర్ ఎస్ పార్టీని పొగడానికో తప్పించి..తెలంగాణ కోసం మాత్రం కాదనేది నాగం నగరా సమయంలో టీ ఛానల్ వ్యవహరించిన తీరే అద్దం పడుతుంది. తెలంగాణ ప్రతినిధుల సభను గొప్పగా లైవ్ చేసిన  టీ ఛానల్… అదే జిల్లాలో నాగం పెద్ద ఎత్తున తెలంగాణ  నగరా మోగిస్తుంటే.. అది టీ ఛానల్ చెవికెక్కలేదు. నాగం మాట్లాడిన దానిలో తెలుగుదేశం ఎమ్మేల్యేలను చీల్చడానికో… తెలుగుదేశాన్ని చిత్తు చేయడానికో పనికొచ్చే వాటిని కట్ చేసుకుని ప్రసారం చేసుకున్న ఆ ఛానల్.. నాగం తెలంగాణ పోరాటాన్ని ఎందుకు లైవ్ చేయలేదు. తెలంగాణ కోసమే పుట్టామని చెబుతున్న ఈ ఛానల్ టీఆర్ ఎస్ స్వప్రయోజనాల కోసమే పుట్టిందనేది ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. చంద్రబాబును ఎదిరించి.. తెలంగాణ కోసం తెలుగుదేశంలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న నాగం ఎందుకు టీ ఛానల్ కు కనిపించలేదు. బాబు తెలంగాణ పై కక్కలేక .. మింగలేక పరిస్థితులను కల్పిస్తూ.. బాబును ముప్పుతిప్పలు పెడుతున్న..నాగం జనార్థన్ రెడ్డిని  టీ ఛానల్  ఎందుకు సపోర్ట్ చేయడం లేదు. ఎవరు  ఎన్ని ఛానళ్లైనా పెట్టుకోవచ్చు.. కానీ తప్పులేదు.. పార్టీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు.. తప్పులేదు.. కానీ తెలంగాణ నినాదం మారు మ్రోగేలా చేయాల్సిన బాధ్యత టీఆర్ ఎస్ పై ఉంది. ఎందుకంటే ఆ పార్టీ కట్టుకున్న ఇంద్ర భవనం.. అందులో పెట్టుకున్న ఛానల్.. అన్నీ.. తెలంగాణ వాదులు తమ సొంత జేబుల్లో నుంచి ఇచ్చిన పైసల్లోవే కానీ.. సొంత డబ్బులు కావన్న విషయం టీఆర్ ఎస్ అధినేత మరిచిపోతున్నారు. జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, గద్దర్ లాంటి వాళ్లు తెలంగాణ పై గర్జించిన సందర్భాలెన్నో.. వారు ఎన్ని సభలు.. ధూం..ధాంలు పెట్టినా టీ ఛానల్ లో ఇచ్చే ప్రాముఖ్యం తక్కువ.. ఎందుకంటే అక్కడ టీఆర్ ఎస్  జెండా లేదు కాబట్టి.. అయినా టీ ఛానల్ తెలంగాణ కోసమే పని చేస్తుందా..? టీఆర్ ఎస్ కోసమే పని చేస్తుందా..? లేదంటే కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే పని చేస్తుందా అనేది కూడా స్పష్టం కావాలి. ఎందుకంటే ఇఫ్పుడు అక్కడంతా కుటుంబ స్వామ్యమే నడుస్తోందనేది బహిరంగ సత్యం.  టీ ఛానల్ ను కేసీఆర్  కొడుకు రామరావు పర్యవేక్షిస్తున్నారు..కాబట్టే ఆయన కేవలం తన కుటుంబాన్ని హైలెట్ చేసుకుంటారు.. తప్పించి… మిగిలిన నాయకులను పట్టించుకోరు. వారికి కేసీఆర్ చేసే ఉద్యమమే కనిపిస్తుంది తప్పించి.. తెలంగాణ వాదులు.. నాయకులు చేసే ఉద్యమాలు.. త్యాగాలు కనిపించవు.. వారికి కావాల్సిందల్లా.. సొంత పార్టీకి  ఓ గొట్టం మైకు.. అదే టీ ఛానల్.. మీరు కాదంటారా..?

Source: telugushakthi.com

Tuesday, May 10, 2011

నారా లోకేష్‌కు చెక్, స్టూడియోఎన్‌ టీవీ చానెల్‌పై జూనియర్ ఎన్టీఆర్ కన్ను?

హైదరాబాద్: ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెత్తనంలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ త్వరలో హరికృష్ణ చేతిలోకి మారనుందా! అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛానల్ చంద్రబాబు తనయుడు లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయనే వాదనలు వినిపించిన సమయంలో కూడా స్టూడియో-ఎన్ ఛానల్లో బాబుకు అనుకూలంగా వార్తలు వచ్చాయి. విజయవాడ విభేదాల విషయంలో సైతం వల్లభనేని వంశీని తప్పు పడుతూ దేవినేని ఉమా మహేశ్వరరావును సమర్థించిన వార్తలు వచ్చాయి. అయితే లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న ఆ ఛానల్ త్వరలో జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది.

స్టూడియో-ఎన్ ఛానల్ నార్నె శ్రీనివాసరావుది. నార్నె కూతురు లక్ష్మీ ప్రణతిని ఇటీవలే జూ.ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబుతో ఎంత బాంధవ్యం ఉన్నప్పటికీ, ఎన్నేళ్ల అనుబంధం ఉన్నప్పటికీ నార్నెకు జూ.ఎన్టీఆర్ అల్లుడు అయినందున ఆయనకే ప్రాధాన్యత ఇస్తాడు. అయితే మరో ముఖ్య విషయం ఏమంటే జూ.ఎన్టీఆర్ నార్నె అల్లుడు కావడానికి ప్రముఖ పాత్ర వహించింది చంద్రబాబే. పెళ్లికి ప్రముఖ పాత్ర వహించిన బాబుకే ఇప్పుడు మామ - అల్లుళ్లు ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. అంటే ఇన్నాళ్లూ లోకేష్ కుమార్ చేతిలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ పగ్గాలను ఎన్టీఆర్‌కు అప్పగించే అవకాశం తప్పనిసరి. జూ.ఎన్టీఆర్ చేతిలోకి ఛానల్ రాగానే ఇప్పటికే చంద్రబాబును ఢీకొడుతున్న హరికృష్ణ బాబు ఇమేజ్ తగ్గించే అంశానికే ప్రాధాన్యత ఇస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో రాజకీయ సమీకరణాల కోసం బాలకృష్ణ కూతురును చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. బాలకృష్ణ కూతురును కోడలుగా చేసుకొని బాలకృష్ణను ఆధిపత్య పోరు నుండి తొలగించాడు. అసలే గొడవలు అంటే పడని బాలకృష్ణ ఇప్పుడు మరింత మిన్నకుండి పోయారు. రాజకీయ సమీకరణాల కోసం బాబు ఏ ప్లాన్ అయితే వేశాడో ఇప్పుడు హరికృష్ణ కూడా చంద్రబాబు నుండి ఆధిపత్యాన్ని నందమూరి కుటుంబం వైపుకు తీసుకు రావడానికి నార్నె ఇంటికి తన తనయుడిని అల్లుడిగా చేసి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నాడు. మొత్తానికి నందమూరి - నారా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను కలిచి వేస్తోంది.

Source: thatstelugu.oneindia.in

సొంత డబ్బా కొంత మానుకుంటే...

ప్రసిద్ధ నటుల పార్ట్‌టైమ్ వ్యాపకం టీవీ షోలకి వ్యాఖ్యాతలుగా ఉండడం కూడా అని మరోసారి ప్రముఖ గుణ చిత్రనటుడు (కేరెక్టర్ ఆర్టిస్టు) ప్రకాష్‌రాజ్ ‘ఇట్స్ మై షో’ (మాటీవీలో సోమ, మంగళ వారాల్లో రాత్రి 9 గంటలకు వస్తున్నది) ద్వారా విశదమైంది. తన ఇమేజ్‌కి తగ్గట్లే ప్రకాష్‌రాజ్ తన షోను చాకచక్యంగా నిర్వహించడానికే ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉన్న గంట సమయం మరింతగా సద్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదో వైవిధ్యం..
సాధారణంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకి పాల్గొనే అభ్యర్థి సమాధానం చెప్పడం జరుగుతుంది. వారు చెప్పలేకపోతే, షోలో ఉండే ముఖ్య అతిథులు సమాధానం చెప్పడం లేదా మరొక స్నేహితుని సహకారం తీసుకోవడం గతంలో అమితాబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకున్న ‘కౌన్ బనేగా..’ నుంచి చూస్తున్న విషయమే. కానీ ఇందులో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు షోలో అభ్యర్థులెంచుకున్న ముఖ్య అతిథుల్లోని ఒకరు సమాధానాలిస్తారు. దానిని క్యాండిడేట్స్ ఒప్పుకోవడమో లేదా తప్పులో చెప్పాలి. రైటైన సమాధానం చెప్పాలి. ఇది ట్రెండ్‌లో కొంత వెరైటీయే. అయితే దీన్లో అంతర్లీనంగా దాగి వున్న సంగతేమిటంటే ఒక ప్రశ్నకు సమాధానం మనకి కచ్చితంగా తెలిస్తేనే గానీ, సదరు ప్రముఖుడు చెప్పింది తప్పో, ఒప్పో తెలుస్తుంది. అంటే అడిగిన ప్రశ్నకి ఏదో గెస్సింగ్ విధానంలో కాక ప్రాథమిక అవగాహన వుంటే కానీ ముందుకు వెళ్లలేం. ఆ రకంగా పాల్గొనబోయే అభ్యర్థులు కొంత కసరత్తు ముందుగా చేయాల్సి ఉంటుంది.

సినిమాల ప్రశ్నలకే మొగ్గా?
సరే.. ప్రశ్నలంటే అన్ని విభాగాలకు చెందిన ప్రశ్నలుండాలన్న ఆకాంక్ష జనరల్ వీక్షకులకున్నా, సినిమాకు చెందిన ప్రశ్నలే అధికంగా ఇప్పుడొచ్చే టీవీ షోల్లో వున్నట్లే ఇందులోనూ ఉన్నాయి. ‘కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించిన చిత్రం పేరు’ ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’ చిత్ర నిర్మాత ఎవరు?’ ‘మణిరత్నం దర్శకత్వంలో తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం?’ ఇలా ఇలా ఈ కోవలో సాగుతుంది. అయితే ఇందులోనూ కాస్త వెసులుబాటు కావాలంటూ పాల్గొన్న ఓ అభ్యర్థిని అడగడం గమనార్హం. అదెలాగంటే ‘జగదీకవీరుడు - అతిలోక వీరుడు’ చిత్ర నిర్మాత పేరు చెప్పమని కార్యక్రమ నిర్వాహకుడు ప్రకాష్‌రాజ్ అడిగితే - ‘అదేమిటండీ అందులో హీరో హీరోయిన్ల పేరు చెప్పమంటే ఓకే గానీ అలా నిర్మాత పేరడిగితే ఎలా?’ అంటూ క్యాండిడేట్ అడిగారు. దీన్నిబట్టి ప్రశ్నలకు ఎలాంటి ఫోకస్‌ను ఆశిస్తున్నారో తెలుస్తోంది. కానీ విషయ విస్తరణకు అన్ని కోణాలూ స్పృశించడం అవసరమని షో గుర్తించడం అభినందనీయం.

ఒక సెలబ్రిటీకే డిమాండా?
సెలబ్రిటీ (ప్రముఖ వ్యక్తి (ముఖ్య అతిథి)లను నిర్ణయించుకోడం తదితరాలు షో నిర్వాహకులు అప్పటి సమయంలో వారి అందుబాటుతనం వగైరాలపై ఆధారపడినా రప్పించే ఇద్దరూ ప్రజాకర్షణలో దగ్గర దగ్గరగా వుండే వారినే ఎంచుకుంటే బావుంటుంది. ఉదాహరణకు మే 2,3 తేదీల్లో ఇలా అభ్యర్థులను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి వారెంచుకునే అతిథులుగా దర్శకుడు శేఖర్ కమ్ముల, మరో రంగంలో నిష్ణాతుడైన ఇంకో వ్యక్తినీ ప్రవేశపెట్టారు. ఇలాంటి సందర్భాలలో పాల్గొనే కేండిడేట్స్ అందరూ సహజంగా శేఖర్ కమ్ములనే తమకు సమాధానాలు చెప్పే అతిథిగా ఎంచుకుంటారు. ఇందులోనూ అదే జరిగింది. ఈ డిమాండు చూసే ప్రకాష్‌రాజ్ ‘శేఖర్‌కి చాలా డిమాండుంది’ అంటూ ఓ చమత్కార వ్యాఖ్య చేశారు. వాస్తవానికి శేఖర్‌తోపాటు పాల్గొన్న మరో వ్యక్తీ సినీ రంగంలో కాకపోయినా వారు కృషి చేసిన సంబంధిత రంగంలో ఎన్నతగిన ప్రమాణాలు అందుకున్నవారే. కానీ సినీ రంగం పట్ల ఉన్న గ్లామర్ వల్ల ఇది సంభవించింది.

అనుభవాల వివరణా ఓకె!
ఏ కార్యక్రమానికైనా ఇలా సెలబ్రిటీల్ని తీసుకురావడం, ప్రముఖుల్ని వ్యాఖ్యతలుగా వ్యవహరింపజేయడంలో ఆంతర్యం స్థూలంగా ఒకటే. అది వారికుండే అపార అనుభవంలో ఎదుర్కొన్న ఆణిముత్యాల్లాంటి సంఘటనల సారాన్ని తెలియజేస్తారనే. అదే పరంపరనీ ఇందులో శేఖర్ కమ్ముల, ప్రకాష్‌రాజ్ కొనసాగించారు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ తాను కాలేజీలో చదువుతున్నప్పుడు తాను లేందే నాటకం జరగదన్న అభిప్రాయంతో ఉంటే, అది తప్పు, ఈ ప్రపంచంలో ఎవరున్నా ఎవరు లేకున్నా జరిగేవి, జరుగుతూనే ఉంటాయి అని తెలియపర్చిన వారి లెక్చరర్ ఉదంతాన్ని చెప్పారు. దీనివల్ల ‘మనమే అందరికన్నా అధికులం..’ అన్న భావం వుండకూడదన్న సంగతి తెలుపుతోంది.

ఇవి అవసరమా?
ఇక తప్పనిసరిగా పరిహరించాల్సిన అంశాలు ఇందులో కొన్ని ఉన్నాయి. ప్రకాష్‌రాజ్ ఇప్పటికే తెలుగు, తమిళ తదితర భాషా చిత్రాల ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు. అలాంటి నటుడ్ని ప్రత్యేకంగా, ఇదీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొన్న అభ్యర్థి, అభ్యర్థినుల ద్వారా ప్రశంసింపజేయడం (ఆస్కార్‌కి ఆస్కారమున్న వ్యక్తివి నీవు అంటూ ఒకరు, మరొకరు ప్రకాష్‌రాజ్ నటించిన చిత్రాల కూర్పుతో పొగడ్తల జల్లు కురిపించారు) ఎంతవరకూ అవసరం? కనక ఇలాంటివి తప్పక పరిహరింపజేయాలి. అలాగే ఇంకో అభ్యర్థి, ప్రకాష్‌రాజ్ ద్వారా బహుమానం అందుకుంటూ ఇలా నేనో ప్రొడ్యూసర్ ద్వారా (ప్రకాష్‌రాజ్ తెలుగులో ఇటీవల నాగార్జున నాయకుడిగా వచ్చిన ‘గగనం’ తమిళ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు) అందుకోవడం ఆనందంగా ఉందంటాడు. ఇవన్నీ కార్యక్రమ నిర్దేశిత లక్ష్యానికి సంబంధించినవి కావు. ప్రశ్నల విభాగాల విస్తరణతోనూ, అనవసరపు అంశాల ప్రస్తావన తగ్గించడం ద్వారానూ ‘ఇట్స్ మై షో’ను అందరి షోగానూ మార్చవచ్చు.

Source: www.andhrabhoomi.net

జీటీవీలో వినోద ప్రభంజనం

ఒకేరోజు ముచ్చటగా మూడు సరికొత్త కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది జీ తెలుగు. మే 9 సా-6.30 గంటలకు ప్రసారమైన ‘కలవారి కోడళ్లు’ మెగా సీరియల్‌లో - అత్తగారి దర్పానికి దర్పణంగా, అహంకారాన్ని అలంకారంగా చేసుకున్న కోటీశ్వరురాలైన జగదీశ్వరికి అణకువ కలిగి అణిగిమణిగి ఉండే కోడలు తన కనుసన్నలలో నిలవాలన్న కోరిక. అందుకు తగ్గట్టే తన కొడుకు శ్రీరామ్‌కి ఓ మధ్యతరగతిలో పుట్టిన రేఖతో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. అయితే, రేఖకి తలపొగరు అని గ్రహించి ఆమె సోదరి, అమాయకురాలైన లేఖని కోడలుగా తెచ్చుకుంటుంది. మొదట్లో జగదీశ్వరి దర్పాన్ని చూసి ఏవగించుకున్న రేఖ ఆ తర్వాత లేఖని చూసి అసూయ పడుతుంది. తల్లిదండ్రులతో కలిసి లేఖ అన్యాయం చేసిందని భావిస్తుంది. ఆ జమీందారీ కుటుంబానికి తనూ కోడలుగా వెళ్లాలని ఎత్తులు వేస్తుంది. రేఖ పథకాల్లో ఆమె సోదరి లేఖ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? జగదీశ్వరీ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంది? అన్నది ప్రధాన కథాంశం.

రా.9.00 గంటలకు ‘కన్యాదానం’ మరో మెగా సీరియల్ కథాంశం. మగువ జీవితంలో మధురమైన స్మృతిగా మిగిలిపోయే కన్యాదానానికి పురాణకాలం నుంచే ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. ఆడపిల్ల కలిగిన తల్లిదండ్రులు ఆ కన్యాదాన ఘట్టం కోసం, అపూర్వమైన ఆ ఘడియల కోసం ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తూంటారు. తమ కూతురిని లక్ష్మీదేవిగా, కాబోయే అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెని అతడికి అప్పగించే మహోన్నతమైన ఘట్టం ‘కన్యాదానం’.
 
ఇక - రా.9.30 సోమ, మంగళ వారాల్లో టాలెంట్‌తో ప్రేక్షకులను మైమరపింపచేయడానికి ‘అద్భుతం మల్టీ టాలెంట్ రియాలిటీ షో’. హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు చిరపరిచితులైన యాక్షన్ హీరో భానుచందర్ ‘అద్భుతం’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. జీ తెలుగు ‘ఆట’ కార్యక్రమంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన శ్రీవిద్య ఈ కార్యక్రమంతో మరోసారి మెంటర్‌గా ముందుకు రాబోతోంది.

Source: www.andhrabhoomi.net

తానా అంటే ఎన్టీవీకి పడదా.?

తానా మీద ఎన్టీవీ దాడి ప్రారంభించింది. తానా కులసంఘమంటూ..ప్రచారం మొదలెట్టింది. ఇందులో నిజమెంత..? అబద్ధమెంత..? అనేది పక్కన పెడితే.. అసలు  ఎన్టీవీ ఎందుకు ఈ కథనం ప్రసారం చేసింది…? ఎందుకు తానాపై ఇంతగా కక్ష కట్టింది..? ఇదంతా పక్కా పథకంతో చేసిందా….? ఇలాంటి అనుమానాలు కచ్చితంగా వస్తాయి. ప్రవాసాంధ్రులు కులాలుగా విడిపోతున్నారని చెప్పుకొచ్చిన  ఎన్టీవీ కథనం వెనుక ఉన్న అసలు సత్యలేమిటి..? ఎందుకు అది తానాను  టార్గెట్ చేసింది అంటే దీని వెనుక సవాలక్ష కారణాలున్నాయంటున్నారు తానా సభ్యులు.. అందులో ప్రధానమైనవి కొన్నింటిని తెలుగుశక్తి మీ ముందుకు తెస్తోంది.
 

ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణకు ఆహ్వానం

ఎన్టీవీ నరేంద్రనాథ్ చౌదరికి , ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో ఎన్టీవీ, ఎబీఎన్ ఒక ఛానల్ పై మరొక ఛానల్ దుమ్మెత్తి పోసుకున్న సంగతి జనాలు ఇప్పటికి మరిచిపోలేదు.. ప్రస్తుతం తానా రాథాక్రిష్ణను తానా సమావేశాలకు ఆహ్వనించింది. మరీ తన శత్రువు  రాధాక్రిష్ణను తానా సభలకు ఆహ్వనించి.. అతిధి మర్యాదలు చేయాలనుకోవడం.. సహాజంగానే ఎన్టీవీ యాజమాన్యానికి నచ్చని పరిణామం.. అలాంటప్పుడు డైరక్ట్ గా తానాను దెబ్బకొడితే.. తానాలోని చిన్న చిన్న మనస్పర్థలను వినియోగించుకుని తానాకు ఉన్న క్రెడిబిలిటిని దెబ్బ తీస్తే… శత్రువును, శత్రువుకు స్వాగతం పలుకుతున్న తానాకు షాక్ ఇచ్చినట్టు అవుతుందని ఎన్టీవీ భావించి ఉండొచ్చని తానా సభ్యులు విశ్లేషిస్తున్నారు.
 
టీవీ9కు ప్రాధాన్యం ఇస్తారా..?
తానాకు టీవీ9 తో సత్సంబంధాలు ఉన్నాయి. టీవీ 9 యూఎస్ లో దూసుకుపోతుంది. తానా..టీవీ9 కలిసి థింతానా అనే కార్యక్రమం చేస్తోంది. టీవీ9 ప్రత్యేకంగా అక్కడ ఛానల్ పెట్టి… ఎన్ ఆర్ ఐ వార్తలు కవర్ చేస్తుంది.   అయితే ఇక్కడ నెగిటివ్, కాంట్రావర్షల్ వార్తలు ఎక్కువగా ప్రసారం చేసే టీవీ9 .. అమెరికాలో  ఎన్ ఆర్ ఐ లను ఏకం చేసే దిశగా కథనాలు అందిస్తోంది. ఏచిన్న వార్తనయినా కవర్ చేస్తుంది. టీవీ9 రవిప్రకాష్ ను తానా సభలకు గెస్ట్ గా పిలిచింది. ఇది కూడా ఎన్టీవీ యాజమాన్యానికి చిర్రెత్తుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో టీవీ9 కు ఎన్టీవీకి మధ్య కూడా పోటీ ఉంది. ఎన్టీవీని యూఎస్ లో పెద్దగా చూసే వారు తక్కువ..  అయితే అమెరికాలో ఎన్టీవీకి పాపులారిటి రావాలంటే…నెగిటివ్ వార్తలు ఇస్తే వస్తుందని భావించి.. తానా మీద నెగిటివ్ ప్రచారం చేస్తుందని తానా ఫ్యాన్స్ అంటున్నారు.
 

తానా ఎన్ని కులాలను పిలిచిందో తెలుసా..?

తానా కేవలం కమ్మ కులానికే చెందిదనేది ప్రచారం చేసి… తానాను దెబ్బతీయాలనే వ్యూహాంతోనే ఈ కథనం అల్లినట్టు..ఆ కథనాన్ని చూసిన వారెవరికైనా అర్థమవుతోంది. తానా గురించే ఎక్కువ సమయం కేటాయించిన ఎన్టీవీ.. తానా ఓ కులానికి ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు చూపించింది. తానాకు ప్రతియేటా వచ్చే విశిష్ట అతిథుల్లో కేవలం కమ్మ కులం వాళ్లే క్యూ కట్టడం లేదనేది ఎందుకు విస్మరిస్తోంది. తానా అనేది అమెరికాలోనే అతి పెద్ద సంఘం దీనిని దెబ్బ తీసి.. అన్ని కులాలను ఏకం చేస్తూ సాగుతున్న దాని ప్రస్థానాన్ని అడ్డుకోవాలనే దుగ్థతో ఎన్టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసినట్టు ఉంది. ఈసారి తానా సమావేశాలకు వచ్చే గ్రంధి మల్లికార్జునరావు.. జీఎమ్ ఆర్ వ్యవస్థాపకుడు కమ్మవాళ్లా..? పల్లం రాజు ది ఏ కులమో.. ఎన్టీవీ ఎందుకు చూడలేదు.. కే విశ్వనాథ్  ఏ కులమో తెలియదా..? ఇదంతా కేవలం తానా  ఎన్టీవీ యాజమాన్యాన్ని సభలకు ప్రత్యేకంగా ఆహ్వనించలేదనే కసితో చేస్తున్నదే తప్ప మిగతాది కాదని తానాకు అభిమానులు అంటున్నారు.
 

తానాకు పార్టీలు ఉన్నాయా..?

తానా తెలుగుదేశంకు కొమ్ము కాస్తుందని ఎన్టీవీ కథనాన్ని వడ్డి వార్చింది. తానా సభ్యులందరూ కలిసి తెలుగుదేశానికే ఓటు వేయాలంటే.. ఇండియాలో వినేవాళ్లు ఉంటారా..?  అసలు  ఎన్టీవీ ఎవరికి కొమ్ము కాస్తుందో.. ఎవరికి భాజా కొడుతోందో.. జనానికి తెలియదనుకోవటం ఆ ఛానల్ పిచ్చి భ్రమ అంటున్నారు..తెలుగు సంఘాల ప్రతినిధులు..తానాలో సభ్యులు కావచ్చు. ఆటాలో సభ్యులు కావచ్చు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అంత మాత్రాన ప్రవాసాంధ్రులకు కులపిచ్చి ఉన్నట్టు చూపించడం ..ఎంతవరకు సమంజసమని వాదించే వారు లేకపోలేదు. అసలు ఆటా అంటే పూర్తిగా రెడ్లదేనా..? తానా అంటే పూర్తిగా కమ్మవాళ్లదేనా..? మరీ అదే ఆటాలో.. తానాలో సామాన్య సభ్యులుగా చందాలు కట్టిన బ్రహ్మణులు,కాపులు, ఇతర  కులాల సంగతి ఏమిటి..? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు చురుకైనా పాత్ర పోషించవచ్చు. అంత మాత్రాన తెలుగు సంఘాలకు కులముద్రలు వేసి ప్రచారం చేయడం మాత్రం భావ్యం కాదనేది తెలుగు సంఘాలు అంటున్నాయి. తానా అసోషియేషన్ లో రెడ్లు ఉన్నారు. ఆటా అసోషియేషన్ లో కమ్మవాళ్లు ఉన్నారు. ఎవరికి వారు తమకు చేతనైన స్థాయిలో ప్రవాసాంధ్రులకు ఉపయోగపడుతున్నారు. కలిసి ఉంటున్న వారి మధ్య కూడా చిచ్చు పెట్టాలని చూడటం పద్దతి కాదనే వాదన వినిపిస్తోంది. ఎన్టీవీ తాను ప్రసారం చేసిన కథనంలో ఉత్తర అమెరికాలో మరో సంఘం రాబోతుంది.. తానాకు వ్యతిరేకంగా ఉన్నవారు.. అందులో కలుస్తారంటూ.. తన మనసులోని దురుద్దేశాన్ని బయటపెట్టింది. అంటే దాని లక్ష్యం తానాను చీల్చటం.. తెలుగు సంఘాలను చిన్నాభిన్నం చేయడం.. ఇదేనా  తెలుగువారి ఛానల్ చేసే ఘనకార్యం… తానా చేసిన సేవా కార్యక్రమాలను ఎందుకు ఎన్టీవీకి ఎందుకు కనిపించలేదో.. వారి సేవా కార్యక్రమాల గురించి అసలు ఎందుకు ప్రస్తావించలేదు.. అమెరికాలో తెలుగు సంఘాలన్నీ..కులాల వారీగా విడిపోతున్నాయని ఎన్టీవీ కథనం తెలుగువారి సమైక్యతను దెబ్బతీసేలా కథనం ప్రసారం చేసింది.  తెలుగువారి ఐక్యతకు పాటు పడాల్సిన తెలుగుమీడియానే తెలుగు సంఘాలను దెబ్బతీసేలా కులబురద పూయడం ఎంతమాత్రం సహేతుకం కాదని తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి.
 
Source: telugushakthi.com

Thursday, May 5, 2011

తమిళంలో ఎస్.వి.బి.సి ఛానల్

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ను (ఎస్.వి.బి.సి) తమిళంలో కూడా తీసుకురావాలని తిరుపతి,తిరుమల దేవస్థానం ప్రతిపాదిస్తోంది. త్వరలో ఈ తమిళ ఛానల్ ప్రారంభం అవుతుందని టిడిడి కార్యనిర్వహణాధికారి ఐ.వై.ఆర్.కృష్ణారవు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మాత్రమే నడుస్తున్న ఈ ఛానల్ ను తమిళంలో కూడా తీసుకు రావడం ద్వారా తమిళనాడుకు కూడా విస్తరించవచ్చని ఆయన అంటున్నారు. తమిళనాడు నుంచి ముప్పై ఐదు శాతం మంది భక్తులు వస్తుంటారని కూడా, దానిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విశేషాలను, ఆలయ కార్యక్రమాలను ఆంద్రప్రదేశ్, తమిళనాడులలో ప్రతి గ్రామానికి కూడా చేరాలన్నది తమ ఉద్దేశ్యం అని అన్నారు. తెలుగు ఎస్.వి.బి.సి ఛానల్ ఆరంభంలో, తర్వాత కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. అలాంటివేమీ లేకుండా ఈ ఛానల్ ప్రారంభమవుతుందని ఆశిద్దాం. 

Source: kommineni.info

Tuesday, May 3, 2011

డిష్ టీవిలో మా మూవీస్, మా మ్యూజిక్, మా జూనియర్ చానల్స్



ఛానల్ నెం.
904. మా మూవీస్
905. మా మ్యూజిక్ 
906. మా జూనియర్ 

Maa Movies, Maa Music, Maa Junior added in Dish Tv!!



These channels added On Dish Tv. channel no's

904. MAA MOVIES
905. MAA MUSIC
906. MAA JUNIOR

మా సీరియల్‌ బంగారం

బాలాజీ టెలిఫిలింస్‌ పతాకంపై జెమినీ టీవీలో ప్రతిరోజు ప్రసారం చేస్తున్న 'కొత్త బంగారం' సీరియల్‌ 300 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బాలాజీ టెలిఫిలిం సౌత్‌ హెడ్‌ సెమికర్ణ మాట్లాడుతూ... 'సన్‌ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జెమినీ టీవీ హెడ్‌ సంజరురెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సీరియల్‌ క్రియేటివ్‌ హెడ్‌ ఉప్పలపాటి నారాయణరావు సహకారంతో ఈ సీరియల్‌ను తీర్చిదిద్దాం. ఈ సీరియల్‌ విజయవంతమయింది. దానికి కారణం మంచి కథ, కథనం. నాణ్యత రీత్యా సీరియల్‌ను తీర్చిదిద్దాం. బాలీవుడ్‌లోనైనా టాలీవుడ్‌లోనైనా నేటివిటీ కొంచెం మార్పు రీత్యా కథలు ఒకేలా ఉంటాయి. మన దేశ సంప్రదాయాలు, మన సంస్కృతులు ప్రధానంగా స్టోరీ ఉండేట్టు చూసుకుంటాం. భాషలు వేరైనా జీవన విధానం ఒక్కటే. కాబట్టి సీరియల్‌ ఏ భాషలో తీసినా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముంది' అని చెప్పారు.


ఉప్పలపాటి నారాయణరావు మాట్లాడుతూ...'మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 300వ ఎపిసోడ్‌ వరకు కార్తీక్‌ దర్శకుడిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ దర్శకుడిగా చేస్తున్నాడు. మధుశ్రీ స్క్రీన్‌ప్లే సహకారం బాగుంది' అని అన్నారు. రచయిత మధుశ్రీ మాట్లాడుతూ...'180 ఎపిసోడ్స్‌ వరకు సంభాషణలు రాశాను. టెలిప్లేకు కూడా సహకరిస్తున్నాను. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు సీరియల్స్‌లలో చోటు సంపాదించటం ఆనందంగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు ప్రభాకర్‌, ప్రేమ తదితరులు మాట్లాడారు. 
Source: www.prajasakti.com

బ్రాండ్‌ని పెంచుకోవడానికే సరికొత్త ఛానళ్లు ....?!

ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్న ఛానెళ్లు వీక్షకులను ఎంత వరకు సక్సెస్‌గా చేరగలుగుతున్నాయనేది ప్రశే్న. చాలా ప్రాంతాల్లో కొన్ని ఛానళ్లు అసలు వున్నాయా? అనిపించే విధంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. వందకు పైబడి రిమోట్‌లో ఛానళ్లు ఫిట్ అవుతున్నా వీక్షకులు చూసేవి మాత్రం వేళ్ల మీదే ఉంటాయన్నది సత్యం. పురుషులు, పిల్లలు అయితే ఛానెళ్ల అనే్వషణతో రిమోట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే మహిళలయితే సింగిల్ డిజిట్‌తోనే ఛానళ్లు చూడటంతో సరిపెట్టుకుంటారు. ఎందుకంటే మహిళల్లో ఎక్కువ శాతం సీరియళ్లని ఫాలో అవుతూ ఉండటమే. అలాంటప్పుడు కొత్త ఛానళ్లు ఎన్ని పుట్టుకొచ్చినా అంత త్వరగా ఎట్రాక్ట్ కారు. అందుకే కొత్త ఛానళ్లు స్త్రీలను ఆకర్షించటానికి బంగారం, పట్టుచీరలు వంటి వారికిష్టమైన బహుమతులను ఎరవేసి వారివైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ స్ర్తిలు అంత త్వరగా ఛానల్ మార్పుని కోరుకోవడం జరగదు.

కొత్తగా పుట్టుకొచ్చే ఛానళ్లు పురుషులను, పిల్లలను ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది. అందుకే మూవీ ఛానెళ్లు, మ్యూజిక్ ఛానెళ్లు, చిల్డ్రన్ ఛానళ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. నేషనల్ ఛానళ్లు సైతం పిల్లల కోసం రీజినల్ లాంగ్వేజ్‌లో తమ ప్రసారాలను కొనసాగిస్తూ పిల్లలను ఆకర్షిస్తున్నాయి. ఈ పరంపరలో కార్టూన్ నెట్‌వర్క్, పోగో ముందున్నాయి. ఈ ఛానళ్లని వీక్షించడంలో పెద్దలు సైతం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే లేనిపోని ఛానల్ కథనాల బాధలను వొంటికి పూసుకునే కంటే మనసుకు హాయిగొలిపే కార్టూన్లు, మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయడం బెటరని ఎక్కువమంది భావించడం వల్ల తెలుగు ఛానళ్లు సైతం రెండు మూడు రకాల ప్రత్యేక ఛానళ్లని లాంచ్ చేస్తున్నాయి.

ఛానళ్లు అధికంగా పుట్టుకొచ్చినా తంటాయే. ఎందుకంటే ఒక కుటుంబంలో వారందరూ ఒకే సమయంలో వివిధ ఛానళ్లని చూడలేరు. అలాంటప్పుడు ఛానల్ ప్రసారాలు నిరుపయోగమే అవుతుంది. కాని ఒక ఛానల్ కుటుంబంలోని స్త్రీలకు, పిల్లలకు, పురుషులకు వివిధ రకాల ఛానళ్లు పెట్టడంవల్ల ఎవరు ఏది చూసినా ఆ ఛానల్ బ్రాండ్‌ని దాటిపోలేరు. కాబట్టి ఆ ఛానెల్‌కి రేటింగ్ కూడా టోటల్‌గా బావుంటుందనే భావన. అయితే క్వాలిటీ ప్రసారాలు ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. క్రమేపీ ఇంటిలో టీవీ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా రానున్నాయి. 

పేరు మోసిన, రేటింగ్ ఉన్న ఛానళ్లు సబ్ ఛానళ్లని పెట్టడం వల్ల ఆ ఛానెల్ ఖాతాలోకి వీక్షకులు చూసినా చూడకపోయినా కేబుల్ ఆపరేటర్ లెక్క ప్రకారం లెక్కలోకి వచ్చేస్తారు. రేటింగ్ ఛానళ్లు, ప్రముఖ ఛానళ్ల సబ్ ఛానళ్లని పెట్టినపుడు కేబుల్ ఆపరేటర్ వాటిని తప్పనిసరిగా ప్యాకేజ్ సిస్టమ్‌లో తీసుకోక తప్పదు. అలా ఒప్పుకోని పరిస్థితుల్లో మొదట పాపులర్ ఛానల్‌ని కోల్పోవలసి వస్తుంది. దీనివల్ల ప్రేక్షకుల వత్తిడి ఎదుర్కోక తప్పదు. ఛానళ్ల సంఖ్య ఎక్కువగా వున్నప్పుడు ఛానళ్ల వారు ప్రత్యేక నెట్‌వర్క్ ప్యాకేజీ ద్వారా కూడా వీక్షకులను ఎట్రాక్ట్ చేసుకోడానికి ఎక్కువగా వీలుంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీలో సన్‌నెట్ వర్క్ ఉండనే ఉంది.  

తెలుగు ఛానళ్ల విషయానికి వస్తే ఈటీవీ ఛానల్ ఈటీవీ-2ని కలిగి ఉంది. జీ తెలుగు జీ 24 గంటలనే వార్తా ఛానల్, జీ ఛానెల్‌కి నేషనల్ సబ్ ఛానళ్లు చాలానే ఉన్నాయి. ఎన్‌టీవీ ఏకంగా వనిత అంటూ ప్రత్యేకంగా స్త్రీల కోసం, భక్తి అంటూ భక్తుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పడం విశేషం. జెమిని వారు జెమినీ మూవీస్, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్, జెమిని అంటూ ఏకంగా నాలుగు ఛానళ్లతో హవా కొనసాగిస్తోంది. మాటీవీ ఈ మధ్యనే ‘మా’ మ్యూజిక్‌తోపాటు మా జూనియర్స్, మా మూవీస్‌ని ప్రారంభించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లకి ఏ మాత్రం తీసిపోని విధంగా టీవీ-9 వారు టీవీ 1ని నడుపుతున్నారు. ఇవికాక ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, మహా, హెచ్‌ఎం, ఐ న్యూస్, రాజ్, టిటిడి, టీవీ-5, విస్సా, లోకల్ వంటి ఎన్నో ఛానళ్లు నగరాల్లో హల్‌చల్ చేస్తున్నా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ప్రధానమైనవే కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు, మూలంగా సప్తగిరి కూడా ఉన్నాననిపిస్తుంది.

ఇన్ని ఛానళ్లు తెలుగులో హల్‌చల్ చేస్తున్నా ప్రేక్షకులు, డిస్కవరీ, ఎంటివి, ఎన్‌డిటివి, కలర్స్, స్టార్‌ప్లస్ అంటూ నేషనల్ ఛానళ్ల వైపు ఓ లుక్ వేయడం జరుగుతుంది. ఛానళ్లు ఎన్ని పెట్టినా సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను కట్టి పడేయగలిగితేనే ఎడ్వర్‌టైజ్‌మెంట్లని శ్లాట్స్ లెక్క ప్రసారం చేసి కోట్లు కొల్లగొట్టవచ్చునన్నది సత్యం. లేకపోతే కేబుల్ ఆపరేటర్ చెప్పే లెక్కలపైన ఆధారపడే ఛానల్‌ని నడపాల్సి ఉంటుంది. ఈ పరంపరలో నెగ్గుకురాలేని చాలా ఛానళ్లు మూత పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. భక్తి ప్రచారం కోసం కూడా అనేక ఛానళ్లు తమ ప్రసారాలను ప్రసారం చేస్తూ నడుస్తున్నా అవి భారంగానే నడుస్తున్నాయన్నది ఒప్పుకోక తప్పని సత్యం. నిత్యం పుట్టుకొస్తున్న ఛానళ్ల వల్ల ఉద్యోగావకాశాల రేటు పెరిగిందనే చెప్పాలి. అంతేకాక ఛానల్‌లో యాంకర్, రిపోర్టర్, రీడర్ వంటి వగైరా పాత్రల్లో స్పెషాలిటీని చూపగలిగితే ఆఫర్లతో వారిని లాక్కునే అవకాశాలు కూడా లేకపోలేదు. పెరుగుతున్న ఛానళ్లు ఎంతవరకు ఉపయోగకరం అనేది ప్రేక్షకుడి రిమోట్ చెబుతుంది.

Source: www.andhrabhoomi.net

టాలెంట్‌కి తగ్గవేదిక ‘అదుర్స్’

లోగడయితే కళాకారుడిలో ఉన్న ప్రతిభ చూపడానికి ఓ స్పష్టమైన వేదిక లేక నానా ఇబ్బందులూ పడేవాడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మనలో ఓ మాదిరి సృజనాత్మకత ఉన్నా దాన్ని బహిర్గతపరచుకోడానికి ఛానెళ్ల రూపంలో ఉన్న ప్లాట్‌ఫారాలెన్నో. అలాంటి ప్రతిభాశాలులకు మరో విలువైన వేదిక ‘అదుర్స్’ (ప్రతి బుధవారం ఈటీవీలో రాత్రి 9.30కి వస్తున్నది)

వైవిధ్యం..
ఈ శీర్షిక పేరులో (అదుర్స్) ఉన్న పరాకాష్ఠ తత్వమే, ఇందులో చూపబోయే అంశాలూ ఆ దిశలోనే ఉంటాయన్న సంకేతాన్ని సామాన్య ప్రేక్షకులకు కలుగుతోంది. ఆ తలంపునకు తగ్గట్లే ఇందులో చూసే ఐటెమ్స్ అన్నీ ఓ మాదిరి కృషి చేస్తే ప్రదర్శించే బాపతు కానే కావు. నిరంతర అభ్యాసం, మొక్కవోని దీక్ష సమ్మేళనపరిస్తేనే కానీ సంభవించే అవకాశం లేదు. మిగతా టాలెంట్ షోల్లో ఇంతవరకూ ఎక్కువగా ఆట (డాన్స్) పాట తప్పితే మిమిక్రీ తరహావి ఎక్కువ కన్పడితే ఇందులో సాహస విన్యాసాలూ వగైరా కూడా దర్శనమివ్వడం వెరైటీ. అయితే ఈ కార్యక్రమం ‘కలర్స్’ ఛానెల్‌లో వచ్చిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ స్ఫూర్తితో తయారైనదిగానూ అనిపిస్తోంది.

సకలాంగులకే సాధ్యం కానిది..
అన్ని అవయవాలూ ఉన్నా, దీక్షాలేమితోనో, మరో రకపు లోపభూయిష్టపు చర్యల వల్లో ప్రదర్శించే కళలో పరిపూర్ణత కనపర్చడం ప్రతీ సందర్భాలలోనూ జరిగే వ్యవహారం కాదు. కానీ ‘అదుర్స్’లో ప్రదర్శితమైన తొలి అంశంగా ‘ఎబిలిటీ అన్ లిమిటెడ్’ (అపరిమిత సామర్థ్యం) గ్రూప్ - ఢిల్లీ వారు ప్రదర్శించిన నృత్యం వచ్చింది. ఇందులో పాల్గొన్న నృత్య కళాకారులు వికలాంగులు. వీరు వీల్‌ఛైర్‌లో కూర్చిన నృత్య భంగిమలు చూపారు. వీరి వెనుక నర్తించిన నృత్య కళాకారిణులు వినికిడి, మాట్లాడే శక్తిలేనివారు. అలా వెనుక వినిపించే సంగీతం వినిపించకపోయినా సాధనతో అంచనా వేసి అనుగుణంగా నర్తించే సామర్థ్యం వీరి పరమైంది. ఇది నిజంగా దైవదత్తమైన అమూల్యాంశం. అందుకే వీరి ప్రదర్శన అనంతరం కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వచ్చిన తరుణ్ మాస్టర్ (డాన్స్ మాస్టర్), మహేశ్వరి (నటి), నందినీరెడ్డి (‘అలా.. మొదలైంది’ చిత్ర దర్శకురాలు) అద్భుత ఆనంద పరవశంతో వారుంటున్న ప్రదే శం నుంచి డయాస్  మీదికి వచ్చి కళాకారుల్నీ, వారికి ఆ స్థాయి ప్రదర్శనను నేర్పిన గురువునీ సాదరంగా ప్రశంసించారు. తర్వాత ప్రదర్శనలుగా ఫిక్టేసియస్ గ్రూప్ రెప్పపాటు కాలంలో ఒక చోట నుంచి మరో చోటకి ఎగరడం పనులూ, ఇల్యూమినేటింగ్ దళం (రెండు గ్రూపులూ ముంబై నుంచి వచ్చాయి) మెరుపుల నేపథ్యంలో విన్యాసాలూ చేశారు. అన్నింటికంటె ఎక్కువ ఆకర్షించినది కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన బంజారా డాన్స్ గ్రూప్ ద్వారా చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యం. ఈ ఐటెమ్‌లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, లైవ్ మ్యూజిక్‌తో నృత్యం చేయడం. ఇప్పుడు నృత్యాలు ఎక్కువగా ఏవో ముందుగా రికార్డయిన వాటితోనే జరుగుతున్నాయి. ఆ శైలికి భిన్నంగా ప్రత్యక్ష ప్రసారంలా.. అప్పటికప్పుడు వినిపిస్తున్న పాట, సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయడం. ఇలా చేయాలంటే ఈ ముగ్గురి (పాట, ఆట, సంగీతం) మధ్య కచ్చితమైన సమన్వయం ఉండాలి. అది బాగా కుదిరిందిందులో.

ఆశ్చర్యపరచిన గ్వాలియర్ గ్రూప్.. 
ఇక తొంభై కేజీల చొప్పునున్న పెద్దపెద్ద బండరాళ్లని బంతుల్లా ఆటలాడేసి.. ఏమిటీ టాలెంట్ అని సగటు ప్రేక్షకుణ్ణి విస్మయపరిచారు గ్వాలియర్ దళం వారు. అంతటి భారీ బరువు వున్న రాళ్లని కావడి రూపంలో ఓ కర్రకేసుకుని అటూ ఇటూ అవలీలగా ఊపడమే కాక పైన తనంత బరువున్న మరో వ్యక్తిని భుజాలపై నిలబెట్టుకోడం, గుండె మీద ఆ బరువుల్ని మోయడం వంటి ప్రమాదకర విన్యాసాల్నీ ఇందులోని ఓ వ్యక్తి చేశాడు. ఇవి చూసి ‘అమ్మో...’ అన్న భయాందోళనా భావాల్ని జడ్జెస్ స్థానాల్లో ఉన్నవారు చూపారు. దాదాపు అవే భావాలు ప్రేక్షకులకీ కలిగాయి.

..ఇది భావ్యం కాదు 
ఇక ప్రదర్శనల నంతరం ఏది బావుందో అన్న న్యాయనిర్ణేతల ప్రకటన అన్నిట్లోనూ ఉన్నట్లే ఇందులోనూ ఉంది. సరే... ఎవరికి ఫస్ట్ ఇచ్చారు? ఎవరిని సెమీ ఫైనల్స్‌కు ఎంపిక చేశారు అన్నది ప్రమాణాల్ని పరిశీలించి న్యాయనిర్ణేతలు నిర్ణయించే విషయం కనక దానిపై వ్యాఖ్యలనవసరం. కానీ బావున్న కేటగిరీలో గ్వాలియర్ గ్రూప్ ప్రదర్శించి అత్యంత సాహసోపేత ప్రదర్శన (రాళ్లను మోయడం) చేర్చకపోతే పోయే, కనీసం వారిలా ప్రమాదకర విన్యాసాన్ని విజయవంతంగా ప్రదర్శించడాన్ని ప్రస్తావించకపోవడం సరిగా అనిపించలేదు. అది పోగా ఎందుకివి చేయడం అన్నట్లు జడ్జెస్ ముగ్గురూ మాట్లాడడమూ కొంత బాధ కలిగించే అంశం. కళారూపాలు అన్నీ సున్నితంగానే ఉండవు. కొన్ని ఇలా ప్రమాదభరితంగానూ ఉంటాయి. అలా అయితే సర్కస్ కళలోని కొన్ని అంశాలూ ప్రమాదభరితమైనవి (పులి నోట్లో తల పెట్టడం..తదితరాలు) అయితే వాటిలో కూడా తమ ప్రతిభ చూపించే సాహసవంతులూ మనకున్నారు. మీరిలాంటి కళ నెందుకెంచుకున్నారు అని ఓ న్యాయనిర్ణేత అడిగిన ప్రశ్నకు, ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి వారభినయించి ప్రశంసలు పొందినది కనుక, ఆ సంస్కృతినీ, వారసత్వాన్నీ కొనసాగించడానికి మేం దీన్ని ఎంచుకున్నాం అని వారిలో ఒకరు చెప్పిన సమాధానం సముచితంగా ఉంది. బహుశా న్యాయనిర్ణేతలు ఈ అంశం పట్ల అంతగా దృష్టి పెట్టి ఆలోచించక పోడానికి కారణం ఆ ముగ్గురిలో ఎవరికీ ఈ తరహా వాటి పట్ల అంతగా పరిచయం లేకపోవడం కావచ్చు. కనుక మల్టీ టాలెంటెడ్ షోగా దీన్ని చెప్పుకొస్తున్నారు కనుక కేవలం నృత్య, అభినయ, గాన రంగాల్లో పరిణితి చెందిన వారిని ఎంపిక చేసే సిద్ధహస్తుల్నే కాక ఇతర రంగాల్లోని కళాకారుల నిగ్గు తేల్చగల సామర్థ్యం ఉన్న వారినీ జతపరిస్తే బావుంటుంది.

Source: www.andhrabhoomi.net