Friday, July 29, 2011

Now, Another Daily, TV Channel By A Politician!

It has become a trend for politicians to start media ventures, be it newspapers or television channels.

The latest to join the media bandwagon is the Congress legislator from Medak district Toorpu Jayaprakash Reddy who is a staunch critic of Telangana Rashtra Samithi (TRS) President K Chandrasekhar Rao.

Expectedly, his proposed Telugu newspaper and a TV channel will be competitors to the TRS leader’s media ventures- T-News channel and “Namaste Telangana” daily.

Jayaprakash, who represents Sangareddy constituency, asserted that his media organizations would reflect the genuine voice of the Telangana people. The daily and the channel are tentatively titled “Jai Telangana Jai”.

Jayaprakash made a scathing attack on KCR for using the media organizations as weapons to extort money.

“KCR and his family members have been exploiting the Telangana sentiment to further own self interests and made huge money. He has now entered into the media field with the same intention,” the Congress legislator said.

The YSR Congress Party President Y S Jagan Mohan Reddy owns “Sakshi” daily and TV channel while the Telugu Desam Party Chief N Chandrababu Naidu’s son Nara Lokesh runs “Studio-N” channel.

Source: www.greatandhra.com

Thursday, July 28, 2011

వాల్ట్ డిస్ని చేతికి ఆ ఛానెల్

ప్రపంచంలో భారతదేశం టీవీ మార్కెట్లో మడవ ప్లేసులో ఉంది. కెపిఎమ్ జి సర్వే ప్రకారం చైనా, అమెరికా తర్వాత ఎక్కువ టీవీ వీక్షకులు ఉన్న మార్కెట్ మనదే. దాంతో ఇప్పుడు లోకల్ మార్కెట్ ని ఆక్రమించటానికి ఎక్కడెక్కడి సమీకరణాలు మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రిందట ఈటీవిని రీజనల్ మార్కెట్ లో వాటా కోసం సోనీ కొనుగోలు చేయటానకి మందుకు వచ్చిందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు డిస్నీ స్టూడియో వారు యూటీవీని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు తీసుకోవటాకి ఒప్పందం కుదుర్చుకోవటానకి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


ప్రపంచంలోని మీడియా ఫర్మ్ లలో ఒకటైన వాల్ట్ డిస్నీ వారు యూటీవి సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ లిమెటెడ్ ని తీసుకోవటానకి కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ రెండు ఫర్మ్ లు కలిసి పనిచేస్తున్నాయి. వాల్ట్ డిస్నీ 50.44% వాటాని యూటీవిలో కలిగి ఉంది. ఇప్పుడు మిగిలిన మార్కెట్ ని కూడా హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. షేర్ వెయ్యి రూపాయలు చొప్పున యూటీవీ షేర్స్ ని షేర్ హోల్డర్స్ నుంచి కొనుగోలు చేయటానికి ముందుకొచ్చింది. ఈ ప్రపోజల్ కి యూటీవీ ఛీప్ రోనీ స్క్రూవాల్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ డీల్ ఖరారైతే రోనీ స్క్రూవాలా ఆ సంస్ధకు యజమాని నుంచి ఎంప్లాయిగా మారుతారు. అంతేగాక డిస్నీకు చెందిన మేనేజింగ్ డైరక్టర్స్ లలో ఒకరిగా సౌత్ ఆసియన్ రీజియన్ కి వ్యవహరిస్తారు. అతి త్వరలోనే ఈ డీల్ పూర్తవతుందని బిజెనెస్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదే జరిగితే తమ పరిస్ధితి్ ఏమిటని యూటీవికి పోటీ ఇస్తున్న మిగతా ఛానళ్ళు ఆలోచనలో పడ్డాయి. లోకల్ ఛానెల్ కు పోటీ సాధ్యమేకానీ, అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే ఛానెల్ తో పోటీ పడటం కష్టమేనని అభిప్రాయపడుతున్నాయి.

Source: thatstelugu.oneindia.in

త్వరలో పత్రిక, న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తా: జగ్గారెడ్డి

సామాజిక తెలంగాణ లక్ష్యంగా దోపిడీదారుల పాలన పోవాలని మీడియా రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(కాంగ్రెస్‌) వెల్లడించారు. బుధవారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మరి కొద్ది రోజుల్లో 'జై తెలంగాణ జై' పేరుతో దినపత్రిక, టీవీ న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ పేరు మీద వంద కోట్ల రూపాయలను పోగుచేసి వాటిని కుటుంబ ఆస్తులుగా కూడబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య తెలంగాణ పేరు మీద వచ్చిన ఒక దినపత్రిక, టీవీ ఛానెల్‌ కేవలం బ్లాక్‌ మెయిలింగ్‌కే పరిమితమై, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడవడం చూసి తానెంతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అందుకే పత్రిక, న్యూస్‌ ఛానెల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

Source: www.eenadu.net

ఆ హీరోకి సొంత ఛానల్


Source: telugu.greatandhra.com

2000 కోట్లకు అమ్ముడుపోయింది


Source: telugu.greatandhra.com

మీడియాకు సిబిఐ నివేదిక లీకేజ్ కాలేదు



Source: andhravilas.com

Wednesday, July 27, 2011

రామోజీ ఈనాడుకు జగన్ సాక్షి చానెల్ కౌంటర్

సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో రామోజీరావుకు చెందిన ఈనాడులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వస్తున్న వార్తాకథనాలకు కౌంటర్ ఇచ్చేందుకు సాక్షి టీవీ చానెల్ ప్రయత్నించింది. ఇందుకు సంబంధించి జగన్‌కు చెందిన సాక్షి చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో వైయస్ జగన్ ఆస్తులపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు వార్తాకథనాలను ప్రచురిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రికలోనూ, ఎబిఎన్ టీవీ చానెల్‌లోనూ జగన్ ఆస్తుల వ్యవహారాలపై వరుస వార్తాకథనాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ చానెల్ ప్రతినిధి సిబిఐ ఐజి లక్ష్మినారాయణతో మాట్లాడారు. 

జగన్ ఆస్తులపై తాము రూపొందించిన నివేదిక లీక్ కాలేదని ఐజి లక్ష్మినారాయణ చెప్పినట్లు సాక్షి చానెల్ తెలిపింది. తమ నివేదిక లీకయ్యే అవకాశం ఏ మాత్రం లేదని ఆయన చెప్పారు. కాగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వస్తున్న వార్తాకథనాలపై లక్ష్మినారాయణ అసహనం ప్రదర్శించారని సాక్షి చానెల్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. మీడియాకు చెప్పే విషయాలు ఏమైనా ఉంటే తాము చెబుతామని లక్ష్మినారాయణ అన్నారు. వైయస్ జగన్ ఆస్తులపై వస్తున్న వార్తాకథనాలపై తాము చర్య తీసుకునే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.


Source: thatstelugu.oneindia.in

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(30వ వారం)

1) టీవీ9           - 2.56
2) టీవీ5           - 1.79
3) సాక్షి టీవీ      - 1.65
4) ఎన్  టీవీ      - 1.37
5) హెచ్ ఎం టీవీ - 1.30
6) ఈ టీవీ2       - 1.10
7) జీ 24 గంటలు- 0.96
8) మహా టీవీ     - 0.87
9) ఎబిఎన్         - 0.61
10)స్టూడియో ఎన్- 0.60  

Source: www.porutelangana.com

Tuesday, July 26, 2011

టీవీ9 బంద్ అయింది


విధేయతను బదిలీ చేస్తున్న చానల్స్

రాజుల కాలంలో శత్రురాజ్యంపై విజయం సాధించాలంటే వారి కాల్బలం, ఏనుగులు, గుర్రాల బలం ఎంతో ముందు తెలుసుకునే వారు. అంతకు మించిన బలాన్ని సమకూర్చుకున్నాకే యుద్ధం చేసేవారు. రోజులు మారాయి. రాజరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఆయుధాలు కూడా మారాయి. అప్పుడు ఏనుగులు, గుర్రాలు ఆయుధాలు అయితే ఇప్పుడు మీడియానే ప్రధాన ఆయుధం. మీడియా బలం సమకూర్చుకోకుండా యుద్ధ రంగంలోకి అడుగుపెడితే ఎంత గొప్ప హీరో అయినా మట్టికరిచిపోతారని జనమే కాదు ఆ యోధుడు సైతం గ్రహించాడు. అందరి వాడిని.. అన్ని ఛానల్స్ నావే అనుకున్న చిరంజీవి చివరకు ప్రత్యర్థుల చానల్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. అనుభవం అయిన తరువాత ఆయనకు తత్వం బోధపడింది. ఇప్పుడు సొంత చానల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏదో ఒక రోజు అవకాశం రాకుండా పోదు. అప్పటి వరకు బలమైన ఆయుధాన్ని సమకూర్చుకోవాలనేది ఆయన లక్ష్యం. ఆయనో న్యూస్ ఛానల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

చిరంజీవి అనుభవమే కాకుండా తన తండ్రి అనుభవాన్ని సైతం దగ్గరి నుండి చూసిన జగన్ ముందు నుండి మీడియా బలాన్ని బాగానే అంచనా వేశారు. మీడియా విషయంలో తన ప్రత్యర్థి చంద్రబాబు కన్నా ఒక అడుగు ముందుకేశారు. సొంత మీడియానే కాకుండా అనుబంధ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. తాతకు దగ్గులు నేర్పుతావా? అనుకున్న ప్రత్యర్థి సైతం ఈ ఎత్తుకు పైఎత్తు వేశారు. దీంతో జగన్ ఒడిలో నుండి ఒక్కో మీడియా జారిపోతోంది. జగన్‌కు సొంత ఛానల్ ఎలాగూ చేతిలో ఉంది . ఒప్పందాలు ఏమిటో బయటకు తెలియదు కానీ సొంత ఛానల్‌తో పాటు కొన్ని చానల్స్ జగన్‌కు మద్దతుగా ఉండేవి. వీటిలో ఒక్కొక్కటి జారుకుంటోంది.

మొన్నటి వరకు ఒక నాయకుడిని తీవ్రంగా విమర్శించే ఛానల్ హఠాత్తుగా ప్లేటు మార్చి ఆ నాయకుడిని తీవ్రంగా విమర్శిస్తుంటే తెరపై చూసినప్పుడు నిష్పక్షితత్వానికి మారు పేరు అనిపిస్తుంది. లోతుగా విషయ పరిశీలన చేస్తే అసలు విషయం నిష్పక్షపాతం కాదు విధేయతగా మారింది అని తెలుస్తుంది.

2009 ఎన్నికల సమయంలో ఒక ఛానల్ మొదటి విడత పోలింగ్ మొత్తం టిడిపిని విమర్శిస్తూ, వైఎస్‌కు అండగా నిలిచింది. బాబు, ఆ ఛానల్ యజమాని ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. అక్కడ ఇద్దరూ తారసపడ్డారు. ఏంటయ్యా మనవాడివై ఉండి మనకు వ్యతిరేకంగా మీ ఛానల్ ఉందేమిటి? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేస్తాం ఎటు నుండి సహాయం వస్తే అటుండాలి, మీ నుండి ఆశించిన సహాయం రాలేదు అన్నారు. ఏం సహాయం అందిందో కానీ మొదటి విడత పోలింగ్‌లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఆ ఛానల్ రెండవ విడత పోలింగ్‌లో బాబును భుజానికెత్తుకుంది. ఫలితాలు వచ్చాక మళ్లీ జగన్ పక్షం వహించింది. ఇప్పుడు ఛానల్ తన విశ్వసనీయతకు పచ్చదనం పులుముకుంది.

మరో ఛానల్ నిర్మొహమాటంగా జగన్‌కు రాంరాం చెప్పి కిరణ్‌లోని పాలనా పటిమను ప్రపంచానికి చాటడంలో మునిగిపోయింది.

గతంలో టీవి9 పట్ల చంద్రబాబు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. మీ ఛానల్ వైఎస్‌ఆర్ కొమ్ము కాస్తోంది మీ సంగతి చూస్తాం, మిమ్ములను మేం బహిష్కరిస్తాం అని బాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ ఛానల్‌ను జగన్ కొనేశాడు అని టిడిపి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అందులో నిజం ఎంతో, తరువాత ఏం జరిగిందో కానీ ఇప్పుడా ఛానల్ పేరు వింటేనే జగన్ వర్గం మండిపడుతోంది. జగన్‌పై విషం కక్కడంలో ఆ ఛానల్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇక తెలంగాణ వారు ఈ ఛానల్‌కు తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేశారు.

ఛానల్స్ ఆపద్బాంధవుడు
గతంలో ఒకే ఛానల్ ఉన్నప్పుడు వారు ఆడిందే ఆట వారు చెప్పిందే వార్త. ఇప్పుడు పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఛానల్స్ ఉండడం వల్ల అందరి వాదనలు తెలుసుకునే అవకాశం ప్రజలకు లభిస్తోంది. ఈ వారం టీవీ ఛానల్స్ పాలిట ఆపద్బాంధవుడిగా మందకృష్ణ మాదిగ మారారు. యాదిరెడ్డి ఆత్మహత్య అంశంపై ఢిల్లీలో దళిత అధికారిపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేయి చేసుకున్నారు. తరువాత క్షమాపణ చెప్పారు. అప్పటి వరకు జగన్ సభ ముగిసిన తరువాత మైదానంలో కనిపించే కొద్దిమందిని చూపించి జనం లేరు అని చెప్పడం, మద్యం షాపుల వద్ద కార్యకర్తలను చూపించడం. ప్రతి మీటింగ్‌కూ రెడీమేడ్‌గా ఇవే దృశ్యాలు చూపుతూ అదే అద్భుతంగా భావిస్తూ మురిసిపోయిన యువ బాబు ఛానల్ స్టూడియో ఎన్ ఢిల్లీ సంఘటనపై ఒక్కసారిగా మేల్కొంది. దళితునిపై దొరల దౌర్జన్యం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాబు ఆదేశాలపై టిడిపి దళిత నేతలతో పాటు దళిత సంఘాలతో మాట్లాడించారు. పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా మహేశ్వర్‌రావువంటి కొందరు నేతలు ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారం చేడులో దళితులను ముక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటకట్టి ఊరవతల పారేసిన ‘మహానుభావుల వర్గం’ ఒక్కసారిగా దళిత ప్రేమను కుమ్మరించింది. వారిలో ఇంతటి మార్పు వస్తే ఆహ్వానించదగిందే. ఈ సంఘటనతో పలు తెలుగు ఛానల్స్ పాలిట మందకృష్ణ మాదిగ ఆపద్బాంధువునిగా కనిపించారు. అప్పటి వరకు తెలంగాణ అంశంపై దాడి చేయడానికి అవకాశం లేదని ఆవేదన చెందిన ఛానల్స్ అన్నీ మందకృష్ణ మాదిగతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక టిఆర్‌ఎస్‌కు చెందిన టీ ఛానల్ దీనిపై ఎదురుదాడి జరిపింది. టిఆర్‌ఎస్ దళిత నాయకులతో మాట్లాడించింది. పలు ఛానల్స్‌లో మందకృష్ణ మాట్లాడారు. ఈ అంశంపై ఐ న్యూస్‌లో మందకృష్ణకు ఆయన గురువు దళిత నాయకుడు ఉ సాంబశివరావుకు వాగ్వివాదం జరిగింది. టీ న్యూస్‌లో ఉ సాంబశివరావు మాట్లాడుతూ దాడిని ఖండించాల్సిందే,దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎంత వరకైనా పోరాడాలి. కానీ కొందరు వ్యక్తులు ఈ అంశాన్ని సాకుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటికి మనం మద్దతుగా నిలిస్తే మన అసలు లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు.

గతంలో ఎబిఎన్ ఛానల్‌పై దాడికి దిగిన మందకృష్ణ తెలంగాణకు చెందిన నాయకుడు ఆయన చానల్స్‌కు ఆత్మబంధువుగా కనిపిస్తే, సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు ఉ సాంబశివరావు తెలంగాణ చానల్ టీ ఛానల్‌కు ఆత్మబంధువుగా కనిపించారు. రాజకీయాల్లోనే కాదు ఛానల్స్‌కు సైతం ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. నాయకత్వం స్థాయిలో ఉన్నవారు ఎలాంటి సందర్భంలోనైనా సంయమనం కోల్పోతే తన శత్రువు అవకాశం కల్పించిన వారవుతారని హరీష్ ఉదంతం నాయకులకు ఒక పాఠంగా నిలవాలి.

Source: www.andhrabhoomi.net

వీక్షకుల తీర్పు - అదే కొరవడింది!

ఈటీవీ-2లో ప్రసారమైన నారీ భేరీలో ‘అంతర్జాలంలో అతివలు’ కార్యక్రమం గురించి వెలిబుచ్చిన కొన్ని సందేహాలకు నా వంతుగా కొన్ని మాటలు. చర్చలో అసలు గ్రామాల్లో నివసించే మహిళలకు ఏ స్థాయిలో చేరుతుంది అనే విషయంపై.. అసలు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఇంట్లో నెట్ ఉన్నా ఉపయోగించని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అసలు నెట్‌లో తెలుగు చాలా సులువుగా, ఖర్చు లేకుండా రాయొచ్చు, చదవొచ్చు అనే విషయం ఇంకా చాలామందికి తెలీదు. కంప్యూటర్, నెట్ అంటే అది ఉద్యోగం చేసేవాళ్లకు, విద్యార్థులకు మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను కూడా ఈ విషయమై చైతన్యవంతం చేయొచ్చు అన్నారు.. మంచి ఉద్దేశమే. కాని నెట్ ఉన్నవాళ్లకు ముందు దాని ఉపయోగాలు తెలియజేస్తే మంచిది కదా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కంప్యూటర్ నిపుణులు కారు. కంప్యూటర్ వినియోగం, నెట్ గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ వచ్చారు. నెట్ మానవ సంబంధాలకు అడ్డంకిగా మారిందని అంటున్నారు. దానిని వ్యతిరేకిస్తున్నా. ఈ రోజుల్లో ఎంతమంది తరచూ ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా తీరికలేని ఉద్యోగాలు, చదువులు అయిపోయాయి. ఇక వేరే ప్రాంతాల్లో, దేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల సంగతి ఎలా? కాని ఈ నెట్ ద్వారా ఆ దూరాలను తగ్గించే అవకాశం ఉంది. తమ చదువులు, ఉద్యోగ, వ్యాపార నిర్వహణతోపాటుగా తన వారిని పలకరించి ముచ్చటించడం, చర్చించడం సాధ్యమవుతుంది. మనకు ఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉన్నా తరచూ ఎవరింటికీ వెళ్లం. మనకు తీరిక ఉండి, అవసరం ఉన్నప్పుడు వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటప్పుడు నెట్ ద్వారా ఇంట్లో ఉండే కొత్త స్నేహాలు, పరిచయాలు పెంచుకోవచ్చు. కొద్దిసేపైనా తమలా ఆలోచించేవారితో చర్చించుకుని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఎంతో ఉంది. కాని నెట్‌ని సద్వినియోగపరచుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. దేనికైనా నియంత్రణ అనేది తప్పకుండా ఉండాలి. నెట్ వినియోగం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందన్నారు. అదెలా జరుగుతుంది. ఒక మనిషికి తెలిసినవి, గుర్తున్న విషయాలు ఎన్ని ఉంటాయి? అవి చాలా పరిమితం. చాలా విషయాలు తెలిసిన వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. వాళ్లు పుస్తకాలు చదివి, పెద్దవాళ్లతో చర్చించి తమ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు. కాని మిగిలిన వారి సంగతేంటి? తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కాని చెప్పేవాళ్లు ఎవరు? పుస్తకాలు కొనాలంటే కూడా ఖర్చే కదా. అది ఎంతమంది భరించగలరు. ముఖ్యంగా గృహిణులు, రిటైరైన పెద్దవాళ్లు. కాని నెట్ వినియోగం వల్ల ఎన్నో విషయాలను నిమిషాల్లో, కానీ ఖర్చు లేకుండా తెలుసుకోవచ్చు. దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం కాదు జ్ఞానసంపద పెరుగుతుంది. శోధనా, విశ్లేషణ శక్తి పెరుగుతుంది. ఈ విషయాలన్నీ చర్చించలేదన్నారు. మహిళా బ్లాగర్లు పాల్గొన్న మొదటి కార్యక్రమం ఇది. అందునా ఈ కార్యక్రమానికి ఉన్న సమయం అరగంట మాత్రమే. అందుకే అన్ని విషయాలు చర్చించడం అసాధ్యమే కదా. ముందు ముందు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రసారం చేస్తారేమో చూద్దాం. ఈ దిశలో తొలి అడుగు పడింది కదా.. ఇది శుభసూచకం.

Source: www.andhrabhoomi.net

మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలా?

ఎ.టి.ఎం... ఈ పొడి అక్షరాలతో కలిసిన సంక్షిప్త నామానికి మనందరికీ తెలిసిన విస్తృతార్థం ‘ఎనీ టైం మనీ’ అని. కానీ దీనికా మధ్య ఓ సినిమాలో ‘ఎనీ టైం మర్డర్’ అని మరో అర్థం చెప్పారు. అయితే ఇప్పుడిదే సంక్షిప్త నామం (ఎ.టి.ఎం.)తో ప్రతి ఆదివారం ఈటీవీ ఉదయం పదిన్నరకి ఓ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇక్కడ ఎటిఎం అంటే అర్థం అన్నీ తమాషా ముచ్చట్లే... అని. ఇందులో ప్రతి ఆదివారం ఓ సినీ ప్రముఖుని ముచ్చట్లు ప్రసారం చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ఓ ముచ్చట టీవీలో వచ్చినా ఆ ముచ్చటని మరో రూపంలో టీవీలోనో, పత్రికల ద్వారానో ప్రేక్షకులు అంతకు ముందు తెలుసుకున్న వారయ్యే ఉంటారు. ఆ సంగతీ ఇందులో మరోమారు రుజువైంది. ఈ పరంపరలో ఈ మధ్యన ఈ శీర్షికలో సంగీత దర్శకుడు కోటి గురించి ముచ్చట్లు చెప్పారు. మామూలు నిన్నగాక మొన్నొచ్చిన వారి వివరాలే టీవీ ఛానల్స్‌లో పదేపదే చూపడం వల్ల అందరికీ తెలుసు. అందులోనూ ఇలా కోటి లాంటి సుదీర్ఘ సంగీత ప్రయాణం చేసిన వారి విషయంలో అయితే ఈ బాపతు చర్విత చర్వణాలకు కొదవే లేదు. కానీ కొంత వైవిధ్యం కోసం అనుకుంటా అలా ప్రముఖులతో ముచ్చట్లు చెప్పించే యాంకరమ్మ యాసను సోది చెప్పేవాళ్లదిలా చేశారు. ఈ బాపతు యాస టీవీల్లోకి వచ్చే కొత్తకొత్త యాంకర్లకు ఇస్తే కాస్త కళగా ఉండేదేమో కానీ, ఝాన్సీ లాంటి అందరికీ తెలిసిన వ్యాఖ్యాత్రి కివ్వడంతో రాణించలేదు. అంటే ఆ భాషను ఆమె సరిగా పలకలేదని కాదు... కానీ అనేకానేక వేషాల్లో ఆమెను చూసిన ప్రేక్షకులకు ఇది అంతగా పట్టలేదు. ముందే చెప్పినట్లు కోటి గురించి కొత్తగా తెలిపేది ప్రేక్షకులకేముంటుంది? ఇప్పటికే కోటానుకోట్ల సార్లు పలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారమై పోయాయి. ఒక పాయింటే కొత్తగా ప్రస్తావితమైంది. అది - మేం గతంలో ఫాస్ట్ మీట్ కొట్టాం. అప్పుడు మెలొడీకి మంచి మక్కువ చూపేవారు. ఇప్పుడు ఫాస్ట్ బీట్‌లెక్కువగా లైక్ చేస్తున్న కాలంలో మాకు సాఫ్ట్ సాంగ్సే ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి. ఫాస్టయినా, సాఫ్టయినా అందులో ఆకట్టుకునే మెత్తని వరసుంటే అది అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. అది కోటి వంటి లబ్ధి ప్రతిష్టులకు తెలియంది కాదు. ఇక కార్యక్రమంలో ఎక్కువ భాగం ముచ్చట్లు చెపుతున్న మనిషిని నుంచోబెట్టి చెప్పించేయడం స్కూల్లో విద్యార్థిని బెంచ్‌పై నిలబెట్టి చెప్పించినట్లుంది. ఈ ధోరణి మారాలి.

అడగక ఇచ్చిన మనసు..
ఒకప్పుడు సీరియల్స్ కథలు అత్తాకోడళ్ల చుట్టూ తిరిగితే ఇప్పుడు ప్రేమలు - పెళ్లిళ్లు లాంటి వాటి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ తిరగడాల్లో కూడా కొంత తర్కానికి చోటిస్తే ఓకే కానీ అలాంటి వాటికి బహు దూరంగా వెళ్లిపోతోంది ‘అడగక ఇచ్చిన మనసు...’ (మాటీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30కి వస్తున్నది) అమ్మాయి - అబ్బాయి ఒకర్నొకరు ఇష్టపడతారు. కానీ పెద్దవాళ్ల అభ్యంతరాల వల్ల అది కుదరదు. తండ్రి తన కూతురికిచ్చి చేయాలనుకున్న వ్యక్తి విదేశాల్లో ఉంటాడు. అతను అమ్మాయితో మాట్లాడాలని చేసిన ప్రయత్నం అప్పటికే ఆమె ఇల్లు విడిచి వెళ్లడంతో వీలు పడదు. ఆ సంగతి తెలియనివ్వకుండా అమ్మాయి తండ్రి తీసుకుంటున్న జాగ్రత్తలు, వగైరా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నెట్‌లు, టీవీలు, సెల్‌లూ అత్యంత సహజ అవిభాజ్య అంశాలై పోయిన యువతరానికి వాటి నుంచి అమ్మాయిని నేను చాలా దూరంగా పెట్టాను అని చెప్పడం, ఆమె అలాంటి ఎలాంటి ఫోను ఆసరా లేకుండా ఉండడం... ఇవన్నీ ఏ రకమైన ట్రెండో అర్థం కాదు. ఇదిలా ఉంటే మరో కోణంలో నా మనవడికి ఆదర్శ వివాహమే అయినా వితంతు వివాహమే చేస్తానని మంకు పట్టు పట్టే తాత ఉపాఖ్యానం మరోవైపు సాగుతోంది. వితంతు వివాహం - ఆదర్శం వాటి ఉన్నతి వేరు. దాన్నిలా హాస్యానికి వాడుకోవడం విచారకరం. ఇందులో కాస్త బాగున్నవి సంభాషణలు. రాజకీయ పరిభాషలో మాట్లాడే దిలీప్ తండ్రి పాత్రధారికి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. అలాగే తండ్రి తాతల పరిస్థితిని విశే్లషిస్తూ ‘తాతకు ఆయాసం - తండ్రికి ఆవేశం...’ రెండింటిలో ఎవరికి ఏది ఎక్కువైనా నాకు అర్జంటుగా ఊరికి రమ్మని పిలుపొస్తుంది..’ లాంటివి సందర్భానుసారంగా ఉన్నాయి.

‘యువరాణి’ని ఇంకా రక్తి కట్టించవచ్చు..
చాలాకాలం తర్వాత ‘మిస్ ఇండియా’ గౌరవం మన తెలుగమ్మాయి వాసుకికి దక్కింది. ఈ సందర్భంగా ‘యువరాణి’ శీర్షికలో ఆమెతో సాక్షి టీవీలో జూలై 22న రాత్రి 9.30కు ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. ఎందుకో ఈ కార్యక్రమం చూస్తోంటే ఉన్న అరగంట వ్యవధిని సరిగ్గా వినియోగించుకుని ఉపయుక్తకర సమాచారం అందివ్వలేదనిపించింది. మరి అనుభవజ్ఞురాలైన ప్రెజెంటరే ఈ కార్యక్రమాన్ని ఆనాడు సమర్పించినా ఈ ఫలితం ఉండడం ఉసూరుమనిపించింది. ఇది అతి సామాన్య ప్రేక్షకుడు కూడా ఇట్టే పట్టేసే అంశం. అదెలాగంటే వాసుకి తన సమాధానాల్లో భాగంగా ఓసారి నేను దేన్నీ ప్లాన్ చేసుకోను. ఆ సమయానికి అయ్యేవే అన్నీ’ అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినా తిరిగి ఇంకోసారి ‘మీ ఎజెండా ఏమిటి?’ అని ప్రశ్నించడం అర్థరహితం. అలాగే వాసుకి ‘నేను సినిమాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. అవసరమైతే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళతానేమో’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా సూటిగా చెప్పినా తిరిగి యాంకర్ ‘మీరు భవిష్యత్తులో సినిమాల్లోకి వెళతారా’ అని అడగడమూ అనవసరమే. అయితే వాసుకీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ- ‘నాకు సినిమా ఆఫర్లు వచ్చాయి. అటువైపు వెళ్లనని చెప్పను కానీ దాని కోసం ఎలాంటి ప్లానూ చేయలేదు’ అని చెప్పినట్లు ఓ పత్రిక ప్రచురించింది కూడా. దీన్ని రిఫరు చేస్తూనైనా ఇంటర్వ్యూ సాగి ఉంటే బావుండేది. అయితే అందాల రాణుల్లా వెలిగిన వారి తర్వాతి తప్పనిసరి ప్రస్థానం మోడలింగూ, సినిమాలేనా? అని వాసుకి ప్రశ్నించడం సమంజసం. వాటిపైన కాకుండా తనకంతకు ముందే పేరు తెచ్చిన న్యాయవాద వృత్తి, తద్వారా లభించిన రాజకీయ ఆసక్తి సంబంధితమైన వాటివైపు మనసు లగ్నం చేస్తానని చెప్పడం బాగుంది.

Source: www.andhrabhoomi.net

Monday, July 25, 2011

ఇవాళ్టి నుంచి తెలంగాణలో టీవీ9 బంద్‌

తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తూ, మోసపూరితంగా ఉద్యమాన్ని అణిచివేయాలని టీవీ-9 చానల్ ప్రయత్నిస్తున్నది.. దానికి నిరసనగా ఆ చానల్ ప్రసారాలను తెలంగాణలోని 10 జిల్లాల్లో సోమవారం నుంచి నిరవధికంగా బంద్ చేస్తున్నాం.. అని తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు కుల్‌దీప్ సహాని ప్రకటించారు. ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, తెలంగాణవాదుల ఒత్తిడి మేరకు టీవీ-9 ఛానల్‌ను బంద్ చేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబ సభ్యులు సైతం టీవీ-9 ప్రసారాలను నిలిపివేయాలని కోరారని చెప్పారు. గతంలో చేసిన రాజీనామాలను శాసనసభ స్పీకర్ తిరస్కరించినప్పటికీ, తెలంగాణ ప్రజావూపతినిధులు మళ్లీ రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపచేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాలను ఆమోదింపజేసుకున్నపుడే వారు ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. లేకుంటే నేతల భవిష్యత్ శూన్యం అవుతుందని హెచ్చరించారు. ప్రజావూపతినిధులు ఉద్యమంలో మమేకమై పోరాడాలని సహాని సూచించారు. మిగతా సీమాంధ్ర చానళ్లను కూడా బ్యాన్‌ చేయాలని కులదీప్‌ సహానీకి పోరుతెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది.

Source: www.porutelangana.com

Sunday, July 24, 2011

TV9 To Be Blacked Out In Telangana

The leading Telugu news channel TV9 has earned the wrath of the Telangana protagonists because of its alleged biased coverage of events pertaining to the statehood movement.

The stand-off has now reached a flashpoint with the Telangana Cable Operators’ Joint Action Committee deciding to boycott the channel across the region from Monday.

As a result, the channel will be blacked out in the region till it mends its ways. The JAC has issued notices to this effect to the Telangana MSOs (Multiple System Operators).

The JAC has accused the TV9 management of adopting a deliberate anti-Telangana stand and twisting the developments to suit its position.

The latest incident that triggered the confrontation was the suicide of Yadi Reddy, a youth from Moinabad in Ranga Reddy district, in the heart of Delhi.

The Cable Operators’ JAC has alleged that TV9 had deliberately blacked out the coverage. The suicide incident was completely ignored by the channel. It was not mentioned even as a scroll.

However, the Telangana Rashtra Samithi legislator T Harish Rao beating up an official of the Andhra Pradesh Bhavan was played up by the channel. It repeatedly showed the footage.

Source: www.greatandhra.com

Saturday, July 23, 2011

టీవీ9 ప్రసారాలు ఆపేస్తున్నాం


‘వీరాభిమాని’కి బహుమతి

‘‘విభిన్న కార్యక్రమాలతో, ధారావాహికలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు తాజాగా ‘వీరాభిమాని’ పోటీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ  కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది’’ అని జీ టీవీ ప్రతినిధి తెలిపారు. ఈ ‘వీరాభిమాని’ పోటీలో పాల్గొనడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉందని, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి బహుమతులు ఇవ్వడంతోపాటు, ఒక వీరాభిమానికి కారుని బహుకరిస్తామని కూడా తెలిపారు.

Source: www.sakshi.com 

Wednesday, July 20, 2011

ఈ వారం జీఆర్పీ రేటింగ్స్‌(29వ వారం)

1) టీవీ9            -    122 గత వారం- 150
2)
టీవీ5            -    083 గత వారం- 090
3)
హెచ్ ఎం టీవీ  -    067 గత వారం- 072
4)
ఎన్  టీవీ       -    065 గత వారం- 078
5)
సాక్షి టీవీ       -   065 గత వారం-  065
6)
ఈ టీవీ2        -   056 గత వారం- 065
7)
జీ 24 గంటలు -   045 గత వారం- 047
8)
మహా టీవీ      -   035 గత వారం- 037
9)
స్టూడియో ఎన్ -   031 గత వారం- 026
10)
ఎబిఎన్         -   024 గత వారం-0 27
11)
ఐ న్యూస్       -   017 గత వారం- 021
12)
జెమిని న్యూస్ -   003 గత వారం- 003

Source: www.porutelangana.com

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(29వ వారం)

1) టీవీ9            - 2.60 
2) టీవీ5            - 1.76 
3) హెచ్ ఎం టీవీ - 1.43 
4) ఎన్  టీవీ       - 1.39 
5) సాక్షి టీవీ       - 1.37 
6) ఈ టీవీ2        - 1.19 
7) జీ 24 గంటలు- 0.95 
8) మహా టీవీ     - 0.75 
9) టి న్యూస్      - 0.57(కేవలం హైదరాబాద్ లో మాత్రమే)
10)ఎబిఎన్        - 0.57 
11)స్టూడియో ఎన్- 0.56 
12)ఐ న్యూస్      - 0.45 
13)జెమిని న్యూస్- 0.07 

Source: www.porutelangana.com 

Tuesday, July 19, 2011

'దూకుడు' శాటిలైట్ రైట్స్ రేటెంత?

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'దూకుడు' చిత్రం శాటిలైట్ రైట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. మా టీవీ వారు ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లు చెల్లించి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సోమాజి గూడలో ఓ ప్రెవేట్ హౌస్ లో జరుగుతోంది. మహేష్ బాబుకీ,బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో ఓ డిఫెరెంట్ మేనరిజం, గెటెప్ తో ఉండబోతున్నారు. ఈ చిత్రం ఆడియో మహేష్ బర్తడేకి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Source: thatstelugu.oneindia.in

Mayabazar Channel On Insat 2E

Mayabazar Channel On Insat 2E



మాయాబజార్ ఛానల్ ఇన్సాట్ 2E లో...

మాయాబజార్ ఛానల్ ఇన్సాట్ 2E లో...



వీక్షకుల తీర్పు - మాటీవీ సినీ అవార్డ్స్ ఫంక్షన్

మాటీవీలో ఇటీవల ప్రసారమైన సినీ అవార్డ్స్ ఫంక్షన్ ఎంతో ఆసక్తిగా సాగింది. ఐతే ఈ ఫంక్షన్‌కి యాంకర్‌గా వ్యవహరించిన సినీ నటుడు చేసిన కొన్ని అసభ్య వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించాయి. కొందరు హీరోయిన్ల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చౌకబారుతనంగా ఉన్నాయి. వీటివల్ల ఈ ఫంక్షన్ నిండుతనం కోల్పోయింది. ఇటువంటి అవార్డుల ఫంక్షన్లకు హాస్య నటీనటులను దూరంగా ఉంచటం మంచిదని నా అభిప్రాయం. ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానిలో నటించిన అందరూ కారణం. కానీ ఆయా సినిమాల్లో నటించిన హీరోయిన్ల విషయంలో ఎందుకు చౌకబారు విమర్శలు చేస్తారో అర్థం కాదు. ఇటువంటి విమర్శలను అందరూ ఖండించాలి. ఆమె లావుగా ఉండొచ్చు. అదే విధంగా మొన్నటి వరకూ లావుగా ఉన్న చిరంజీవిని విమర్శించగలరా? ఎందరో లావుగా ఉన్నారు మరి వారిని విమర్శించగలరా? అదీ ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో చేయటం సభ్యత కాదని మా అభిప్రాయం. ఇటువంటి చౌకబారు విమర్శలు చేయటం ఇది వరకు చాలా ఫంక్షన్లలోనూ జరిగింది.

Source: www.andhrabhoomi.net

బెస్ట్ ప్రోగ్రామ్ గా “ప్రేమతో మీ లక్ష్మి”

బెస్ట్ ప్రోగ్రామ్ గా “ప్రేమతో మీ లక్ష్మి”

ఈటీవీలో ప్రసారమవుతున్న “ప్రేమతో మీ లక్ష్మి” కార్యక్రమం తెలుగు టెలివిజన్ కార్యక్రమాలన్నింటిలో అత్యధిక ప్రేక్షకులు చూస్తున్న ప్రోగ్రామ్ [టి ఆర్ పి రేట్ ప్రకారం]గా నమోదు అయింది.

ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్నీ వర్గాల తెలుగు ప్రేక్షకులు అత్యంత ఇష్టంగా చూస్తున్నారని దీనిని బట్టి తెలుస్తుంది. ఇంతకు ముందు లక్ష్మి వ్యాఖ్యాతగా జీ తెలుగు లో చేసిన “లక్ష్మి టాక్ షో” బెస్ట్ ప్రోగ్రామ్ గా బహుమతి పొందింది.

ప్రముఖ నటీనటులు, చిత్ర రంగ ప్రముఖులు ను ఆహ్వానించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా ఉంటుందని ప్రేక్షకులు తెలిపారు. ముఖ్యంగా ఇంతకు మూడు ఎవరూ అడగని ప్రశ్నలు అడుగుతూ లక్ష్మి “ప్రేమతో మీ లక్ష్మి” లో ప్రదర్శిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది.

అమెరికా లో ఉన్న లక్ష్మి తెలుగు బాష మాట్లాడే తీరు మరో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మాట్లాడే తీరు అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్యక్రమంలో లక్ష్మి కనిపించే తీరు, మేకప్ మరో ముఖ్య ఆకర్షనీయాంశం.

ప్రముఖ షాపింగ్ మాల్ కళామందిర్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి గురువారం రాత్రి 9.30 నిమిషాలకు ఈ టీవి లో ప్రసారమవుతుంది.

కొన్ని సందర్భాలలో లక్ష్మి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, మరి కొన్ని సమయాలలో సెలెబ్రిటీలు కంట తడి పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నీ కలగలిపి “ప్రేమతో మీ లక్ష్మి” కార్యక్రమం టెలివిజన్ రంగంలో గొప్ప హిట్ గా నిలిచింది.

Source: www.mana-andhra.com

Saturday, July 16, 2011

చిరంజీవి 'టీవీ' ఎప్పుడు.?



Source: telugu.greatandhra.com

Friday, July 15, 2011

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(హైదరాబాద్‌)(28వ వారం)

1) టి న్యూస్         - 1.45
2)
జీ 24 గంటలు  - 1.44
3)
సాక్షి టీవీ         - 1.07
4)
మహా టీవీ        - 0.81
5)
స్టూడియో ఎన్ - 0.71
6)
హెచ్ ఎం టీవీ   - 0.72 
7)
ఎబిఎన్           - 0.57 
8)
ఐ న్యూస్        - 0.54
9)
జెమిని న్యూస్ - 0.11

Source: www.porutelangana.com

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(28వ వారం)

1) టీవీ9                 -  3.15
2)
టీవీ5                 -  1.89
3)
ఎన్  టీవీ            -  1.64
4)
హెచ్ ఎం టీవీ      -  1.51
5)
సాక్షి టీవీ            -  1.38 
6)
ఈ టీవీ2             -  1.36
7)
జీ 24 గంటలు     -  0.98
8)
మహా టీవీ           -  0.78
10)
ఎబిఎన్              -  0.57
11)
స్టూడియో ఎన్    -  0.56  
12)
ఐ న్యూస్           -  0.45
13)
జెమిని న్యూస్    -  0.07 

Source: www.porutelangana.com

మంచు లక్ష్మి ప్రసన్న 'ఎన్ టీవి' పై మండిపాటు

మంచు లక్ష్మి ప్రసన్న తాజాగా ట్విట్టర్ లో 'ఎన్ టీవి' లో వచ్చిన స్క్రీలింగ్ కి కౌంటర్ చేస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో...ఎన్ టీవీ స్క్రోలింగ్ లో వచ్చిన మోహన్ బాబు, రామ్ చరణ్ ల ఆర్గుమెంట్ రబ్బిష్. నాన్న మీడియా ఇలాంటి వార్తలు ప్రసారం చేయటంపై చాలా కోప్పడ్డారు. అంతేకాదు చరణ్ నాన్నకు మంచి స్నేహితుడు, కొడుకు లాంటి వాడు వాడు. కాబట్టి ఆర్గుమెంట్ జరిగిందనేది నమ్మొద్దు అని ట్వీట్ చేసింది. ఇక రామ్ చరణ్ కీ, దాసరికి మధ్య జరిగుతున్న కోల్డ్ వార్ లో మోహన్ బాబు తల దూర్చి తన గురువు కి సహాయం చేసాడన్న రీతిలో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ టీవీ ఛానెల్ ఈ విషయమై మోహన్ బాబు రామ్ చరణ్ ని తిట్టాడంటూ స్కోరింగ్ ప్రసారం చేసింది. అయితే ఆ అత్యుత్సాహానికి మోహన్ బాబు కూతురు లక్ష్మి ప్రసన్న ఇలా అడ్డు కట్ట వేసింది.

Source: thatstelugu.oneindia.in

సోనీ టివీ చేతుల్లోకి రామోజీరావు ఈటివి?

ఈటీవీ కి చెందిన పదకొండు రీజనల్ ఛానెల్స్ ని సోనీ టెలివిజన్ ఇండియా వారు కొనుగోలు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే ఇండియాలో ఇప్పటి వరకూ జరిగిన పెద్ద మీడియా డీల్ గా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

రామోజీరావు తన తమ మీడియా గ్రూపులోని ప్రాంతీయ భాషా చానళ్లలో కొంత వాటాను సోని గ్రూప్ కు అమ్మివేయనున్నారంటూ బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో ఓ కధనం వచ్చింది. దాని ప్రకారం రెండు కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇవి అడ్వాన్స్ డ్ దశలో ఉన్నాయని ఈ పత్రిక రాసుకొచ్చించది. అలాగే సోని గ్రూపునకు వాటాలను విక్రయించడం ద్వారా రామోజీ గ్రూప్ కు సుమారు 2400 కోట్ల రూపాయల వరకు సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఒప్పదం కనుక ఖరారైతే, దేశంలోనే అతిపెద్ద డీల్ అవుతుందని బిజినెస్ స్టాండర్డ్ వ్యాఖ్యానించింది.

ఇక దేశవ్యాప్తంగా స్టార్, జీ చానళ్లను ఎదుర్కోవడానికి సోని ఈ నిర్ణయానకి వచ్చిందని సమాచారం. అయితే సోని సంస్థ అదికార ప్రతినిదికాని, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, ఎమ్.డి కిరణ్ గాని ఈ విషయంపై ప్రస్తుతం స్పందించటానకి ఒప్పుకోవటం లేదు. ఇక ఈనాడు గ్రూప్ ఈ పెట్టుబడలు ఆహ్వానించటానకి కారణం ఇప్పటికే ఈనాడు గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన కంపానీ గ్రూప్ ను బయటకు పంపించివేయడానికే అని ఆ పత్రిక తెలిపింది.

ఇక కంపానీకి పెట్టిన రెండు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులకు గాను నలభై శాతం వాటాను ఇచ్చారు. ఇప్పుడు ఆ వాటాను సోనికి విక్రయించడం వల్ల ఈటివి ఛానల్ లో వార్తల స్లాట్ ను నిబంధనల ప్రకారం ఎత్తివేయవలసి ఉంటుందని అంటున్నారు. అయితే రామోజీ గ్రూప్ ఈటీవి-2 ని సోనికి విక్రయించడం లేదు. కాబట్టి వార్తా ఛానెల్ కి సమస్య రాదు.

Source: thatstelugu.oneindia.in

Sony set to buy ETV's channels

Biggest media deal for $500-600 million to give Sony a bigger share of regional pie.

In what will be the largest media deal in India, Multi-Screen Media (MSM), which runs Sony Television in India, is set to buy Ramoji Rao-owned Eenadu TV’s (ETV’s) bouquet of 11 regional channels.

According to four independent sources, the talks are at an advanced stage and an announcement is expected shortly.

The deal size is expected to be close to $500-600 million (Rs 2,250-2,400 crore), eclipsing transactions such as Disney’s strategic investments in UTV, Turner’s buyout of NDTV Imagine from New Delhi Television and Viacom teaming up with Network18, which runs India’s version of CNBC.


MEDIA MATTERS
(Top deals in media and entertainment)
Company Investment Deal size
TimeWarner  NDTV Imagine 126.5
Disney UTV Software 220 approx
News Corp ABP and Asianet NA 
Bloomberg UTV news channel NA
Standard Chartered
IL&FS Asia Fund
DEN Networks Ltd 400.58
Oman Investment Fund,
3i Group Plc
NEO Sports Broadcast
Pvt Ltd
51.6
Temasek, New Vernon,
Kotak, New Silk Route
9X media 150
Nimesh Kampani Ushodaya Enterprises 578
Source: VC Edge & industry sources                 (figures in $ million)
The deal will give Sony a nationwide regional platform to take on rivals STAR and Zee.

Apart from having a pan-India presence, ETV’s infotainment channels also reach out to Indian diaspora in the US, providing digital entertainment via ETV Telugu, ETV Bangla and ETV Gujarati entertainment channels.

ETV’s regional channels have had an interesting model of clubbing news and entertainment.

The MSM spokesperson told Business Standard the “company will not comment on market speculation”. Eenadu Group’s Managing Director and Ramoji’s son, Kiron Rao, did not respond to email queries. The group’s media officer refused to comment.

E&Y is believed to be advising Eenadu.

Sources in the know say the deal will be in tranches and will allow investors such as Nimesh Kampani of JM Financial to exit. In 2008, Kampani, one of India’s savviest deal makers, came on board of Ushodaya Enterprises, the publisher of the flagship, Eenadu, the largest-selling Telugu newspaper. Ushodaya also doubles up as the holding company of Ramoji Rao’s media empire spanning newspapers and television.

Kampani’s structured transaction — which included debt and equity — valued at Rs 2,600 crore for close to 40 per cent stake had helped Ushodaya wriggle out of another deal the Rao family was planning with private equity player Blackstone Group to sell a 26 per cent stake for $275 million (Rs 1,080 crore).

Ushodaya has three divisions, Eenadu Publications, ETV Network and pickles and food company Priya Foods. The group has diversified rapidly into film and TV production and distribution, financial services, garment manufacturing and hospitality. It also owns a 1,600-acre Ramoji Film City.

According to analysts, for the nine months ended December 2010, Ushodaya reported a profit after tax of Rs 13.2 crore on an income of Rs 1,062 crore. TV contributed 37 per cent revenue. The publication division contributed the highest (40 per cent).

With Sony buying the TV business, Ushodaya will get money, which will help the Eenadu promoters redeem preference shares and debentures, giving Kampani an exit option.

Blackstone and Kampani were embroiled in a political jam, which even led to Kampani being hounded out of the country after lookout notices were issued against him at major international airports.

Eenadu is a fierce competitor of Sakshi, the newspaper of former chief minister Y S R Reddy’s son, Jagan Reddy. But a deal with Sony would have violated the 26 per cent foreign direct investment cap on news operations. Which is why, sources said, Eenadu had to phase out its hourly news capsules.

ETV also runs a 24-hour Telugu news channel, ETV2, which will not be sold to Sony.

Sources said for news TV, talks with TV 18 might be revived. TV 18, said a source, was approached first for the entire TV business. The talks did not fructify.

MSM runs six channels, Sony TV, SAB TV, Set Max, Sony Pix, AXN and Animax, and has a 15 per cent market share in the Hindi general entertainment space. From a premier position, it has slipped, hamstrung by an ongoing dispute with minority shareholders, inconsistent programming and a not-so-successful relaunch with Yash Raj Television.

Despite having some of the biggest properties — IPL, Kaun Banega Crorepati and Indian Idol — Sony has been edged out of the top three slots, especially by late entrant Viacom 18, which launched the hugely popular Colors in 2008.

Sony is no stranger to doing deals to scale up. It bought Sri Adhikari Brothers (SAB) TV to have a second-line general entertainment channel to compete with STAR One. Hindi comedy and light entertainment channel SAB TV has been a huge success.

But Sony’s regional play has been small. It branched out in the Bangla general entertainment space, but with limited success. Eenadu, therefore, gives it the right platform to be a formidable national and regional broadcaster.

According to a Ficci-KPMG report, regional general entertainment accounts for over 25.06 per cent of the Rs 8,000 crore-plus TV advertising pie with a viewership share of 27.3 per cent.

Sony’s competitors STAR India and Zee Entertainment have a strong presence in the regional general entertainment space. STAR has STAR Vijay, STAR Pariah, STAR Balsa and Asianet. Zee, on its part, has eight regional channels.

Source: www.business-standard.com

Wednesday, July 13, 2011

ఈ వారం జీఆర్పీ రేటింగ్స్‌(28వ వారం)

1)  TV9 - 150           గత వారం-127
2)  TV5 - 90             గత వారం-75
3)  NTV - 78            గత వారం-48
4)  HMTV   - 72       గత వారం-59
5)  ETV2   - 65         గత వారం-52
6)  SAKSHI TV - 65 గత వారం-80
7)  ZEE24GANTALU - 47 గత వారం-36
8)  MAHAA TV - 37 గత వారం-27
9)  ABN   - 27           గత వారం-22
10) STUDIO N - 26  గత వారం-23
11) I NEWS     - 21   గత వారం-15
12) T NEWS    - 27   (only in hyd) గత వారం-9
13) GEMINI NEWS - 03 గత వారం-03
 
Source: www.porutelangana.com

సగం పాత - సగం కొత్త ‘ఫిఫ్టీ - ఫిఫ్టీ’ గేమ్‌షో

కాన్సెప్ట్ - యాంకరింగ్ - నిర్మాత - దర్శకుడు’ అనే ట్యాగ్‌తో అనతికాలంలోనే పాపులర్ అయిన ఓంకార్ చాలాకాలం తరువాత మాటీవీలో ‘ఫిఫ్టీ - ఫిఫ్టీ ఇట్స్ మై షో’తో సోమ, మంగళవారాల్లో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు గేమ్ షో నిర్వహిస్తున్నాడు. గతంలో మాటీవీలోనే ‘అదృష్టం’ అన్న గేమ్ షో ప్రారంభించి కొన్ని ఎపిసోడ్స్ నడిపించిన ఓంకార్ సడెన్‌గా క్లోజ్ చేశాడు. ఇప్పుడు అదే షోను కొత్త పంథాలో రూపకల్పన చేసి ‘ఫిఫ్టీ - ఫిఫ్టీ’గా తెరపైకి తెచ్చాడన్న సంగతి రెగ్యులర్ వీక్షకులు ఇట్టే తెలిసిపోయింది.

ఈ షో ప్రసారాలు ప్రారంభం కాకముందే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ‘ఇట్స్ మై గేమ్ షో’ అంటూ మాటీవీలో కొన్ని ఎపిసోడ్స్ చేయడంతో ఓంకార్ ‘ఇప్పుడు ఇది నా షో’ అంటూ డైలాగులు కొట్టినా అంత కిక్ నివ్వడంలేదు. గేమ్ షోలలో డబ్బును గెలుచుకోవడం ముందుకు వెళితే కోల్పోవడం సహజంగా కనిపిస్తుంది. ఇదే సూత్రంతో ఓంకార్ ఈ షో ఫార్మేట్ చేశాడు. అందుకే పార్టిసిపెంట్స్ ఒకసారి ఎంత గెలుచుకుంటాడో అంతే మొత్తాన్ని మైనస్ కాకుండా తరువాత ఆడాల్సి ఉంటుంది.

‘అదృష్టం’ షో మాదిరిగానే ఇక్కడ బాక్సులకు బదులుగా దిక్కులు ఎంచుకుని దానిలో ఎవౌంట్ వచ్చిందీ లేనిదీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో కుబేరుడు బొమ్మ ఛాన్స్ కూడా పార్టిసిపెంట్‌కి లభిస్తుంది. దానిలో ఏదైనా లభిస్తే సరేసరి లేకపోతే కుబేరుని నవ్వుకు పార్టిసిపెంట్ నవ్వు కలుపుకోవాల్సి ఉంటుంది. గేమ్ షో సెట్ ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు ఓంకార్ షోలకు ఎప్పుడూ ప్లస్‌గా కనిపించడం కామనే. ఫిఫ్టీ ఫిఫ్టీ గేమ్ షో పేరుకు తగ్గట్టుగానే సగం పాత సగం కొత్తల కలయిక ఫార్మేట్‌లో కనిపించడం ప్రధానంగా ప్రేక్షకులకు షో పట్ల ఆసక్తిని చంపేస్తుంది.

ఓంకార్ ఏ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించినా పార్టిసిపెంట్‌ని హైపర్ టెన్షన్‌కి గురి చేయడంలో సిద్ధహస్తుడు. పార్టిసిపెంట్ మీద మీదకు వెళ్తూ వారిని విసిగిస్తూ పార్టిసిపెంట్ కోరుకున్న దానిని రివీల్ చేయడంలో ‘వన్ సెకన్’ అంటూ ఆపేస్తూ గేమ్ షోను నడిపించడం ఓంకార్ స్టైల్. ఇది మొదట్లో అటు పార్టిసిపెంట్‌కి ఇటు టెలివిజన్ సెట్‌ల ముందు కూర్చున్న వారికి మంచి కిక్ నిచ్చినా ఇప్పుడది పరమ బోర్‌గా తయారైంది.

ఫిఫ్టీ - ఫిఫ్టీ గేమ్ షోలో పాల్గొనే పార్టిసిపెంట్ తనతోపాటు సహాయకులను తెచ్చుకోవచ్చును. అందరిని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఓంకార్ షోను నడిపిస్తున్నా ఈ షో పెద్దగా ఆకర్షించలేక పోతుందనే చెప్పాలి. ఈ షో మొదటి ఎపిసోడ్ నుండి సెలబ్రిటీల మీదే ఆధారపడిపోవడంతో సాధారణ ప్రేక్షకులు షోకు అంతగా లింక్ కాలేక పోతున్నారన్నది వాస్తవం.

ఫిఫ్టీ - ఫిఫ్టీ ఇట్స్ మై షో’ పేరు తగ్గట్టుగానే ఉంది. అందుకే పార్టిసిపెంట్ చివరగా మైనస్ ఎవౌంట్‌లో వుంటే ఓంకార్ కోరికకు ప్రామిస్ చేయాలి. ఒకవేళ ప్లస్ ఎవౌంట్‌లో వుంటే ఒక కన్నీటి గాథను చూపించి గెలుచుకున్న దానిలో ఇష్టమున్నంత దానం చేయాలి. ఇది ఈ షో ప్రత్యేకతని చెప్పాలి. బహుశా అందుకే కాబోలు ఓంకార్ ఏరికోరి సెలబ్రిటీలనే షోకు ఎంచుకుంటున్నాడనిపిస్తుంది. సాధారణ పార్టిసిపెంట్ అయితే ఎక్కువ మొత్తాన్ని ఇవ్వడేమోనన్న అనుమానం కాబోలు. ఏదేమైనా షోను ఎంత పర్‌ఫెక్ట్‌గా నిర్మిస్తున్నా నీరసంగానూ గతంలో చూసేశామన్న ఫీలింగూ కలగక మానడం లేదు.

Source: www.andhrabhoomi.net

వీక్షకుల తీర్పు

హాయిని గొలిపే..
ప్రతి సోమవారం రాత్రి 9.30 ని.లకు ప్రసారమవుతున్న ‘పాడుతా తీయగా..’ ఎంతో హాయిని గొలుపుతోంది. అంతా తానై అన్నిటా తానై స్వరాల తప్పొప్పులను సరిచేస్తూ చిరుగళాల సంగీత సాహిత్య విన్యాసాలకు ఆలంబనగా నిలుస్తూ బాలు ఈ కార్యక్రమాన్ని రంజింపజేస్తున్నారు. ఎవరినీ ఎక్కడా నొప్పించకుండా కార్యక్రమాన్ని రక్తి కట్టించే విధానం బాగుంటోంది. కొత్త టెండర్లను పిలుస్తున్నారు. సంతోషం. ఈ సిరీస్‌లో అయినా అన్నీ కొత్త ముఖాలు, కొత్త గళాలు, కొత్త ప్రయత్నాలు సాగుతాయని ఆశిస్తున్నాం. వచ్చే సిరీస్‌లో సీనియర్లను ఆపి అంతా జూనియర్లతో సంగీత యుద్ధం చేయిస్తే చూడాలని ఉంది.
-కొంగర ఉమామహేశ్వరరావు (చెంచుపేట)

ఒకే ఒక్క ఛానల్
ఛానల్ పేరుతోపాటుగా ‘తెలుగు’ అని అక్షరాలలో వేసే ఒకే ఒక్క ఛానల్ ‘జీ తెలుగు’ ఛానల్ మాత్రమే. వీరిదే అయిన జీ వార్తా ఛానల్ పేరుతోపాటుగా ‘24 గంటలు’ అని తెలుగు అక్షరాలలో వేస్తున్నారు. జీ ఛానల్ యాజమాన్యం తెలుగు వారిది కాకపోయినా ‘తెలుగు’ అని పేర్కొంటున్నారు. కాని తెలుగువారి యాజమాన్యాలలో ఉన్న తెలుగు ఛానెళ్ల లోగోలతోపాటు ‘తెలుగు’ అని పేర్కొనే ఛానల్ ఒక్కటి కూడా లేదు. 
-ఎన్.మధుసూదనరావు (హైదరాబాద్)

Source: www.andhrabhoomi.net

శ్రీరస్తు - శుభమస్తు...

‘పెళ్ళి..’ ఈ రెండక్షరాల మాట వింటేనే చాలు ఎలాంటి ప్రవృత్తిగల మనిషైనా కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతాడు. ఇలా గతంలోకి వెళ్లడం పెళ్లైన వాళ్లు చేసే పని. పెళ్లి కానివాళ్లయితే కాబోయే కల్యాణం గురించి కలలు కంటూ ఉంటారు. ఇలా మానవ జీవితంలో దాదాపు అందరితో మమేకమై పోయిన ఈ మహత్తర అంశాన్ని ఆలంబనగా తీసుకుని ‘పెళ్లి పుస్తకం’ పేరిట మాటీవీలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఓ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో ప్రతి వారం ఓ ప్రముఖుని పెళ్లి ముందు, అనంతర అనుభవాల్ని వారి జీవిత భాగస్వామితో కలిపి ప్రేక్షకులతో ముచ్చటించడం జరుగుతోంది. ఈ పద్ధతి అధిక శాతం చూపరుల్ని ఆకట్టుకుదేనైనా, దీనికి మరింత వ్యక్తిగత నైపుణ్యం జోడిస్తే ఇంకా వీక్షకులకి చేరువయ్యే అవకాశం ఉంది.

వివిధ విభాగాలు
కార్యక్రమ తీరు ప్రకారం ‘కల్యాణ తాంబూలాలు’ శ్రీరస్తు - శుభమస్తు, పెళ్లైన కొత్తలో, తర్వాత సంఘటనల భాగాలతో ఉంటుంది. ఎవరైనా సరే.. తమతమ జీవితాల్లో ఉన్న మధురమైన ఘట్టాలనే గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తారు. కాస్త అరుచికరమైన అనుభూతైనా సరే.. బహిర్గతపరచడానికి మానవ నైజం ఒప్పుకోదు. ఇందులోనూ అంతే. అయితే కొంత వైవిధ్యంగా వాటినీ ఇందులో స్పృశించే దిశగా పాక్షికంగా సాగింది. ఇది వారి జీవితంలోని సున్నితమైన అంశాల్లోకి తొంగి చూడటం ప్రేక్షకుల ఉద్దేశం కాకపోయినా అలాంటి సందర్భాలు వీరికొస్తే ఎలా చలిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి అన్న దానికి ఇది ఓ సూచిక అవుతుంది. ఈ కార్యక్రమ పరంపరలో ఈ మధ్య ప్రముఖ దర్శకుడు బి.గోపాల్, మిమిక్రీ కళాకారులు హరికిషన్ దంపతులు పాల్గొన్నారు. ఇద్దరూ జన సామాన్యానికి తెలిసినవారే. కానీ బి.గోపాల్ వారి సమకాలీన దర్శకుల్లా ఎక్కువగా తెర ముందుకు వచ్చే వ్యక్తి కాదు కనుక, ఆయన జీవితంలో వచ్చిన వెలుగునీడలు చర్చించడం కాస్త కొత్త. ఇద్దరి ప్రముఖుల జీవితాల్లోనూ వారివారి రంగాల్లో పైకి రావడానికి సతీమణులు ఇచ్చిన తోడ్పాటు సహజమైనదే అయినా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాడక పరిస్థితులకు వెరవకుండా ముందుకెళ్లడం అభినందనీయం. ముఖ్యంగా హరికిషన్ కొచ్చిన ఆరోగ్యపర ఇబ్బందికి సకాలంలో తానున్నానని ముందు వెనుకలు చూడకుండా వారి భార్య ప్రొసీడవడం మార్గదర్శకంగా అనిపించింది. ఇది ఊరికి ఉపకారం కాకపోయినా సకాల ఆచరణ అని మాత్రం చెప్పవచ్చు.

ఓవర్ యాక్షన్ తగ్గిస్తే..
కార్యక్రమంలో చెప్పేవారు అరమరికలు లేకుండా (హరికిషన్ విషయంలో అసలు కన్నా నాటకీయత ఎక్కువ కన్పడింది. ఇది తగ్గిస్తే ఇంకా సహజంగా ఉండేది) చాలావరకు చెప్పినా, వ్యాఖ్యాత్రి కొన్నిచోట్ల చూపిన అతి స్పందన ఏ రకంగా చూసినా సమంజసం కాదు. తాను తన కాబోయే సహధర్మచారిణి ఫొటో తొలిసారి చూసినప్పుడు కరెంటు పోయి చీకటిగా ఉందని హరికిషన్ చెప్పినపుడు ‘అంటే చీకటిలో కారుచీకటిలో..’ అంటూ అతిగా నటిస్తూ అభినయించడం లాంటివి కార్యక్రమ ఫోకస్‌ని పక్కదారి పట్టిస్తుంది. ఇదంతా ఇలా ఇంటర్వ్యూ చేసేవారు కూడా స్వతహాగా నటీమణులో, నృత్య కళాకారిణులో లేదా ఇతర కళారూపాల ప్రసిద్ధులో కావడం వల్ల వచ్చిన తంటానా? అయినా సందర్భానికి తగినట్లు టాలెంట్‌ని నియంత్రించుకుంటేనే కార్యక్రమం ప్రేక్షక రంజకం అవుతుంది.

కథలిలా వెళ్లాల్సిందేనా?
అభివృద్ధి చెందేశాం.. అంతా ఆధునికమై, ఆలోచనల సరళీ మారిపోయింది... అంటూ తరచూ మనం సమాజంలో పలు వర్గాల నుంచి వింటూంటాం. కానీ ఇంకా తెలుగు సీరియల్స్ కథాగమనం తీరులో ఏమీ మార్పులేదు. ఎక్కడ వేసిన.. తీరులో ఉందనడానికి తాజా ఉదాహరణ ‘కుంకుమరేఖ’ (ఈటీవీలో రోజూ రాత్రి 7 గంటలకు వస్తున్నది) అనుకోని సందర్భాలలో జరిగే ఊహించని పరిణామం వల్ల పరాజితులమై పోయామన్న భావన వారి నుంచి తొలగించి అందరిలాగే వారూ ఉండాలన్న దిశగా సీరియల్స్ నడవాలి. లేదా సమకాలీన అంశాలను స్పృశిస్తూ వీలైతే అందులో ఎదురయ్యే సమస్యలకు ఆచరణ పూర్వక సూచనలు చేయాలి. ఇవేవీ లేకుండా అమ్మాయి అబ్బాయి ట్రాప్‌లో పడటం, మోసపోవడం, మరో వ్యక్తి ఆమెకోసం అర్రులు చాచడం, ఒప్పుకోకపోతే వీలైనంత విలనీని ప్రదర్శించడం వగైరా నలిగి, అరిగి, అర్థంలేని సంఘటనల సమాహారాలతో సీరియల్స్ నడపడం ఎవరి విజ్ఞత పరీక్షించడానికో తెలియడం లేదు. ఇంచుమించుగా ఇదే తీరులో నడుస్తున్న ఈ సీరియల్‌కు ప్రముఖులు నేపథ్య బాధ్యత వహించడం? ఉదాహరణకు ఏదైనా ఓ మాట వింటే అది అందరికీ తెలియజెప్పేవరకు మనసూరుకోని మనస్తత్వం కల పాత్రల్ని ఓ వెయ్యికి పైగా వివిధ సృజనాత్మక కార్యక్రమాల్లో చూసేశాం. మళ్లీ ఇందులో ప్రవేశపెట్టిన ఆ స్వభావపు పాత్ర ఎవరిని అలరిస్తుంది? అలాగే ఫలానా వారి అబార్షన్ కాగితం కావాలని వచ్చిన వ్యక్తికి ఆ పనిని లంచం ఎరచూపి ఆస్పత్రిలో సంపాదించడం వంటివి ఈ ధారావాహిక భాగంలో చూపినంత సులువుగా కుదరదేమో?! ‘ఆడపిల్ల సున్నితంగా ఉండాలి తప్ప మరీ ఇంత సున్నితంగానా?’ అన్న సంభాషణ మాత్రం అప్పటి స్థితికి సరిపోయింది. ప్రాచీనతని, సంప్రదాయాన్నీ గౌరవించడంలో తప్పు లేదు. కానీ అంత మాత్రంచేత ఆధునికతనీ, ప్రస్తుత కాలపు పోకడల్నీ పట్టించుకోకపోవడం బావుండదు.

తప్పుల్లేకుండా మాట్లాడలేమా?
ఈ మధ్య అమెరికాలో జరిగిన తెలుగు సంబరాలకు ముఖ్య అతిథిగా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ చానల్, పత్రికాధిపతి వెళ్లారు. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో అక్కడి తెలుగు మహిళ ఒకామె ‘మేం స్వరాష్ట్రానికి ఇంత దూరంలో ఉండి తెలుగు భాష పట్ల మమకారంతో పిల్లలకి తప్పుల్లేకుండా మాట్లాడటం, చదవడం నేర్పుతున్నాం. కానీ తెలుగు రాష్ట్రంలో ఉండి రాజధాని వేదికగా నడిచే ఛానల్స్‌లో వస్తున్న యాంకర్ల యాక్సెంట్, అక్షరాల్ని తప్పుల్లేకుండా చదవని విధానంగానీ చూస్తూంటే బాధేస్తోంది. అలా కాకుండా తప్పుల్లేకుండా భాషని పలికే యాంకర్లే తెలుగు నేలపై మీకు దొరకడం లేదా? అని ఎంతో ఆవేదనతో అడిగారు. అందుకా ఛానల్ అధిపతి నిస్సంకోచంగా ‘దొరకడం లేదు..’ అని చెప్పి తన చానల్ కోసం పరిశీలించినప్పుడు అందరూ అనుకునే లోపరహిత ఉచ్ఛారణ గల యాంకర్ల కోసం చేసిన కృషి, అందులో విఫలమైన తీరు వివరించారు. ‘అందుకే రాజీపడిపోవల్సి వచ్చింది. వొత్తుల్లేకుండా భాష నుచ్ఛరించే వారే ఎక్కువ’ అని చెప్తూ, ‘మీరు కనుక ఇండియా వచ్చి ప్రోగ్రామ్‌లు చేస్తానంటే అవకాశం కల్పిస్తా’నంటూ ఆఫర్ కూడా చేశారాయన. ఈ కార్యక్రమం కూడా ఎబిఎన్ చానల్‌లో ప్రసారమైంది. దీన్నిబట్టి తెలుగు యాంకరింగ్ స్థితి ఎలా ఉందో తెలుస్తోంది. సువ్యవస్థితమైన నట శిక్షణాలయాలతోపాటు తెలుగునాట ప్రమాణాల కనుగుణంగా కార్యక్రమ వ్యాఖ్యానాలు చేయగల సమర్థతను అందించే సువ్యవస్థిత శిక్షణ కేంద్రాలు బాధ్యతగల వ్యక్తుల నుంచి ఏర్పడినప్పుడు గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదేమో?!

Source: www.andhrabhoomi.net