సినిమాకు కొబ్బరికాయ గుమ్మడికాయలతో అవినాభావ సంబంధం ఉంది. కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే గుమ్మడికాయ కొట్టి ఫినిష్ చేస్తారు. బుల్లితెర జోరందుకోవడంతో వెండితెరకు ఆదరణ కొంత తగ్గింది. సూపర్ డూపర్ హిట్ అంటేనే అదీ వౌత్ టాక్ వస్తేనే జనం థియేటర్లకు కదలి వస్తున్నారు. బావున్న సినిమాకు టికెట్ ధరను ఎంతైనా చెల్లించడానికి వెనుకాడటం లేదు. అందుకే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఏదో ఒకటో అరో మాత్రమే కోట్లను కొల్లగొడుతున్నాయి. ఇండస్ట్రీ కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తున్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. సీరియల్స్, స్పెషల్ స్టోరీస్, గేమ్స్ షోస్ వంటివి ఎన్ని వున్నా రోజుకి కనీసం మూడు సినిమాలను వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇదికాక ప్రతిరోజూ సినిమాను ఆసరాగా తీసుకుని ఎన్నో కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి నడుస్తుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్లు, డబుల్ ప్లాటినమ్ ఫంక్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఛానల్స్ దక్కించుకుని ప్రసారం చేయడంలో పోటీ పడుతున్నాయి. ఈ పరంపరలో న్యూస్ ఛానెల్స్ కూడా పోటీ పడటం విశేషం.
సినిమాలకు గవర్నమెంట్ ఇచ్చే నంది అవార్డులతో పాటు ప్రైవేటు పాపులర్ సంస్థలిచ్చే అవార్డుల ఫంక్షన్లు కూడా బుల్లితెరపై అలరిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లు గంటల కొద్దీ నడవడంతో ఛానల్స్‌కి చాలా టైమ్ కలిసి వస్తుంది. ఇలాంటి ఈవెంట్స్‌లో పాపులర్ స్టార్స్ ఎక్కువగా కనిపిస్తారు కనుక ఈ ఈవెంట్‌లను నిర్వహించడానికి, పార్టనర్లుగా వ్యవహరించడానికి రేటింగ్ వున్న ఛానల్స్ విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈవెంట్ మా ఛానెల్‌లోనే ‘ఎక్స్‌క్లూజివ్’ అంటూ వేసుకోవడం వలన అభిమానులు, ప్రేక్షకులు టెలివిజన్ సెట్స్ ముందు కూర్చుండటంతో ఛానల్‌కి రేటింగ్ కూడా బాగా పెరుగుతోంది. ఈ రేటింగ్‌ల ఆధారంగా స్లాట్స్ అమ్ముకోవడంలో ఛానల్స్ సక్సెస్ అవుతున్నాయి.
ప్రధానంగా క్రేజీ స్టార్స్ ఆడియో ఫంక్షన్లను నిర్వహించడానికి ఛానల్స్ మధ్య పోటీ ఏర్పడుతోంది. ఈ తరహా ఫంక్షన్ల్లను ఎక్కువగా ‘మా టీవీ’ నిర్వహించడంలో సక్సెస్ అవుతోంది. నాగార్జున, చిరంజీవి కుటుంబ హీరోల ఫంక్షన్లు అయితే మాటీవీలోనే ప్రసారమవుతాయనే ముద్ర పడిపోయింది. ఆడియో ఫంక్షన్లు నిర్వహించడంలో నెంబర్ వన్ రేటింగ్ వున్న టీవీ-9 కూడా ముందుంటుంది. గతంలో ‘కొమరం పులి’ వంటి క్రేజీ కాంబినేషనల్స్‌తో తయారైన సినిమా ఆడియో ఫంక్షన్ నిర్వహించిన టీవీ-9 ఇటీవల అంతే ఉత్కంఠత కలిగిస్తూ ‘నాగవల్లి’ ఆడియో ఫంక్షన్‌ని ప్రసారం చేసింది. అగ్రహీరోల ఆడియో ఫంక్షన్లను అప్పుడప్పుడు నిర్వహించడంలో వార్తా ఛానెల్ టీవీ-9ది ప్రత్యేక స్టయిల్. ఎన్‌టివి కూడా ఇలాంటి ఫంక్షన్లను బాగానే నిర్వహిస్తుంది.
సినిమా వార్త లేదంటే వార్త ఛానల్‌కు కిక్ ఉండదనుకుంటారో ఏమో! ప్రతిరోజూ సినిమా వార్తను హెడ్‌లైన్స్‌లో పెట్టడమో.. వార్తల సమాహారాన్ని రూపొందించడంమో.. గ్యాసిప్ కబుర్లతో ప్రేక్షకులను వేడెక్కించడమో చేస్తూ వుంటాయి ఛానల్స్. శృతిమించిన వ్యాఖ్యానాలతో సినిమా వారిపై కామెంట్స్‌ని గ్యాసిప్స్ రూపంలో చెప్పేస్తూ వార్తా ఛానళ్లు రేటింగ్ పెంచుకోవాలని చూడటంలో వెండి తెర బాగానే ఉపయోగపడుతుంది. ‘వర్మ’ లాంటి డైరెక్టర్ సినిమా రిలీజ్ అంటే న్యూస్ మీడియాకు పండుగే. కాంట్రవర్సీలతో రోజుల తరబడి ఆ వార్త నడుస్తూనే ఉంటుంది.
మహిళల్లో 80 శాతం థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం మానేశారు. మిగతా 20 శాతంలో కూడా సినిమా బావుందని వౌత్‌టాక్ అదిరితేనే సినిమాకు వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా టార్గెట్ యూత్‌గా మారింది. లవ్, సెక్స్, క్రైం వంటి కథనాలతోనే ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయి. అందుకే సక్సెస్ రేటు పడిపోయి నూటికి ఒకటీ అరా విజయాలే కనిపిస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు కూడా బావుంటేనే ఆడుతున్నాయి. లేకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌కి వచ్చేస్తున్నాయి. మూడు పూటలా సినిమాలు వేసే ఛానల్స్ వారు కూడా పాత సినిమాల కంటే కొత్త సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే ఛానల్ రేటింగ్ దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పోటీ పడి కొత్త సినిమాల శాటిలైట్ రైట్స్ దక్కించుకోవాల్సి వస్తుంది. దూరదర్శన్ ఉన్నప్పుడు నిర్మాత ఫలానా సినిమా ప్రదర్శనకు ఇస్తానని అప్లికేషన్ పెట్టుకుంటే వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుని ఛానల్ వారు వారానికి ఒకటిగా ప్రసారం చేసేవారు. దానికి తగ్గ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఆ టైమ్‌లో నిర్మాతలు కూడా తమ సినిమాలకు రిపీట్ రన్ థియేటర్లలో వుండటం వల్ల ఛానల్‌కి ఇవ్వాలంటే ఇష్టపడేవారు కాదు. పైగా ఛానల్స్‌లో సినిమా వచ్చిందంటే ఇక అంతే! అనే పరిస్థితి. ప్రస్తుతం రిపీట్ రన్ అనేది ఊహలో కూడా లేదు. అదీగాక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ పోటీ పడి మరీ సినిమాలు కొనడానికి సిద్ధపడటంతో నిర్మాత అడిగినంత రేటును దక్కించుకుంటూ హ్యాపీగా అమ్మేస్తున్నాడు. శాటిలైట్ రైట్స్ కూడా ఈనాడు సినిమాకు మంచి బిజినెస్ మార్కెట్‌ని ఇస్తున్నాయి. బుల్లితెర విపరీతంగా వెండితెరను నష్టపరిచినా హిట్ సాధించిన సినిమాలు మాత్రం ఇటు వెండితెరపైనా అటు బుల్లితెరపైనా బాగానే బిజినెస్ చేసుకుంటున్నాయి. ఫర్వాలేదనిపించుకునే సినిమాలకు బుల్లితెర రైట్స్ కొంతవరకు ఊపిరి పోస్తున్నాయనే చెప్పాలి.

www.andhrabhoomi.net
No comments:
Post a Comment