ఇప్పుడొస్తున్న సినిమాలు, టీవీ సీరియళ్లను పెద్దవాళ్లతో కూర్చుని ఇంట్లో పిల్లలు కూడా సమానంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కొందరు మితిమీరిన క్రమశిక్షణతో పిల్లలు ఎక్కువగా చూసే కార్టూన్ నెట్‌వర్క్, పోగో లాంటి కార్యక్రమాలను తమ పిల్లలు చూడకుండా చేసి వాళ్లను క్రమశిక్షణలో పెట్టామని మురిసిపోతుంటారు. పిల్లలు తమకు సంబంధించిన ఛానల్ చూడనివ్వకుంటేనేమి... పెద్దవాళ్లు చూసే సీరియల్స్ చూసి అందులో ఉండే హింస, ద్వంద్వార్థపు మాటలు గుర్తుపెట్టుకుని తమ మెదళ్లకు ఎక్కించేసుకుంటున్నారు. మరకొంతమంది పిల్లలైతే టీవీ ముందు లేకపోయినా చెవి మాత్రం టీవీకేసి ప్రతి డైలాగ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
అక్కడిదాకా అయితే బాగానే ఉంటుంది. అలా ఎక్కువగా టీవీ చూసే చిన్నారులమీద ఈ మధ్య అమెరికాకు చెందిన పరిశోధక బృందం బోస్టన్ హాస్పిట ల్ మానసిక వైద్యుడు డాక్టర్ హెర్నన్ చేసిన పరిశోధనలలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. చిన్నారులు ఎక్కువగా చూసే టీవీలో పాత్రల ప్రభావంతో వాళ్లు చిన్నవయసులోనే శృంగార కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పాఠశాల స్థాయి పరిధిలోనే సెక్స్ అంశాలు ప్రస్థావించుకోవడం గమనించారు. ఇది వైరస్‌లా మరింత ముదిరి విశ్వవ్యాప్తంగా వ్యాపించకముందే తల్లిదండ్రులకు వారు కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు...
అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్‌లో సీనియర్ మానసిక వైద్య నిపుణుడైన డాక్టర్ హెర్నన్ తన పరి శోధక బృందంతో కలిసి 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులలో 754 మందిని పరిశీ లించారు. వాళ్లను రెండు గ్రూపులుగా విడదీసి జూనియర్స్, సీనియర్స్‌గా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు.ఆ తర్వాత వాళ్లను విడివిడిగా ఇంటర్వ్యూ చేసి వారి నుంచి అనేక ఆశ్చర్యం గొలిపే సంగతులను తెలుసుకున్నారు.
చెడు ప్రభావమే ఎక్కువ...
ముందుగా వాళ్లు ఎక్కువగా చూసే సీరియల్స్... అందులో ఉండే పాత్రలు. ఆ పాత్రలు వాళ్లను ఎందుకు ఆకర్షించాయి లాంటి ప్రశ్నలలో పిల్లలు తెలివిగా, గడుసుగా సమాధానాలు చెప్పారు. వాళ్లలో కొందరు పిల్లలు కొందరు అంకుల్స్ చెడు తిరుగుళ్ల గురించి చెప్పారు. మరికొన్ని సీరియల్స్‌లో వచ్చే దుష్టపాత్రలు అభినయించే నటన, వాళ్ల మేనరిజమ్స్, తాము కూడా స్కూల్లో ప్రాక్టీస్ చేస్తుంటామని మరి కొందరు చెప్పారు. కొందరు టీవీలలో వచ్చే యాక్షన్ చిత్రాలలో హీరో చేసే సాహసాలు చూసి తాము కూడా అలానే చేద్దామని కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నామన్నారు. మొత్తంగా చూస్తే వాళ్లు నేర్చుకున్న దానిలో మంచి కన్నా చెడే ఎక్కువగా ప్రభావం చూపిందని తేలింది.
మన దేశంలోనూ...
ఇటువంటి సంస్కృతి మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే పాకుతోంది. ఇప్పుడు సీరియళ్లు సినిమా ఫక్కీలో సాగిపోతున్నాయి. దీనికి తోడు రియాల్టీ షోల పేరిట వచ్చే డాన్స్ ప్రో గ్రామ్స్ రికార్డింగ్ డాన్సులను తలపి స్తున్నాయి. వెనకటి రోజుల్లో ఏ అర్థరాత్రో, అపరాత్రో జాతర్లలో గుట్టుగా చిన్నపిల్లలు లేకుండా చూసుకుని రికార్డింగ్ డాన్సులను నిర్వహించేవారు. ఇప్పుడు రియాల్టీ షోల పుణ్యమా అని ప్రతి ఇంట్లో పిల్లలు బాహాటంగానే చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో లేడీ డాన్సర్లు వేసుకొచ్చే డ్రెస్సులు సినిమాలలో వాంప్ లు కూడా వేసుకోరేమో అనిపిస్తుంది. ఇటువంటి విష సంస్కృతి దేశమంతటా పాకిపోతోంది. పిల్లలు చదువుకోవడానికి చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల పుస్తకాలు ఉండేవి. ఈ రోజుల్లోనూ అవి ఉన్నా ఎంత మంది తల్లిదండ్రులు వాటిని చదివిస్తున్నారో ఒక్కసారి ఆత్మావన పరిశీలన చేసుకోవాలి.

Source: www.suryaa.com
saraina antharmadhanam nd qstn to all parents
ReplyDelete