Wednesday, December 29, 2010

రాణిస్తున్న టీవీ కళాకారులు

కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామిరెడ్డి వాఖ్య
సందడిగా సినీ గోయర్స్ బుల్లితెర 
అవార్డుల ప్రధానోత్సవం
ఈటీవీకి భారీగా పురస్కారాలు
వెండితెరకు దీటుగా బుల్లితెర కళాకారులు రాణిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అసోసియేషన్ ఆరో వార్షిక బుల్లితెర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ఔత్సాహిక కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలని, అప్పుడే వారు రాణించేందుకు అవకాశముందన్నారు. సినీ గోయర్స్ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీఎన్‌వరదాచారి, బి. కిషన్‌ల నేతృత్వంలో టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని కాలపరిషత్ అధ్యక్షుడు కొండల్‌రావు, సుబ్బా రావు, దశరథరామిరెడ్డి, అల్లూరి సుబ్బారావు, ఏల్చూరి, గజల్ శ్రీనివాస్‌లతో పాటు సినీ తారలు సాయికుమార్, కవిత, గీతాంజలి, అర్చన తదితరులు పాల్గొన్నారు. సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రదానం చేసే జీవిత సాఫల్య పురస్కారాన్ని 2009వ సంవత్సరానికి దూరదర్శన్ న్యూస్‌రీడర్‌గా సుపరిచితుడైన శాంతిస్వరూప్‌కు  అందించారు. వివిధ కేటగిరీల్లో ఈటీవీకి  చాలా అవార్డులు దక్కాయి. ఈటీవీ 'వావ్' కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు సాయికుమార్ ఉత్తమ పురుష యాంకర్‌గా అవార్డు లభించింది. ఈటీవి 'డీ3' యాంకర్ ఉదయభానుకు ఉత్తమ మహిళా యాంకర్‌గా అవార్డులు దక్కాయి. ఉత్తమ నటి అవార్డునకు మంజుల (చంద్రముఖి ఫేం) ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా రాధాకృష్ణ (తూర్పు వెళ్లే రైలు), గీత రచనకు అనంత శ్రీరాం (తూర్పు వెళ్లే రైలు), ఉత్తమ నేపధ్య గాయకుడిగా గజల్ శ్రీనివాస్ (అభిషేకం), ఉత్తమ గాయనిగా ప్రణవి (తూర్పు వెళ్లే రైలు), ఉత్తమ కెమెరామెన్‌గా వంశీ (తూర్పు పడమర), ఉత్తమ మేకప్‌మెన్‌గా అబ్బాస్ (తూర్పు పడమర), స్పెషల్ జ్యూరీ అవార్డుకు కీర్తి (తూర్పు పడమర)లు ఎంపికయ్యారు. వివిధ ఇతర టీవీ కళాకారులకు సైతం పలు అవార్డులు లభించాయి.

Source: www.eenadu.net

No comments:

Post a Comment