Tuesday, December 28, 2010

బేతంచెర్లలో సయ్యారే.. సయ్యారే..

కర్నూలు, బేతంచెర్ల, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి జానపద గేయాలు పాడే ప్రతిభను వెలికితీసేందుకు సయ్యారే..సయ్యారే టీవీ పొగ్రాం నిర్వహిస్తున్నట్లు ఐ టీవీ ఛానల్‌ నిర్వాహకులు తెలిపారు. బేతంచెర్ల పట్టణంలో స్థానిక శిశుమందిర్‌ చెందిన విద్యార్థులు గాయత్రీ, షక్రిత, సాయిశ్రీవల్లి, శ్రీదేవి, లావణ్య, లక్ష్మి, ప్రసన్నలు జానపద గేయాలు పాడే దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా టీవీ ఛానల్‌ నిర్వాహక డైరెక్టర్‌ పత్తిపాటి రమణకర్‌రావు మాట్లాడుతూ మా ఛానల్‌ ప్రాముఖ్య ఉద్దేశ్యం ఆర్థిక పరిస్థితులు సరిగా లేని పేద విద్యార్థులను జానపద కళాకారులుగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటునందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో షూటింగ్‌ చూసేందుకు పట్టణ ప్రజలు అధికంగా తరలివచ్చారు. 

 

Source: www.eenadu.net

No comments:

Post a Comment