Monday, December 27, 2010

31న టీవీ ప్రసారాలకు ఎన్ బీ ఏ సూచన

తెలంగాణ అంశంపై డిసెంబర్ 31న శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల కవరేజ్ సమయంలో ""ఆచితూచి వ్యవహరించాలి'' అని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్ బీ ఏ) వార్తా చానళ్లకు విజ్ఞప్తి చేసింది.

దానికి సంబంధించి ప్రసారం చేసే వార్తలు సంచలానత్మకంగా, రెచ్చగొట్టే విధంగా ఉండరాదని ఎన్ బీ ఏ సభ్యులుగా ఉన్న ఎడిటర్లందరికి అది ఒక ఎడ్వయిజరీ పంపింది. ఎన్ బీ ఏ ఒక స్వీయ నియంత్రణ సంఘంగా పనిచేస్తోంది. 

వారు ప్రసారం చేసే సమాచరం ప్రజాభిప్రాయ నిర్మాణంపై ప్రభావం చూపుతుందనే సంగతి గుర్తుంచుకోవాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. నైతిక సూత్రాలు, ఎప్పటికప్పుడు జారీ అయ్యే నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి శ్రీకృష్ణ కమిటీ నివేదికను ప్రసారం చేయాలని ఎన్ బీ ఏ పేర్కొంది. 

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సంబంధించిన అన్ని వార్తలు నివేదికలో అంశాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని, హింసాత్మక సంఘటనలు, ఆందోళనలు, ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాలు ప్రసారం చేయరాదని, నివేదికపై ఆందోళనలు లేదా సంబరాల తాలూకు ఏదేనీ దృశ్యాలను ప్రసారం చేయరాదు లాంటి మార్గదర్శకాలను సూచించింది. 

అవసరమైన పక్షంలో పరిశీలించేందుకుగాను స్క్రిప్టులతో సహాశ్రీకృష్ణ నివేదికకు సంబంధించిన ప్రసారమైన కార్యక్రమాలన్నింటిని భద్రపరచాల్సిందిగా సైతం బ్రాడ్కాస్టర్లను ఎన్ బీ ఏ విజ్ఞప్తి చేసింది.

Source: www.apweekly.com

2 comments: