మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈటీవీలో శనివారం 9.30 గంటలకు ప్రసారమవుతున్న ‘జీన్స్’ కింగ్ ఆఫ్ గేమ్ షోస్ పేరుకు తగ్గట్టుగానే రూపొందుతోంది. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యానం మరింత జోష్‌ని అందిస్తోంది. మొదట్లో సాధారణ ప్రేక్షకులతో మొదలైన గేమ్ షో కాస్త రానురాను సినీ ప్రముఖులకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇటీవల ప్రసారమైన కృష్ణ భగవాన్, రఘుబాబు కలిసి ఆడిన ఎపిసోడ్, అల్లరి నరేష్ ఆడిన ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయని చెప్పవచ్చు.
ఈ గేమ్ షో నిర్వహణకు నిర్వాహకులు కాస్త కష్టపడక తప్పదని తెలుస్తుంది. ఎందుచేతనంటే జీన్స్ అని పేరు పెట్టినందుకు మానవులు - వారి మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఉండే విధంగా రౌండ్స్ ప్లాన్ చేశారు. దాంతో ఈ షో నిర్వహించాలంటే మానవ వనరులు ఎక్కువే కావాలి. అవే గేమ్ షోలో ప్రశ్నలు - జవాబులుగా కనిపిస్తాయి. అందుచేత జీన్ షోకు ప్రశ్న జవాబులుగా ఎంతోమంది కుటుంబ సభ్యులు వచ్చి స్క్రీన్‌పై కనపడటమే కాకుండా వచ్చిన సెలబ్రిటీతో మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. అభిమాన నటులను కలుసుకోవడమే కాదు వారు కూడా గేమ్ షోలో పాల్గొనడం ఆనందంగా ఫీలవుతున్నారు.
షో విషయానికి వస్తే
మొదటి రౌండ్‌గా ‘సేమ్ టు సేమ్’ అంటూ కొంతమంది తల్లిదండ్రులను పిల్లలను (వేర్వేరు కుటుంబాలకు చెందిన) నిలబెట్టి గుర్తించాలి. అలా గుర్తించలేకపోతే పార్టిసిపెంట్‌కి మొదటిగా ఇవ్వబడిన నలభై వేల నుండి పదివేలు చొప్పున పోగొట్టుకుంటాడు. గుర్తించగలిగితే సుమ నుండి రాబట్టుకుంటాడు. అంటే ఆట నలభై వేలతో మొదలౌతుంది. రెండవ రౌండ్‌గా సెలబ్రిటీ రౌండ్‌లో ప్రముఖుల ఫొటోలతో వారి పిల్లలనో పెద్దలనో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది.ఈ గేమ్ షో నిర్వహణకు నిర్వాహకులు కాస్త కష్టపడక తప్పదని తెలుస్తుంది. ఎందుచేతనంటే జీన్స్ అని పేరు పెట్టినందుకు మానవులు - వారి మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఉండే విధంగా రౌండ్స్ ప్లాన్ చేశారు. దాంతో ఈ షో నిర్వహించాలంటే మానవ వనరులు ఎక్కువే కావాలి. అవే గేమ్ షోలో ప్రశ్నలు - జవాబులుగా కనిపిస్తాయి. అందుచేత జీన్ షోకు ప్రశ్న జవాబులుగా ఎంతోమంది కుటుంబ సభ్యులు వచ్చి స్క్రీన్‌పై కనపడటమే కాకుండా వచ్చిన సెలబ్రిటీతో మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. అభిమాన నటులను కలుసుకోవడమే కాదు వారు కూడా గేమ్ షోలో పాల్గొనడం ఆనందంగా ఫీలవుతున్నారు.
షో విషయానికి వస్తే
మూడవ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. దీంట్లో అతి పెద్ద కుటుంబాన్ని ప్రేక్షకులకు వారి మధ్య రిలేషన్స్‌తో పరిచయం చేస్తారు. వారిలో ఎవరో ఇద్దరిని ఒకచోట నిలబెట్టి వారి మధ్య సంబంధాన్ని పార్టిసిపెంట్ చెప్పాలి. కరెక్ట్‌గా చెబితే లక్ష వస్తుంది. తప్పు లేదా ఒప్పు తెలుసుకోవాలంటే సుమకు ఐదువేలు ఇవ్వాలి. ఇక ఆఖరి రౌండ్‌గా ఒకే కుటుంబానికి చెందిన పెద్దలను పిల్లలను జత చేయాలి. దీనిని చేయడానికి పార్టిసిపెంట్‌కి 100 సెకన్లు 80 సెకన్లు 60 సెకన్లు ఇస్తారు. వారు కోరుకున్న సెకన్లను బట్టి అప్పటి వరకు వారి వద్దనున్న మొత్తం మూడు రెట్లు నాలుగు రెట్లు లభిస్తుంది. జత చేయడంలో ఒక తప్పు చేసినా అప్పటివరకు వారి వద్ద నున్న మొత్తం సగమై పోతుంది. ఈ విధంగా షో ముగుస్తుంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment