ఇండస్ట్రీలో ఏ హీరోని ఎప్పుడు ఛీత్కరిస్తారో? ప్రైవేట్ ఛానెళ్లలో ఏ హీరోని ఆకాశానికి ఎత్తేస్తారన్న విషయం మీద ఇప్పటికీ తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నారుూ అంటే - పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా - ‘దబాంగ్’ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది కదాని - సల్మాన్ ఖాన్ పేరు చెప్పుకొని ‘బిగ్ బాస్-4’ స్థాయిని టిఆర్‌పిలో స్థిరం చేద్దామనుకుంటే - అస్సలు కుదర్లేదని వాపోతున్నార్ట నిర్వాహకులు. ఆఖరికి కంటెస్ట్‌లు సైతం పూర్తి స్థాయిలో నిరాకరణోద్యమాన్ని చేపట్టడంతో - హాలీవుడ్ నుంచీ పమేలా ఆండర్సన్‌ని కోట్ల ఖర్చు మీద రప్పించారు. ఈ ‘బే వాచ్’ అమ్మాయి ముచ్చటగా మూడు రోజులు మురిపించి తళుక్కున అదృశ్యమైంది. మళ్లీ ‘బిగ్ బాస్-4’కి తలనొప్పి మొదలైంది. మరోవైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టిఆర్‌పి విస్తృత స్థాయిలో పెరిగిపోవటంతో ‘బిగ్ బాస్’కి గుండెల్లో దడ. ఇలా ఎవరికి వారే - టిఆర్‌పి బెడద నుంచీ తప్పించుకోటానికి చేస్తున్న కుతంత్రాలూ కుట్రలూ అన్నీ ఇన్నీ కావు. ఇక - ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సంగతికి వస్తే - ప్రేక్షకుల్లో ఒక సందిగ్ధావస్థ. ఒకవేళ అభ్యర్థి గనక కోటి రూపాయలు గెలుచుకుంటే - ‘జాక్‌పాట్’ క్వొశ్చన్ (దీనికి ఐదు కోట్ల బహుమతి)కి సరైన సమాధానం ఇవ్వకుంటే - ఉన్నపళంగా కోటి రూపాయల నుంచీ 3.5 లక్షలకు దిగిపోవటం ఏమిటి అన్న ప్రశ్న వెంటాడుతోంది. ఈ మెలోడ్రామాకి అర్థం ఏమిటో విడమరిస్తే బావుంటుందన్నది వీక్షకుల ఆలోచన. ఈ ప్రశ్నని పక్కన పెడితే - ‘కౌన్ బనేగా’ నిర్వాహకుడు సిద్దార్థ బసు కూడా ‘హోస్ట్’ల విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాట్ట. సినిమా అంటే మధ్యలో హీరోని తొలగించే ప్రసక్తే ఉండదు కాబట్టి - చచ్చినట్టు భరించాల్సిందే. కానీ - ఛానెల్ విషయంలో అలా కాదు. ప్రేక్షకులకు గానీ.. కంటెస్ట్‌లకు గానీ నచ్చకపోతే - తీసేయటం ప్రధానం. ప్రతి దానికీ టిఆర్‌పి ఒకటి ఉండటంతో ఆచితూచి అడుగు వేయాల్సిందే నంటాడు. ఇంకోవైపు అక్షయ్ కుమార్ ‘మాస్టర్ ఛెఫ్ ఇండియా’ ఇప్పుడిప్పుడే టిఆర్‌పి వేగాన్ని పుంజుకుంటోంది. ఈ ఇంటర్నేషనల్ ఫార్మేట్‌ని వొంటబట్టించుకోటానికి ఇన్నాళ్లు పట్టిందని అంటాడు అక్షయ్ కూడా.
ఈ ధోరణి ఇదైతే - ఇక - కార్యక్రమ నిర్వాహకుల కోపతాపాలనూ ఆవేశ కావేశాలనూ అదుపు చేయటం మా వల్ల కావటం లేదని ఛానెళ్లు చేతులెత్తేస్తున్నాయి. కోట్ల కొద్దీ జనం వీక్షించే కార్యక్రమంలో ఏ మాత్రం మాట తూలినా అది పృథ్విని దాటుతుందన్న సత్యాన్ని మరచి - ఛానెళ్లలో వారి వారి వాగ్ధాటిని చూపటం ఎంతవరకూ సబబు అన్నది మరో ప్రశ్న. ఇప్పటికే ‘బిగ్ బాస్-4’లో కంటెస్ట్‌ల మాటలు శృతిమించి రాగాన పడుతున్నాయని - కోర్టు సైతం వాతలు పెట్టినప్పటికీ.. రాఖీ నోరు అదుపులో పెట్టుకోక పోవటంవల్ల - ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడన్న అభియోగాన్ని తలకెత్తుకున్నా.. ఇలాంటి సంఘటనల వల్లనైనా - ఆవేశాన్ని నిలువరించుకుంటే బావుంటుందన్నది మరో వాదన.

Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment