కోచి: దేశంలో తొలి వెబ్ టీవీ త్వరలో అందుబాటులోకి రానుంది. కోచికి చెందిన వైబ్స్ విజువల్&మీడియా 'ఇండియావైబ్స్'ను జనవరి ఒకటి నుంచి ప్రారంభించనుంది. టీవీకి అవసరమైన వార్తలు, ఇతర అంశాలను టీవీనే సమకూర్చుకుంటుంది. కనులు తిప్పకుండా చూసే స్థాయిలో కథావస్తును అందించడం ఈ మాధ్యమానికి పెద్ద సవాలని.. అందువల్లే ఇందులోకి ప్రవేశించడానికి ఎవరూ గట్టిగా కృషి చేయలేదని వైబ్స్ విజువల్ వ్యవస్థాపకుడు ఆండ్రిన్ మెన్‌డెజ్ అన్నారు. తొలిదశలో ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరులను కేంద్రాలుగా చేసుకుని పని చేయనున్నట్లు చెప్పారు. తర్వాత చిన్న నగరాలకు విస్తరిస్తామని అన్నారు. జనవరి ఒకటి నుంచి www.indiavibes.tv లోకి ప్రవేశించి వెబ్ టీవీని సందర్శించవచ్చు.
Source: www.eenadu.net

emitee greek-roman lipi?
ReplyDeleteidhi eenadu paper font... ippudu miru chudandi.....
ReplyDelete