Thursday, January 6, 2011

కోక్‌ ప్రచార కర్తగా సచిన్‌

న్యూఢిల్లీ : ప్రసిద్ధ శీతల పానీయం కంపెనీ కోకకోలాతో సచిన్‌ టెండూల్కర్‌తో తమ బ్రాండ్‌కు మూడేళ్ల పాటు ప్రచార కర్తగా నియమించుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.20 కోట్ల వరకు వుండవచ్చు. రెండున్నరేళ్ల క్రితం కోక్‌ పోటీదారు పెప్సీ సచిన్‌ను తమ బ్రాండ్‌ ప్రచార కర్త నుంచి తొలగించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 3 సంవత్సరాల పాటు కొనసాగే కాంట్రాక్టు మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌కు ప్రతి ఏడాది రూ.6 కోట్లు చెల్లిస్తుందని అంటున్నారు. వచ్చే నెల నుంచి కొత్త కోక్‌ టీవీ కమర్షియల్‌ను టెండూల్కర్‌తో ప్రారంభిస్తుంది. దీనికి టీవీ కమర్షియల్‌ రచయిత ప్రసూన్‌ జోషి స్క్రి ప్టు రాస్తున్నారు. దీనిపై కోకాకోలా కంపెనీని విచారించగా ఇప్పటి వరకు తాము సచిన్‌తో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని చెప్పారు. తమ బ్రాండ్‌ను ప్రచారం చేసేందుకు తాము సెలెబ్రెటీలతో చర్చిస్తుంటామని కంపెనీ వారు చేప్పారు. ఒప్పందం జరిగితేనే తాము బహిరంగంగా ప్రకటిస్తామని చెప్పారు. దీనిపై స్పందించేందుకు వరల్ట్‌ స్పోర్ట్సు గ్రూపు (టెండూర్కలర్‌) దీనికి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.
 
వారు దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పెప్సీకోతో సచిన్‌ కాంట్రాక్టు 2008లో ముగిసింది. పెప్సీకో యంగి స్తాన్‌ కాన్సెప్ట్‌లో యువకులైన సినీ నటులు రణబీర్‌కపూర్‌, దీపక పదుకొనేను తీసుకున్నారు. అయితే గత 18 నెలల నుంచి సచిన్‌ తన హవా కొనసాగిస్తున్నారు. 51వ టెస్ట్‌ సెంచరీని సాధించాడు. రికార్డుల రికార్డులు బద్దలుకొడుతున్నాడు. డిసెంబర్‌లో ఆటోమొబైల్‌ లుబ్రికెంట్‌ (కందెన) కెస్ట్రాల్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంట్రాక్టు విలువ ఎంత తెలియరాలేదు. అయితే తాజా వెలుగులోకి వచ్చిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మద్యం కంపెనీ సచిన్‌ను సంప్రతించ తమ లిక్కర్‌ కంపెనీకి ప్రచార కర్తగా చేయమన్నారని, దీనికి రూ.20 కోట్లు ఆఫర్‌ చేసినట్లు, సచిన్‌ తిరస్కరించినట్లు వార్తలు వెల్లడయ్యాయి. మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం సచిన్‌ టెండూల్కర్‌ సచిన్‌ ఒక కంపెనీ ప్రచార కర్తగా పనిచేసేందుకు రూ.5 కోట్లు వసూలు చేస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న కంపెనీలు తోషిబా, ఐటీసీ, బూస్ట్‌, కెనన్‌, ఆర్‌బీఎస్‌, రెనాల్డ్‌‌స, జెపీ సిమెంట్స్‌, అవివాలు.
 
Source: www.suryaa.com

No comments:

Post a Comment