Monday, January 31, 2011

ఓ టీవీ చానెల్ తనపై దుష్ప్రచారం : చిరంజీవి

అనంతపురంపర్యటనలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఓ టీవీ చానెల్ పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. తాను ఏం చేశానా  భూతద్దంలో చూపుతోందని ఆయన అన్నారు. మీడియాలో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని, వారు ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సాక్షి మీడియా పేరు గానీ జగన్ పేరు గానీ ఎత్తనప్పటికీ చిరంజీవి సాక్షి మీడియాను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలుచేశారని అందరికీ అర్థమయ్యే విషయమే.
 

తనకు అధికార దాహం లేదని, ప్రజలు అవకాశం ఇస్తే సేవ చేస్తానని ఆయన చెప్పారు. ప్రజల కోసం పనిచేసే పార్టీలన్నీ తమకు మిత్రపక్షాలేనని అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఏం చేయాలనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రాబోవని, ప్రజలు ఎన్నికల భారాన్ని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ఓ పత్రిక, ఓ చానెల్ తనను రాజకీయాల నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్సించారు. 

Source: www.gulftelugu.com

No comments:

Post a Comment