Friday, January 7, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక: టీవీ చానెళ్లపై మితిమీరిన ఆంక్షలు

హైదరాబాద్: న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) ఆంక్షలు అమలు అవుతుండడంతో రాష్ట్రంలోని తెలుగు టీవీ చానెళ్లు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేయడం మానేశాయి. హింసకు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రసారం చేయడం ఆపేశాయి. ఎన్‌బిఎ మార్గదర్శక మార్గాలను ఉల్లంఘించే మీడియాపై చర్యలు తీసుకుంటామని డిజిపి అరవింద రావు శుక్రవారం మీడియా ప్రతినిధుల వద్ద స్పష్టం చేశారు. నిరసనలు, ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలను కూడా టీవీ చానెళ్లు నిలిపేశాయి.

ఆందోళనలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలను కూడా ఆపేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలంయ వద్ద ఒకటి, రెండు ఒబి వ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారాలను అనుమతించేది లేదని, దానివల్ల హింసను నిరోధించగలుగుతామని పోలీసులు అంటున్నారు. ఒయులో జరిగిన రాళ్ల దాడిని ప్రసారం చేయడానికి ప్రయత్నించిన ఓ చానెల్ ప్రసారాలను కొద్దిసేపు ఆపేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం రెండో సారి కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని, పోలీసులు విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ధ్రువీకరించే మార్గాలు కూడా లేకుండా పోయాయి. ఉస్మానియాలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment