Friday, January 28, 2011

ఛానళ్ళకూ స్వీయ పరీక్ష అవసరం

పోటీని తట్టుకునే ఆలోచనతో ఏదో ఒకటి రూపొందించి ప్రసారం చేసే కార్యక్రమాలు వీక్షకులకు మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అనే విషయాన్ని టీ.వీ. ఛానళ్ళు స్వీయ పరీక్ష చేసుకోవాలి. అలాగే కొన్ని టీవీ ఛానళ్ళలో కొందరి యాంకర్ల భాష బాగుండటం లేదని, కొందరు యాంకర్ల వస్త్రధారణ కూడా మారాల్సి వుందని రెవిన్యూ (దేవాదాయ) ముఖ్య కార్యదర్శి డా.కె.వి. రమణాచారి అన్నారు.

విమర్శలు నిర్ధుష్టంగా చేస్తే బాగుంటుంది తప్ప అదే పనిగా ఏదో విమర్శ చేస్తూ సమయం వృధా చేయడం కంటె మంచి కార్యక్రమాలకూ రూప కల్పనకు ఛానళ్లు కృషి చేయాలని సూచించారు హెచ్‌.ఎం.టీ.వీ సి.ఇవో కె. రామచంద్రరావు. కొన్ని రకాల వార్తలు కాని, కార్యక్రమాలు కాని ప్రజలు తిరస్కరిస్తారనే భయం వుంటే సంపాదకులు, ఛానళ్ల యాజమాన్యాలు జాగ్రత్తగా పని చేస్తాయన్నారాయన. అప్పుడే సమాజానికి మేలు చేసే వార్తలు పత్రికల్లో, కార్యక్రమాలు ఛానళ్లలో వెలువడుతాయన్నారు.

పోటీ తత్వం బాగా వున్నప్పటికీ సామాజిక బాధ్యతతో స్వీయ నియంత్రణకి ప్రాధాన్యత ఇస్తూ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు ప్రసారం చేయటం మంచిదని, సమాజాన్ని చైతన్య పరిచేలా కార్యక్రమాలు వుండాలి కానీ, భయాందోళనలు కలిగించే విధంగా వుండకూడదని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ జనవరి 13న హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని కళాసుబ్బారావు వేదికపై డా. నాగసూరి వేణుగోపాల్‌ రచించిన ఛానళ్ల హోరు భాష తీరు, టీవి ముచ్చట్లు పుస్తక ఆవిష్కరణ సభలో.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment