Tuesday, January 4, 2011

ఆశించటం దండుగ?!

2008 వరకూ ‘కె’ రొటీన్ సీరియళ్లు రాజ్యమేలితే - 2009 చివరికి అదే కొనసాగి - ఆఖరికి 2010లో రూపాంతరం చెందాయనుకుని సంతృప్తి చెందటం మినహా వొరిగిందేమీ లేదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ‘సాగి’పోయే సీరియళ్ల స్థానే రియాలిటీ షోలూ, వెరైటీ మొహాలతో ఛానెళ్లు కొంత కళకళ లాడాయి. ఫ్యామిలీ డ్రామాలతోపాటు అత్తా కోడళ్ల యుద్ధాలూ.. అక్రమ సంబంధాల కొట్లాటలూ.. ‘పవిత్ర రిస్తా’లతో ‘ప్రతిజ్ఞ..’లు ఇలా ఎనె్నన్నో. వీటిలో ‘ససురాల్ ఝెండా ఫూల్’ కథ రొటీన్‌కి భిన్నంగా ఉండి వీక్షకుల మనసులను ఉర్రూతలూగించింది. మధ్యతరగతి అబ్బాయి/ గొప్పింటి అమ్మాయి మధ్య ప్రేమాయణం ఫార్ములానే అయినప్పటికీ కథని నడిపించిన తీరువల్ల ‘టిఆర్‌పి’ పుంజుకుంది. స్టార్ ఇండియా ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ బెహెల్ మాట్లాడుతూ - ఎనె్నన్నో రియాలిటీ షోలను తలదన్ని ‘ససురాల్..’ ఇంతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం ఏర్పరచుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదు. చక్కటి స్క్రిప్ట్ ఉంటే ఏదైనా సాధ్యమే ననటానికి ఇది తాజా ఉదాహరణ అంటారు. ఇక ‘పవిత్ర రిస్తా’లోనూ చెప్పుకోదగ్గ విషయం లేకపోయినప్పటికీ - పెళ్లి, విడాకులు, ప్రేమ కబుర్లతో ‘్ఫక్షన్’ని తలపించింది. అదే బాటలో నడిచిన ‘బిదాయి’లోనూ ఫిక్షన్ బోలెడంత శాటిఫాక్షన్ కలిగించిందని అంతా ఒప్పేసుకున్నారు. స్టార్ ప్లస్ ‘ప్రతిజ్ఞ’ కూడా. ఇక రాత్రి 11 గంటల స్లాట్‌లో ప్రసారమైన ‘కాలీ’ టిఆర్‌పిని చేరుకోలేక పోయింది. మహిళలపై అఘాయిత్యాల కథాంశం ఇది. రుచికా గిర్‌హోత్రా సంఘటన ఆధారంగా నిర్మించిన ఈ సీరియల్ కూడా జనాన్ని ఆకట్టుకోలేదు. నూతన సంవత్సరంలోనైనా -్ఛనెళ్లు ఈ ‘సీరియళ్ల’ బెడదను తప్పిస్తాయేమో చూద్దాం.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment